ఆరోన్ స్వార్ట్జ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరోన్ స్వార్ట్జ్
స్వార్ట్జ్ నవ్వుతూ
డిసెంబరు 13, 2008 లో క్రియేటివ్ కామన్స్ కార్యక్రమం వద్ద ఆరోన్ స్వార్ట్జ్
జననం ఆరోన్ హెచ్. స్వార్ట్జ్
(1986-11-08) 1986 నవంబరు 8
చికాగో, Illinois, U.S.
మరణం 2013 జనవరి 11 (2013-01-11)(వయసు 26)
క్రౌన్ హైట్స్, బ్రూక్లిన్, న్యూయార్క్, U.S.
మరణానికి కారణం ఉరివేసుకుని ఆత్మహత్య
వృత్తి సాఫ్టువేర్ వికాసకుడు, రచయిత, అంతర్జాల కార్యకర్త
శీర్షిక Fellow, హార్వార్డ్ యూనివర్శిటీ ఎడ్మాండ్ జె. సఫ్రా సెంటర్ ఫర్ ఎథిక్స్
మతం Atheist
పురస్కారాలు

అమెరికన్ లైబ్రరీ అసోషియేషన్ వారి జేమ్స్ మెడిసన్ అవార్డ్

EFF పైనీర్ అవార్డ్ 2013
వెబ్ సైటు aaronsw.com
rememberaaronsw.com

ఆరోన్ హిలెల్ స్వార్ట్జ్ (నవంబరు 8, 1986 – జనవరి 11, 2013) ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు మరియు అంతర్జాల కార్యకర్త. స్వార్ట్జ్ వెబ్ ఫీడ్ ఫార్మేటు అయిన ఆర్ఎస్ఎస్ అభివృద్ధిలోను, క్రియేటివ్ కామన్స్ సంస్థలోనూ, జాలగూడు ఫ్రేమ్ వర్క్ web.py మరియు సామాజిక వార్తల గూడు అయిన రెడిట్ లోనూ పాలుపంచుకున్నాడు.

వ్యవస్థాపరంగా జేస్టోర్ (జర్నల్ స్టోర్) నుండి విద్యాసంబంధిత పత్రికా వ్యాసాలను దింపుకున్న తరువాత జనవరి 6, 2011 న స్వార్ట్జును ఎంఐటి పోలీసులు అరెస్టు చేసారు. ఆ తరువాత కంప్యూటర్ మోసం మరియు దుర్వినియోగం చట్టం క్రింద అతడిపై 11అతిక్రమణలు క్రింద నేరం మోపి, గరిష్ఠంగా 1 మిలియన్ డాలర్ల వరకూ అపరాధరుసుముగా, 35 సంవత్సరాల జైలుశిక్ష పడేటట్లు అభియోగం దాఖలు చేసారు.

రెండు సంవత్సరాల తరువాత, అతడి న్యాయవాది యొక్క రెండవ అభియోగ వినతి తిరస్కరించబడిన తరువాత రెండు రోజలకు అతడి అపార్టుమెంటులో ఉరివేసుకుని చనిపోయాడు.