జానీ లీవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జానీ లీవర్
2011లో జానీ లీవర్
జన్మ నామంజాన్ ప్రకాశరావు జనుమల
జననం (1957-08-14) 1957 ఆగస్టు 14 (వయసు 66)
[ummanapalli] [కనిగిరి]], ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్[1]
భార్య లేక భర్తసుజాత జనుమల
పిల్లలుజామీ లీవర్
జెస్సీ జనుమల
బంధువులుజిమ్మీ మోసెస్ (సోదరుడు)
సంతకముదస్త్రం:Johny Lever signature.jpg

జానీ లీవర్గా సుప్రఖ్యాతుడైన జాన్ ప్రకాశరావు జనుమల (హిందీ: जॉन प्रकाश राओ जनुमाला; 14 August 1957, కనిగిరి, ప్రకాశం జిల్లాలో),[2] భారతీయ సినీనటుడు, హిందీ చిత్రసీమలో సుప్రసిద్ధి పొందిన హాస్యనటుల్లో ఒకరు.[3] లీవర్ 13మార్లు ఫిలింఫేర్ హాస్యపాత్రలో ఉత్తమ ప్రదర్శన విభాగానికి పురస్కారం కొరకు నామినేట్ కాగా, రెండుసార్లు (దీవానా మస్తానా (1997), దుల్హే రాజా (1998)ల్లో నటనకు) పురస్కారం పొందారు. 1984లో ఆయన నటజీవితాన్ని ఆరంభించి, మూడువందలకు పైగా బాలీవుడ్ సినిమాల్లో నటించారు.[4][5]

వీరి తల్లిదండ్రులు కరుణమ్మ, జనుముల ప్రకాశరావు. ప్రకాశరావు, ముంబాయిలోని హిందుస్థాన్ లీవర్ ఉద్యోగి కావడంతో, వారు కుటుంబంతో ముంబాయిలోనే స్థిరపడ్డాడు. జానీ లీవర్ ముంబాయిలోనే జన్మించాడు. ఆయన బాల్యమంతా అక్కడే గడిచింది. ఆయన ఇంగ్లీషు, హిందీ ఎంత ధారాళంగా మట్లాడగలరో, తెలుగులోనూ అంత బాగా మట్లాడగలడు. ఆయన మూడు దశబ్దాలకుపైగా 300 చిత్రాలలో నటించాడు. వీరి బంధులంతా దర్శి, కనిగిరి, సంతనూతలపాడు ప్రాంతాలలో ఉన్నారు. అందువలన ఆయన జిల్లాకు వస్తూనే ఉంటాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "Comedy is serious business: Johnny Lever". www.thehindu.com. Retrieved 23 September 2014.
  2. "14th August 1957: Popular Bollywood Actor and Comedian Johnny Lever is Born". Retrieved 2014-01-05.
  3. Shyam Benegal; William Van Der Heide (12 June 2006). Bollywood Babylon: Interviews With Shyam Benegal. Berg. pp. 196–. ISBN 978-1-84520-405-1. Retrieved 31 May 2012.
  4. Comedy is serious business: Johnny Lever - The Hindu
  5. "Johnny Lever feels his talent is under-utilised - Hindustan Times". Archived from the original on 2014-01-04. Retrieved 2015-06-02.
  6. ఈనాడు ప్రకాశం; 2015,అక్టోబరు-5; 9వపేజీ