జోర్దార్ సుజాత
జోర్దార్ సుజాత | |
---|---|
జననం | ప్రతికాంతం శృతి డిసెంబర్ 29 [1] |
వృత్తి | తెలుగు టివి న్యూస్ ప్రెజెంటర్ |
జీవిత భాగస్వామి | రాకింగ్ రాకేష్ |
తల్లిదండ్రులు | మోహన్‌రాజు, విజయ |
ప్రతికాంతం శృతి తెలంగాణ కు చెందిన టివి న్యూస్ ప్రెజెంటర్. ఆమె బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నది.[2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]జోర్దార్ సుజాత డిసెంబర్ 29న వరంగల్ గ్రామీణ జిల్లా, చెన్నారావుపేట మండలం, ఉప్పర్‌పల్లి గ్రామంలో మోహన్‌రాజు, విజయ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి ప్రైవేట్ టూరిస్ట్ బస్ డ్రైవర్, అమ్మ అంగన్‌వాడీ టీచర్. సుజాతకు ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆమె డిగ్రీ వరకు చదువుకుంది.[3]
వృత్తి జీవితం
[మార్చు]జోర్దార్ సుజాత (శృతి) డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చింది. ఆమె మొదట ఆన్‌లైన్ మార్కెటింగ్ జాబ్‌లో చేరింది. ఈ క్రమంలో టీవీలల్ల తెలంగాణ యాసలో ఓ ప్రోగ్రామ్ లో అవకాశం ఉంది అనడంతో తన అదృష్టం వెతుకుంటూ వెళ్లగా అక్కడ ఆమెకు అవకాశం దక్కింది అలా V6లో తీన్మార్ వార్తలు కార్యక్రమంలో సుజాతగా పరిచయమయ్యింది.[4] ఆమె ఆ తరువాత హెచ్‌ఎం టీవీలో వచ్చే జోర్దార్ వార్తల్లో ‘జోర్దార్ సుజాత’ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె బిగ్‌బాస్ నుంచి బైటికొచ్చిన తర్వాత మాటీవీలో ‘ఆహారం-ఆరోగ్యం’ కార్యక్రమం చేస్తుంది. సుజాత తన యూట్యూబ్ ఛానల్ సూపర్ సుజాత ద్వారా ప్రజలకు మరించ చేరువైంది.[5] సుజాత జబర్థస్త్ కామెడీ షోలో రాకింగ్ రాకేష్ టీమ్‌లో నటిస్తుంది.[6]
బిగ్ బాస్ 4
[మార్చు]జోర్దార్ సుజాత హెచ్‌ఎం టీవీలో జోర్దార్ వార్తల్లో పని చేసే సమయంలో ఆమెకు బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో అవకాశం దక్కింది. ఆమె బిగ్‌బాస్‌లో ఆరో కంటెస్టెంటు గా 35వ రోజు షో నుంచి ఎలిమినేట్ అయ్యింది.[7][8]
వివాహం
[మార్చు]సుజాత జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ ను 2023 ఫిబ్రవరి 24న తిరుమలలో వివాహమాడింది.[9]
వెబ్‌సిరీస్
[మార్చు]సినిమాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ The Times of India (20 December 2020). "Here's how Bigg Boss Telugu 4 fame Jordaar Sujatha celebrated her birthday - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
- ↑ The Times of India (6 September 2020). "Who are Bigg Boss Telugu 4 contestants Dethadi Harika, Jordaar Sujatha, Ariyana Glory, Divya Vadthya and Mehaboob Shaikh? All you need to know" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
- ↑ Namasthe Telangana (9 September 2021). "తెలంగాణ భాషా దినోత్సవం, ఏ భాష మాట్లాడి అవమానపడ్డదో, ఆ భాషకే బ్రాండ్ అంబాసిడరైంది." Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.
- ↑ Sakshi (6 September 2020). "దిల్‌దార్ ఉంటానంటోన్న జోర్దార్ సుజాత". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
- ↑ The News Minute (21 January 2021). "Avinash to Jordar Sujatha, how Telugu 'Bigg Boss' helps contestants grow on YouTube" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
- ↑ TV5 News (22 February 2022). "కామెడీషోలో మరో లవ్ ట్రాక్.. పెళ్లికి వేళాయే." (in ఇంగ్లీష్). Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (12 October 2020). "జోర్దార్ సుజాత ఔట్.. అతడిపై బిగ్ బాంబ్". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV (11 October 2020). "బిగ్‌బాస్ ఎలిమినేషన్: ఈ వారం జోర్దార్ సుజాత అవుట్" (in telugu). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "పెళ్లి బంధంతో ఒక్కటైన రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత". 24 February 2023. Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
బయటి లింకులు
[మార్చు]- ఇన్స్టాగ్రాం లో జోర్దార్ సుజాత