డెన్నిస్ రిచీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డెన్నిస్ రిచీ
కెన్ థాంప్సన్ (ఎడమ) తో డెన్నిస్ రిచీ
జననం (1941-09-09) 1941 సెప్టెంబరు 9 (వయసు 82)
బ్రాంక్స్‌విల్లె, న్యూయార్క్
రంగములుకంప్యూటర్ సైన్సు
వృత్తిసంస్థలుల్యూసెంట్ టెక్నాలజీస్
బెల్ ల్యాబ్స్
ప్రసిద్ధిఅల్ట్రాన్
బి ప్రోగ్రామింగ్ భాష
బిసిపిఎల్
సీ ప్రోగ్రామింగ్ భాష
మల్టిక్స్
యునిక్స్
ముఖ్యమైన పురస్కారాలుట్యూరింగ్ అవార్డు
నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ

డెన్నిస్ రిచీ అమెరికాకు చెందిన సుప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త. సీ కంప్యూటర్ భాష, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్తల్లో ఒకరు. ఈయన 1941, సెప్టెంబరు 9వ తేదిన జన్మించాడు. కంప్యూటర్ రంగంలో ఈయన చేసిన విశేష సేవకు గాను 1983లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ట్యూరింగ్ అవార్డ్ను బహూకరించారు. 1998లో నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అనే అవార్డును కూడా అందుకున్నాడు. ల్యూసెంట్ టెక్నాలజీస్ సిస్టమ్ సాఫ్ట్వేర్, పరిశోధనా విభాగానికి అధిపతిగా పనిచేసి 2007లో పదవీ విరమణ చేశారు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

అమెరికాలోని న్యూయార్కు రాష్ట్రంలోని బ్రాంక్స్ విల్లె అనే నగరంలో జన్మించాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రంలో పట్టా పుచ్చుకొన్నాడు. 1967 నుంచీ పదవఈ విరమణ చేసేవరకూ బెల్ ల్యాబ్స్లో పనిచేశాడు.

సీ, యునిక్స్[మార్చు]

రిచీ సీ ప్రోగ్రామింగ్ భాషా సృష్టి కర్తగా, కంప్యూటర్ వాడకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన యునిక్స్ డెవలపర్స్ బృందంలో ముఖ్య సభ్యునిగా అందరికీ సుపరిచితులు. సహ రచయిత కెర్నిగాన్తో కలిసి ఈయన సీ మీద రాసిన పుస్తకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది.

బయటి లింకులు[మార్చు]