ట్యూరింగ్ అవార్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ట్యూరింగ్ అవార్డు అనేది కంప్యూటర్ సైన్స్ లో అత్యుత్తమ సాంకేతిక రచనలు చేసిన వ్యక్తులకు ఇస్తారు. ఈ పురస్కారం అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మషీనరీ (ACM) అనే సంస్థ ద్వారా సంవత్సరానికి ఒక సారి ఇవ్వబడుతుంది. ట్యూరింగ్ అవార్డు ని సర్వోన్నతమైన పురస్కారంగా భావిస్తారు. దీనిని నోబెల్ పురస్కారంతో సమానంగా భావిస్తారు. బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞుడు ఆలన్ ట్యూరింగ్ కి గుర్తుగా, ఈ పురస్కారం పేరు ట్యూరింగ్ అవార్డు అని పెట్టబడింది. 2007 నుంచి 2013 వరకు ఈ పురస్కారంతోబాటు నగదు బహుమతి (USD 250,000) కూడా ఇవ్వబడేది. ఈ డబ్బు ఇంటెల్ ఇంకా గూగుల్ అనే సంస్థలు అందజేసేవి. 2014 నుంచి గూగుల్ సంస్థ మాత్రమే ఈ పురస్కారంతోబాటు నగదు బహుమతి  (USD 10 లక్షలు) అందజేస్తోంది.

ఈ పురస్కారాన్ని 1966 లో కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో పనిజేసే ఆలన్ పేర్లిస్ మొదటి సారి అందుకున్నారు. 2006 లో IBM సంస్థకు చెందిన ఫ్రాన్సిస్ ఈ అల్లెన్  ఈ పురస్కారాన్ని అందుకున్న మొదటి మహిళ.

అవార్డు పొందిన వ్యక్తులు

[మార్చు]
సంవత్సరం అందుకున్న వ్యక్తి ఫోటో హేతుబద్ధత
1966 ఆలన్ పెర్లిస్
1967 మారిస్ విల్క్స్
1968 రిచర్డ్ హామింగ్
1969 మార్విన్ మిన్స్కీ
1970 జేమ్స్ హెచ్. విల్కిన్సన్
1971 జాన్ మెక్కార్తి
1972 ఎడ్జెర్ డిజ్క్‌స్ట్రా
1973 చార్లెస్ బాచ్మన్
1974 డోనాల్డ్ నుత్
1975 అలెన్ న్యూవెల్
హెర్బర్ట్ సైమన్
1976 మైఖేల్ ఓ. రాబిన్
డానా స్కాట్
1977 జాన్ బ్యాకస్
1978 రాబర్ట్ ఫ్లాయిడ్
1979 కెన్నెత్ ఇ. ఐవర్సన్ దస్త్రం:Kei younger.jpg
1980 టోనీ హోరే
1981 ఎడ్గార్ ఎఫ్. కాడ్
1982 స్టీఫెన్ ఎ. కుక్
1983 కెన్ థాంప్సన్
డెన్నిస్ ఎం. రిచీ
1984 నిక్లాస్ విర్త్
1985 రిచర్డ్ ఎం. కార్ప్
1986 జాన్ హాప్‌క్రాఫ్ట్
రాబర్ట్ టార్జన్
1987 జాన్ కాకే
1988 ఇవాన్ సదర్లాండ్ Ivan Sutherland
1989 విలియం కహాన్
1990 ఫెర్నాండో జె. కార్బాటే
1991 రాబిన్ మిల్నర్
1992 బట్లర్ లాంప్సన్
1993 జూరిస్ హార్ట్‌మానిస్
రిచర్డ్ ఇ. స్టీర్న్స్
1994 ఎడ్వర్డ్ ఫీగెన్‌బామ్
రాజ్ రెడ్డి
1995 మాన్యువల్ బ్లమ్
1996 అమీర్ ప్నుయేలి
1997 డగ్లస్ ఎంగెల్బార్ట్
1998 జిమ్ గ్రే
1999 ఫ్రెడరిక్ పి. బ్రూక్స్
2000 ఆండ్రూ చి-చి యావ్
2001 ఓలే-జోహన్ డాల్
క్రిస్టెన్ నైగార్డ్
2002 రాన్ రివెస్ట్
ఆది షమీర్
లియోనార్డ్ అడ్లెమాన్
2003 అలాన్ కే
2004 వింట్ సెర్ఫ్
బాబ్ కాహ్న్
2005 పీటర్ నౌర్
2006 ఫ్రాన్సిస్ ఇ. అలెన్
2007 ఎడ్మండ్ క్లార్క్
అలెన్ ఎమెర్సన్
జోసెఫ్ సిఫాకిస్
2008 బార్బరా లిస్కోవ్
2009 చార్లెస్ పి. థాకర్
2010 లెస్లీ జి. వాలియంట్
2011 జూడియా పెర్ల్
2012 సిల్వియో మికాలి
షఫీ గోల్డ్‌వాసర్
2013 లెస్లీ లాంపోర్ట్
2014 మైఖేల్ స్టోన్‌బ్రేకర్
2015 మార్టిన్ ఇ. హెల్మాన్
వైట్ఫీల్డ్ డిఫ్ఫీ
2016 టిమ్ బెర్నర్స్ లీ
2017 జాన్ ఎల్. హెన్నెస్సీ
డేవిడ్ ప్యాటర్సన్
2018 యోషువా బెంజియో
జెఫ్రీ హింటన్
యాన్ లెకున్