జెస్టోర్
JSTOR wordmark.svg | |
Screenshot | |
సైటు రకం | డిజిటల్ గ్రంథాలయం |
---|---|
సభ్యత్వం | Yes |
లభ్యమయ్యే భాషలు | ఇంగ్లీషు (ఇతర భాషల్లోని కంటెంటు కూడా ఉంటుంది) |
యజమాని | ఇథాకా హార్బర్స్[1] |
సృష్టికర్త | ఆండ్రూ డబ్ల్యు మెలన్ ఫౌండేషన్ |
ప్రస్తుత పరిస్థితి | Active |
JSTOR (జర్నల్ స్టోరేజీకి సంక్షిప్త పదం) అనేది 1995లో న్యూయార్క్ నగరంలో స్థాపించబడిన డిజిటల్ లైబ్రరీ . ఒరిజినల్‌గా ఇందులో అకడమిక్ జర్నల్స్ యొక్క డిజిటల్ పాత సంచికలు ఉండేవి. ఇప్పుడు పుస్తకాలు, ఇతర ప్రాథమిక మూలాధారాలతో పాటు మానవీయ శాస్త్రాలు, సాంఘిక శాస్త్రాలలో వెలువడే పత్రికల ప్రస్తుత సంచికలు కూడా ఉంటాయి. [2] ఇది దాదాపు 2,000 పత్రికల పూర్తి-పాఠ్య శోధనలను అందిస్తుంది.
2013 నాటికి, 160 కంటే ఎక్కువ దేశాలలో 8,000 కంటే ఎక్కువ సంస్థలు JSTORను వాడుకుంటాయి.[3] అందుబాటు చాలా వరకు సబ్‌స్క్రిప్షన్ ద్వారానే ఉంటుంది గానీ సైటు లోని కొంత భాగం పబ్లిక్ డొమైను లోనే ఉంటుంది. ఓపెన్ యాక్సెస్ కంటెంటు ఉచితంగా లభిస్తుంది.[4]
JSTOR ఆదాయం 2015లో $8.6 కోట్లు. [5]
చరిత్ర
[మార్చు]1972 నుండి 1988 వరకు ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడైన విలియం G. బోవెన్ [6] 1994లో JSTORను స్థాపించారు. తొలుత JSTOR ను, పెరుగుతున్న వైజ్ఞానిక పత్రికల వలన లైబ్రరీలు - ముఖ్యంగా పరిశోధన, విశ్వవిద్యాలయ గ్రంథాలయాలు - ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గంగా భావించారు. ఇన్ని పత్రికల సమగ్ర సేకరణను నిర్వహించడానికి ఖర్చు పరంగా, స్థలం పరంగా గ్రంథాలయాలకు చాలా ఖరీదైన పనిగా మారింది. JSTOR అనేక పత్రికలను డిజిటలైజ్ చేయడంతో, లైబ్రరీలు ఆ పత్రికలను నిల్వచేయడాన్ని అవుట్‌సోర్స్ చేయడానికి వీలు కలిగించింది. అవి దీర్ఘకాలికంగా అందుబాటులో ఉంటాయనే విశ్వాసం కూడా వాటికి కలిగింది. ఆన్‌లైన్ యాక్సెస్, పూర్తి-పాఠ్యాన్ని వెతక గలిగే సౌలభ్యం JSTOR తో నాటకీయంగా మెరుగుపడింది.
ప్రారంభంలో బోవెన్, పంపిణీ కోసం CD-ROMలను ఉపయోగించాలని భావించాడు. [7] అయితే, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం యొక్క కంప్యూటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ అయిన ఇరా ఫుచ్స్, CD-ROM ల సాంకేతికతకు కాలం చెల్లిపోతోందని, నెట్‌వర్క్ పంపిణీ వలన రిడెండెన్సీ తొలగిపోయి, అందుబాటు అవకాశాలు పెరుగుతాయనీ చెప్పి బోవెన్‌ను ఒప్పించింది. (ఉదాహరణకు, ప్రిన్స్‌టన్ యొక్క అన్ని అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్ భవనాలు 1989 నాటికి ఒక నెట్‌వర్కు లోకి అనుసంధానమయ్యాయి; విద్యార్థి వసతి గృహాల నెట్‌వర్కు 1994లో పూర్తయింది; ప్రిన్స్‌టన్‌లో ఉన్న క్యాంపస్ నెట్‌వర్క్‌లు క్రమంగా, BITNET, ఇంటర్నెట్ వంటి పెద్ద నెట్‌వర్క్‌లకు అనుసంధానమయ్యాయి. ) JSTOR 1995లో ఏడు వేర్వేరు లైబ్రరీ సైట్‌లలో ప్రారంభించబడింది. తొలుత అందులో ఆర్థికశాస్త్రం, చరిత్ర పత్రికలు 10 ఉండేవి. దాని ప్రారంభ సైట్‌లకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా JSTOR ను మెరుగుపరచారు. ఏదైనా సాధారణ వెబ్ బ్రౌజర్ నుండి యాక్సెస్ చేయగల, పూర్తిగా శోధించదగిన సూచికగా దీన్ని మార్చారు. చిత్రాలు, గ్రాఫ్‌లను స్పష్టంగా, చదవగలిగేలా చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వాడారు. [8]
ఈ పరిమిత స్థాయిలో చేపట్టిన ప్రాజెక్టు విజయవంతం కావడంతో బోవెన్, అప్పటి JSTOR ప్రెసిడెంట్ కెవిన్ గుత్రీలు తమ సేకరణలో ఉన్న పత్రికల సంఖ్యను పెంచాలనుకున్నారు. రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో సమావేశమై, 1665లో ప్రారంభమైన ఫిలసాఫికల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ రాయల్ సొసైటీ లను డిజిటలైజ్ చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంపుటాలను JSTORకి చేర్చే పని 2000 డిసెంబరు నాటికి పూర్తయింది. [8] 1999లో JSTOR జాయింట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కమిటీతో భాగస్వామ్యాన్ని నెలకొల్పుకుని, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లోని 20కి పైగా ఉన్నత విద్యా సంస్థలకు JSTOR డేటాబేసును అందుబాటులో ఉండేలా మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో మిర్రర్ వెబ్‌సైట్‌ను రూపొందించింది. [9]
ప్రారంభంలో ఆండ్రూ W. మెల్లన్ ఫౌండేషన్ JSTORకి నిధులు సమకూర్చింది. 2009 జనవరి వరకు, JSTOR న్యూయార్క్ నగరంలోను, మిచిగాన్‌లోని ఆన్ అర్బర్‌లోనూ ఉన్న కార్యాలయాలతో స్వతంత్ర, స్వయం-పోషక లాభాపేక్షలేని సంస్థగా పనిచేసింది. అప్పుడు JSTOR లాభాపేక్షలేని ఇథాకా హార్బర్స్, ఇంక్. తో విలీనం చేసారు. [10] "వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాచారం, నెట్‌వర్కింగ్ టెక్నాలజీల పూర్తి ప్రయోజనాన్ని పొందడంలొ విద్యాసంస్థలకు సహాయం చేయడానికి దాన్ని అంకితం చేసారు".
కంటెంటు
[మార్చు]JSTOR కంటెంటును 900 కంటే ఎక్కువ మంది ప్రచురణకర్తలు అందిస్తున్నారు. [11] దాని డేటాబేసులో 50 పైచిలుకు విభాగాలలో 1,900 కంటే ఎక్కువ పత్రికా శీర్షికలున్నాయి. [12] ప్రతి వస్తువునూ 1 తో మొదలుకుని ఒక పూర్ణాంక విలువ ద్వారా ప్రత్యేకంగా గుర్తిస్తారు. దీనితో ఒక స్థిరమైన URL ని సృష్టిస్తుంది. [13]
అందుబాటు
[మార్చు]JSTOR ను ప్రధానంగా విద్యా సంస్థలు, పబ్లిక్ లైబ్రరీలు, పరిశోధనా సంస్థలు, మ్యూజియంలు, పాఠశాలలకు లైసెన్సు ఇస్తుంది. 150 కంటే ఎక్కువ దేశాలలో 7,000 కంటే ఎక్కువ సంస్థలకు అందుబాటు ఉంది. [2] ప్రస్తుత విద్యార్థులు, సిబ్బందితో పాటు వారి పూర్వ విద్యార్థులకు కూడా అందించడానికి చందా సంస్థలను అనుమతించే పైలట్ ప్రోగ్రామ్‌ను JSTOR అమలు చేస్తోంది. అలుమ్నై యాక్సెస్ ప్రోగ్రామ్ అధికారికంగా 2013 జనవరిలో ప్రారంభించారు. [14] కొన్ని జర్నల్ శీర్షికలకు వాటి ప్రచురణకర్త జారీ చేసే వ్యక్తిగత సభ్యత్వాలు కూడా అందుబాటులో ఉంటాయి. [15] JSTOR చందాదారులు కానివారు వ్యాసాలను చదవడానికి చేసే ప్రయత్నాలను అది అడ్డుకుంటుంది. ఏటా ఇటువంటి ప్రయత్నాలు 1.5 కోట్లుంటాయి.[16]
JSTOR ను స్వేచ్ఛగా అందుబాటులో ఉంచే అవకాశం గురించి విచారణ జరిగింది. హార్వర్డ్ లా ప్రొఫెసర్ లారెన్స్ లెస్సిగ్ ప్రకారం, JSTORని "ప్రపంచం మొత్తానికి స్వేచ్ఛగా అందుబాటులో ఉంచడానికి ఎంత ఖర్చవుతుంది, మేము మీకు ఎంత చెల్లించాలి? అని అడిగితే $250 మిలియన్లని సమాధానం వచ్చింది". [17]
ఆరోన్ స్వార్ట్జ్ సంఘటన
[మార్చు]2010 చివరలో, 2011 ప్రారంభంలో, ఆరోన్ స్వార్ట్జ్ అనే అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, ఇంటర్నెట్ కార్యకర్త, JSTOR యొక్క అకడమిక్ జర్నల్ వ్యాసాల సేకరణలో ఉన్న గణనీయమైన భాగాన్ని MIT డేటా నెట్‌వర్కును వాడి బల్క్-డౌన్‌లోడ్ చేసాడు. [18][19] దీని సంగతి తెలియగానే, ఆ రహస్య సందర్శకుడు ఎవరో తెలుసుకోడానికి గదిలో వీడియో కెమెరాను ఉంచి, సంబంధిత కంప్యూటర్‌ను తాకకుండా వదిలేశారు. స్వార్ట్జ్‌ను వీడియోలో పట్టుకున్నాక, డౌన్‌లోడ్‌ను నిలిపివేసారు. అతనిపై సివిల్ దావా వేయడానికి బదులుగా, 2011 జూన్‌లో JSTOR నుండీ డౌన్‌లోడ్ చేసిన డేటాను స్వార్ట్జ్ వెనక్కు అప్పగించాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు. [18][19]
తరువాతి నెలలో, ఫెడరల్ అధికారులు స్వార్ట్జ్‌పై అనేక " డేటా దొంగతనానికి"సంబంధించిన నేరాలను మోపారు, వాటిలో వైర్ మోసం, కంప్యూటర్ మోసం, రక్షిత కంప్యూటర్ నుండి చట్టవిరుద్ధంగా సమాచారాన్ని పొందడం, రక్షిత కంప్యూటర్‌ను దెబ్బతీయడం వంటివి ఉన్నాయి. [20][21] P2P ఫైల్ షేరింగ్ సైట్‌లలో పేపర్‌లను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో స్వార్ట్జ్ వ్యవహరించాడని ఆ కేసులో కక్షిదారు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. [19][22]
స్వార్ట్జ్ అధికారులకు లొంగిపోయాడు గానీ, ఆరోపణలన్నిటినీ తిరస్కరించాడు. $1,00,000 బెయిల్‌పై విడుదలయ్యాడు. 2012 సెప్టెంబరులో, US న్యాయవాదులు స్వార్ట్జ్‌పై అభియోగాల సంఖ్యను నాలుగు నుండి పదమూడుకి, 35 సంవత్సరాల జైలు శిక్ష, $1 మిలియన్ల జరిమానా విధించగలిగేలా, పెంచారు. [23][24] 2013 జనవరిల స్వార్ట్జ్ ఆత్మహత్య చేసుకున్నప్పటికి కేసు ఇంకా పెండింగులోనే ఉంది. అతని ఆత్మహత్య తర్వాత న్యాయవాదులు తమ అభియోగాలను ఉపసంహరించుకున్నారు. [25]
బహిరంగ అందుబాటును పెంచడం
[మార్చు]2011 సెప్టెంబరు 6 నుండి JSTOR, పబ్లిక్ డొమైన్ కంటెంట్‌ను ప్రజలకు ఎటువంటి ఛార్జీ లేకుండా అందుబాటులో ఉంచింది. [26][27] ఈ "ఎర్లీ జర్నల్ కంటెంట్" ప్రోగ్రామ్ JSTOR యొక్క మొత్తం కంటెంట్‌లో 6% ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్‌లో 1923కి ముందు, ఇతర దేశాలలో 1870కి ముందూ ప్రచురించబడిన 200 కంటే ఎక్కువ పత్రికల లోని 5,00,000 డాక్యుమెంట్‌లను వీటిలో ఉన్నాయి. [26][27][28] JSTOR కొంత కాలంగా ఈ మెటీరియల్‌ని ఉచితంగా అందజేసే పనిలో ఉన్నట్లు పేర్కొంది. స్వార్ట్జ్ వివాదం, దానిపై గ్రెగ్ మాక్స్‌వెల్ యొక్క నిరసన వలన ఈ విషయంలో JSTOR చొరవతో "ముందుకు వెళ్లడానికి" దారితీసింది. [26][27] 2017 నాటికి ఇతర పబ్లిక్ డొమైన్ కంటెంట్‌కు విస్తరించే ప్రణాళికలేమీ JSTOR వద్ద లేవు. "ఓ కంటెంటు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నంత మాత్రాన, దాన్ని ఎల్లప్పుడూ ఉచితం గానే అందించాలని మేము భావించం" అని పేర్కొంది. [29]
2012 జనవరిలో, JSTOR "రిజిస్టర్ & రీడ్" అనే పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. సేవ కోసం నమోదు చేసుకున్న వ్యక్తుల కోసం ఆర్కైవ్ చేసిన కథనాలకు పరిమిత నో-కాస్ట్ యాక్సెస్ ( ఓపెన్ యాక్సెస్ కాదు) అందిస్తుంది. 2013 జనవరిలో ఈ కార్యక్రమం ముగిసే సమయానికి రిజిస్టర్ & రీడ్‌లో తొలుత ఉన్న 76 ప్రచురణకర్తల నుండి 700 కంటే ఎక్కువ ప్రచురణకర్తలకు విస్తరించింది. [30] నమోదిత పాఠకులు ప్రతి క్యాలెండర్ నెలలో ఆరు వ్యాసాలను ఆన్‌లైన్‌లో చదవవచ్చు. కానీ PDFలను ప్రింటు గానీ, డౌన్‌లోడు గానీ చేసుకోలేరు. [31]
2014 నాటికి, JSTOR వికీపీడియాతో పైలట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. దీనిలో విశ్వవిద్యాలయ లైబ్రరీ వలె వికీ ఎడిటర్లకు కూడా వికీపీడియా లైబ్రరీ ద్వారా పఠన అధికారాలు ఇస్తారు. [32] [33]
వాడుక
[మార్చు]2012లో, JSTOR వినియోగదారులు దాదాపు 15.2 కోట్ల శోధనలు చేసారు. 11.3 కోట్ల కంటే ఎక్కువ వీక్షణలున్నాయి. 7.35 కోట్ల వ్యాసాలను డౌన్‌లోడ్ చేసుకున్నారు. [34] భాషా శాస్త్ర పరిశోధన కోసం, కాలక్రమంలో భాషా వినియోగంలో ధోరణులను పరిశోధించడానికి, పండితుల ప్రచురణలో లింగ భేదాలు, అసమానతలను విశ్లేషించడానికి JSTOR ఒక వనరుగా ఉపయోగపడుతోంది. కొన్ని రంగాలలో, ప్రతిష్టాత్మకమైన మొదటి, చివరి రచయిత స్థానాల్లో పురుషులే ఎక్కువగా ఉంటారని, ఏక-రచయిత పత్రాల రచయితలుగా స్త్రీలు గణనీయంగా తక్కువగా ఉంటారనీ ఈ విశ్లేషణల్లో తేలింది. [35][36][37]
CrossRef, అన్‌పేవాల్ డంప్‌ల ద్వారా కూడా JSTOR మెటాడేటా అందుబాటులో ఉంది. [38] 2020 నాటికి JSTOR హోస్ట్ చేసిన దాదాపు 30 లక్షల వర్క్‌లను చెల్లించే యాక్సెస్‌గాను, 2,00,000 పైచిలుకు ఓపెన్ యాక్సెస్‌లో అందుబాటులో ఉన్నట్లుగాను ఇవి గుర్తించాయి. (ప్రధానంగా మూడవ పార్టీ ఓపెన్ యాక్సెస్ రిపోజిటరీల ద్వారా).
మూలాలు
[మార్చు]- ↑ "About". Ithaka. Archived from the original on April 30, 2012. Retrieved October 25, 2009.
- ↑ 2.0 2.1 Genicot, Léopold (February 13, 2012). "At a glance". Études Rurales (PDF) (45): 131–133. JSTOR 20120213.
- ↑ "Annual Summary" (PDF). JSTOR. March 19, 2013. Archived from the original (PDF) on November 11, 2013. Retrieved April 13, 2013.
- ↑ "Register and read beta". Archived from the original on October 1, 2013. Retrieved January 14, 2013.
- ↑ "Ithaka Harbors, Inc". Nonprofit Explorer. ProPublica. May 9, 2013. Archived from the original on August 6, 2018. Retrieved April 24, 2018.
- ↑ Leitch, Alexander.
- ↑ Schonfeld, Roger C. (2003). JSTOR: A History. Princeton, NJ: Princeton University Press. ISBN 978-0-691-11531-3.
- ↑ 8.0 8.1 Taylor, John (2001). "JSTOR: An Electronic Archive from 1665". Notes and Records of the Royal Society of London. 55 (1): 179–81. doi:10.1098/rsnr.2001.0135. JSTOR 532157. S2CID 72658238.
- ↑ . "JSTOR: Large Scale Digitization of Journals in the United States" (pdf).
- ↑ "About". JSTOR. Archived from the original on November 7, 2016. Retrieved November 28, 2015.
- ↑ "Annual Summary" (PDF). JSTOR. March 19, 2013. Archived from the original (PDF) on November 11, 2013. Retrieved April 13, 2013.
- ↑ "Annual Summary" (PDF). JSTOR. March 19, 2013. Archived from the original (PDF) on November 11, 2013. Retrieved April 13, 2013.
- ↑ "Citation Management: Permanently Linking to Content on JSTOR". JSTOR Support (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on October 9, 2021. Retrieved 2021-10-09.
- ↑ "Access for alumni". JSTOR. Archived from the original on November 30, 2012. Retrieved December 1, 2012.(subscription required)
- ↑ "Individual subscriptions". JSTOR. Archived from the original on November 26, 2012. Retrieved December 1, 2012.(subscription required)
- ↑ Every Year, JSTOR Turns Away 150 Million Attempts to Read Journal Articles Archived నవంబరు 16, 2016 at the Wayback Machine.
- ↑ Lessig on "Aaron's Laws—Law and Justice in a Digital Age" Archived మార్చి 24, 2013 at the Wayback Machine.
- ↑ 18.0 18.1 "JSTOR Statement: Misuse Incident and Criminal Case". JSTOR. July 19, 2011. Archived from the original on January 12, 2013. Retrieved January 14, 2013.
- ↑ 19.0 19.1 19.2 Carter, Zach; Grim, Ryan; Reilly, Ryan J. (January 12, 2013). "Aaron Swartz, Internet Pioneer, Found Dead Amid Prosecutor 'Bullying' In Unconventional Case". Huffington Post. Archived from the original on January 20, 2013. Retrieved January 13, 2013.
- ↑ Bilton, Nick (July 19, 2011). "Internet activist charged in M.I.T. data theft". Bits Blog, The New York Times website. Archived from the original on July 21, 2011. Retrieved December 1, 2012.
- ↑ Schwartz, John (July 19, 2011). "Open-Access Advocate Is Arrested for Huge Download". New York Times. Archived from the original on July 22, 2011. Retrieved July 19, 2011.
- ↑ Lindsay, Jay (July 19, 2011). "Feds: Harvard fellow hacked millions of papers". Associated Press. Archived from the original on January 16, 2013. Retrieved July 20, 2011.
- ↑ Ortiz, Carmen (July 19, 2011). "Alleged Hacker Charged with Stealing over Four Million Documents from MIT Network". The United States Attorney's Office". Archived from the original on July 24, 2011.
- ↑ Kravets, David (September 18, 2012). "Feds Charge Activist with 13 Felonies for Rogue Downloading of Academic Articles". Wired. Archived from the original on February 19, 2014. Retrieved March 7, 2017.
- ↑ "Aaron Swartz's father: He'd be alive today if he was never arrested" Archived జూలై 27, 2020 at the Wayback Machine, money.cnn.com
- ↑ 26.0 26.1 26.2 Brown, Laura (September 7, 2011). "JSTOR–Free Access to Early Journal Content and Serving 'Unaffiliated' Users". JSTOR. Archived from the original on 2017-05-15. Retrieved June 8, 2021.
- ↑ 27.0 27.1 27.2 Rapp, David (September 7, 2011). "JSTOR Announces Free Access to 500K Public Domain Journal Articles". Library Journal. Archived from the original on September 24, 2015. Retrieved October 21, 2015.
- ↑ "Early journal content". JSTOR. Archived from the original on August 6, 2012. Retrieved December 1, 2012.
- ↑ "About JSTOR: Frequently Asked Questions" (in ఇంగ్లీష్). JSTOR. Archived from the original on May 11, 2017. Retrieved May 18, 2017.
- ↑ Tilsley, Alexandra (January 9, 2013). "Journal Archive Opens Up (Some)". Inside Higher Ed. Archived from the original on January 6, 2015. Retrieved January 6, 2015.
- ↑ "My JSTOR Read Online Free". JSTOR. Archived from the original on March 26, 2018. Retrieved March 26, 2018.
- ↑ Orlowitz, Jake; Earley, Patrick (January 25, 2014). "Librarypedia: The Future of Libraries and Wikipedia". Library Journal. Archived from the original on December 20, 2014. Retrieved December 20, 2014.
- ↑ Price, Gary (June 22, 2014). "Wikipedia Library Program Expands With More Accounts from JSTOR, Credo, and Other Database Providers". Library Journal. Archived from the original on December 20, 2014. Retrieved December 20, 2014.
- ↑ "Annual Summary" (PDF). JSTOR. March 19, 2013. Archived from the original (PDF) on November 11, 2013. Retrieved April 13, 2013.
- ↑ Shapiro, Fred R. (1998). "A Study in Computer-Assisted Lexicology: Evidence on the Emergence of Hopefully as a Sentence Adverb from the JSTOR Journal Archive and Other Electronic Resources". American Speech. 73 (3): 279–296. doi:10.2307/455826. JSTOR 455826.
- ↑ Wilson, Robin (October 22, 2012). "Scholarly Publishing's Gender Gap". The Chronicle of Higher Education. Archived from the original on January 6, 2015. Retrieved January 6, 2015.
- ↑ West, Jevin D.; Jacquet, Jennifer; King, Molly M.; Correll, Shelley J.; Bergstrom, Carl T. (July 22, 2013). "The Role of Gender in Scholarly Authorship". PLOS ONE (in ఇంగ్లీష్). 8 (7): e66212. arXiv:1211.1759. Bibcode:2013PLoSO...866212W. doi:10.1371/journal.pone.0066212. PMC 3718784. PMID 23894278.
- ↑ Heather (September 14, 2018). "It's time to insist on #openinfrastructure for #openscience". Our Research blog. Archived from the original on June 30, 2020. Retrieved April 25, 2020.