జి.ఎన్.సాయిబాబా
జి.ఎన్.సాయిబాబా | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1967 అమలాపురం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (అప్పుడు- తూర్పుగోదావరి జిల్లా), ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
మరణం | 2024 అక్టోబరు 12 నిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్, భారతదేశం | (వయసు 57)
వృత్తి | మానవ హక్కుల ఉద్యమకారుడు, ప్రొఫెసర్, రచయిత . |
భాష | తెలుగు, ఆంగ్లం, హిందీ |
జాతీయత | భారతీయుడు |
పూర్వవిద్యార్థి |
|
జీవిత భాగస్వామి | వసంతకుమారి [1][2] |
గోకరకొండ నాగసాయిబాబా (1967 - 2024 అక్టోబరు 12) భారతీయ పండితుడు, రచయిత, మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్. ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆనంద్ కళాశాలలో ఇంగ్లిష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేసారు.[3] ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఆయనను 2017లో జైలులో నిర్బంధించగా, 2024లో నిర్దోషి అని తేలడంతో విడుదల చేసారు.
జీవిత విశేషాలు
[మార్చు]గోకరకొండ నాగ సాయిబాబా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అమలాపురంలో పేద రైతు కుటుంబంలో జన్మించారు. తన భార్య తెలిపిన విషయాల ప్రకారం వారి గృహానికి విద్యుత్ సౌకర్యం కూడా లేదు.[4] ఐదేళ్ల వయసులోనే పోలియో సోకి రెండు కాళ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. స్థానికంగా విద్యాభ్యాసం చేసిన తరువాత అమలాపురం లోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసారు.[5] హైదరాబాదు విశ్వవిద్యాలయం నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేసారు.[6] అతను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ లో కూడా విద్యాభ్యాసం పూర్తి చేసారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆనంద్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకునిగా చేరారు.[7] 2013 లో పీహెచ్డీ పూర్తిచేశారు.[8]
ఉద్యమ జీవితం
[మార్చు]అమలాపురంలో గ్రాడ్యుయేషన్ చేసున్న కాలంలోనే అతను వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ (ఏఐఆర్‌పీఎఫ్) లో చేరాడు. 1992లో హైదరాబాదు విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు ఆ ఫోరమ్ ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శి అయ్యాడు. 1995 నాటికి ఆ సంస్థకు ఇండియా ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆ తర్వాత అతను ఆర్డీఎఫ్ అనే సంస్థలో పని చేశాడు. పోలీసులు, హోంశాఖ అధికారుల ప్రకారం అతను పనిచేసిన సంస్థలన్నీ మావోయిస్టు అనుబంధ సంస్థలు.
ఆరోపణలు
[మార్చు]సాయిబాబాకు మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనే అరోపణతో 2014 లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసారు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టంసెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసును 2017 వరకు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు శిక్ష విధించింది. అతను నాగ్‌పూర్ జైలులోని ’అండా సెల్‘లో ఏకాంతచెరలో ఉన్నాడు. దీంతో 2021 ఫిబ్రవరిలో ఆయనను అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి నుంచి తొలగించారు.[9]
సాయిబాబా గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు జీవితఖైదు తీర్పుపై ముంబాయి హైకోర్టులో అప్పీల్ చేశాడు. యూఏపీఏ కేసులో పోలీసులు విధివిధానాలు పాటించలేదని కోర్టుకు తెలిపాడు. దీంతో ముంబాయి హైకోర్టు 2022లో సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు సాయిబాబా విడుదలపై స్టే విధించింది. ఈ కేసును తిరిగి విచారించాలని ముంబాయి హైకోర్టును ఆదేశించింది. కేసును విచారించిన ముంబాయి హైకోర్టు జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా తీర్పు ఇవ్వడంతో ఆయన 2024 మార్చి 8న నాగ్‌పూర్ జైలు నుంచి ముంబాయి హైకోర్టు తీర్పు ఇచ్చిన రెండు రోజుల అనంతరం విడుదలయ్యాడు.[10][11]
మరణం
[మార్చు]జీఎన్ సాయిబాబా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చేరి చికిత్స పొందుతూ 2024 అక్టోబరు 12న మరణించాడు.[12][13] ఆయనకు భార్య వసంత, కుమార్తె మంజీరా ఉన్నారు.[14]
మూలాలు
[మార్చు]- ↑ "Five years on, no relief for jailed Delhi University professor Saibaba". The Hindu (in ఇంగ్లీష్). 2019-05-09. Retrieved 2020-12-19.
- ↑ "Court relied on deposition of semi-literate witness: Saibaba's wife". The Hindu (in ఇంగ్లీష్). 2017-04-04. Retrieved 2020-12-19.
- ↑ "GN Saibaba: The revolutionary in Delhi University". Times of India (in ఇంగ్లీష్). 2013-09-23. Retrieved 2020-12-19.
- ↑ "GN Saibaba: The revolutionary in Delhi University". Times of India (in ఇంగ్లీష్). 2013-09-23. Retrieved 2020-12-19.
- ↑ "GN Saibaba: The revolutionary in Delhi University". Times of India (in ఇంగ్లీష్). 2013-09-23. Retrieved 2020-12-19.
- ↑ "Pages smuggled out of Nagpur's central prison to be published as Saibaba's latest book". The New Indian Express (in ఇంగ్లీష్). 2016-05-26. Retrieved 2020-12-19.
- ↑ "Delhi University professor Saibaba, arrested for Maoist links, gets bail". India Today (in ఇంగ్లీష్). 2016-04-04. Retrieved 2020-12-19.
- ↑ "ఈ చలికాలం దాటి బతకలేనేమో!". BBC News తెలుగు. Retrieved 2020-12-19.
- ↑ The Indian Express (5 March 2024). "Who is professor GN Saibaba?" (in ఇంగ్లీష్). Retrieved 12 October 2024.
- ↑ Andhrajyothy (8 March 2024). "స్వేచ్ఛా ప్రపంచంలోకి సాయిబాబ". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.
- ↑ BBC News తెలుగు (5 March 2024). "ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు, ఈ కేసు పూర్తి వివరాలివీ..." Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.
- ↑ Andhrajyothy (12 October 2024). "డీయూ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మృతి". Retrieved 12 October 2024.
- ↑ Eenadu (12 October 2024). "దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత". Retrieved 12 October 2024.
- ↑ BBC News తెలుగు (12 October 2024). "ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మృతి". Retrieved 12 October 2024.