Jump to content

జస్వీందర్ సింగ్ సంధు

వికీపీడియా నుండి
మన్‌దీప్ సింగ్ చాతా

పదవీ కాలం
1991 – 2000
ముందు హర్మోహిందర్ సింగ్ చతా
తరువాత బల్బీర్ సింగ్
నియోజకవర్గం పెహోవా

పదవీ కాలం
2014 – 2019
ముందు హర్మోహిందర్ సింగ్ చతా
తరువాత సందీప్ సింగ్
నియోజకవర్గం పెహోవా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ఐఎన్ఎల్‌డీ
వృత్తి రాజకీయ నాయకుడు

జస్వీందర్ సింగ్ సంధు హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు పెహోవా నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

జస్వీందర్ సింగ్ సంధు జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1991 శాసనసభ ఎన్నికలలో పెహోవా నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి బల్బీర్ సింగ్‌పై 5,892 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ సమతా పార్టీలో చేరి 1996 శాసనసభ ఎన్నికలలో సమతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బల్బీర్ సింగ్ సైనీపై 13,595 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. జస్వీందర్ సింగ్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలో చేరి 2000 శాసనసభ ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి బల్బీర్ సింగ్ సైనీపై 14,091 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

జస్వీందర్ సింగ్ 2005, 2009 శాసనసభ ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి తిరిగి 2014 శాసనసభ ఎన్నికలలో నాల్గొవసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

జస్వీందర్ సింగ్ క్యాన్సర్‌తో బాధపడుతూ PGIMER ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2019జనవరి 19న మరణించాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Hindustantimes (15 September 2019). "Haryana Assembly Polls: Late Jaswinder Singh Sandhu, Pehowa MLA". Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
  2. Business Today (19 January 2019). "INLD MLA Jaswinder Sandhu passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024. {{cite news}}: |last1= has generic name (help)
  3. The Times of India (19 January 2019). "INLD MLA Jaswinder Sandhu passes away". Archived from the original on 25 September 2022. Retrieved 17 November 2024.