Jump to content

జూబ్లీహాల్

వికీపీడియా నుండి
జూబ్లీహాల్
సాధారణ సమాచారం
రకంరాజ భవనం
నిర్మాణ శైలిఇండో-పర్షియన్
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
పూర్తి చేయబడినది1913

జూబ్లీహాల్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న భవనం. 1913లో నిజాం ఏడవ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ జూబ్లీహాల్‌ను ఇండో-పర్షియన్ శైలిలో బాగ్-ఇ-ఆమ్ (పబ్లిక్ గార్డెను)లో నిర్మించాడు.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

చరిత్ర

[మార్చు]

తెలంగాణ సాగునీటిరంగ పితామహుడు, నిజాం ప్రభుత్వంలో ప్రజాపనుల విభాగం, ఇరిగేషన్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీరైన అలీ నవాజ్ జంగ్ బహాదుర్ ఆధ్వర్యంలో ఈ జూబ్లీహాల్ ను నిర్మాణం జరిగింది.[2] ఇందులో ఉస్మాన్ అలీ ఖాన్ సభలు, సమావేశాలు నిర్వహించేవాడు.[3]

తన 25 సంవత్సరాల పాలన పూర్తైన సందర్భంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ భవనంలో సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలను నిర్వహించాడు. అప్పటినుండి ఈ భవనం జూబ్లీహాల్‌గా పిలువబడుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉస్మాన్ అలీఖాన్ రాజచిహ్నంతో బంగారు పూత పూసిన సింహాసనం రూపొందించారు. ఈ సింహాసనం ప్రస్తుతం పురానా హవేలి లోని నిజాం మ్యూజియంలో ఉంచబడింది.[1]

ఈ ఉత్సవాల సందర్భంగా నిజాం ప్రభువు 1,000,000 డాలర్ల విలువైన బహుమతులను, జ్ఞాపికలు అందుకున్నాడు. దర్బార్ నుండి రాయల్ పనులు, చిత్రలేఖనాలు ఇప్పటికీ భవనాన్ని అలంకరించాయి. రాచరిక పనలు, చిత్రలేఖనాలతో దర్బార్ నుండి భవనం మొత్తం అలంకరించబడ్డాయి.

నిర్మాణం

[మార్చు]
జూబ్లీహాల్

ఈ భవనం ఇండో-పర్షియన్ శైలిలో నిర్మించిన ముఖభాగాన్ని కలిగివుంటుంది. ఈ భవనం మధ్యభాగంలో నిజాం యొక్క సింహాసనంకోసం నిజాం కిరీటం ఆకారంలో ఒక వేదిక నిర్మించబడింది. ఇది మధ్యలో ఉన్న తెల్ల చతురస్రంగా స్పష్టంగా కనిపిస్తుంది.

దీనిలోవున్న దీర్ఘచతురస్రాకారపు పెద్ద గది ప్రస్తుత భవనానికి తరలించడానికి ముందు 27 సంవత్సరాలపాటు రాష్ట్ర శాసన మండలిగా పనిచేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 21 April 2018.
  2. నమస్తే తెలంగాణ, వ్యాసాలు (7 November 2014). "తెలంగాణ సాగునీటిరంగ పితామహుడు". Retrieved 21 April 2018.
  3. 3.0 3.1 తెలుగు న్యూస్, ట్రావెల్. "హైదరాబాద్ లో నిజాం ప్యాలెస్ ల ఒక్కరోజు పర్యటన !". www.telugu.annnews.in. S. Ashok kumar. Retrieved 21 April 2018.[permanent dead link] ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "హైదరాబాద్ లో నిజాం ప్యాలెస్ ల ఒక్కరోజు పర్యటన !" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు