Jump to content

తలుపులమ్మ లోవ

అక్షాంశ రేఖాంశాలు: 17°22′26″N 82°29′44″E / 17.3739°N 82.4955°E / 17.3739; 82.4955
వికీపీడియా నుండి
తలుపలమ్మ లోవ ఆలయం
తలుపులమ్మ ఆలయం
తలుపులమ్మ ఆలయం
తలుపులమ్మ లోవ is located in ఆంధ్రప్రదేశ్
తలుపులమ్మ లోవ
ఆంధ్రప్రదేశ్ లో స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు17°22′26″N 82°29′44″E / 17.3739°N 82.4955°E / 17.3739; 82.4955
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
స్థలంలోవ,
సంస్కృతి
దైవంతలుపలమ్మ తల్లి
ముఖ్యమైన పర్వాలువార్షిక జాతర
ఆషాడ మాస ఉత్సవాలు
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రావిడ శిల్పశైలి

తలుపులమ్మ లోవ కాకినాడ జిల్లా, తుని మండలానికి చెందిన పుణ్యక్షేత్రం. [1][2] తునికి 5 కి.మీ దూరంలో పశ్చిమ దిశలో లోవకొత్తూరు దగ్గర ఉంది. ఇక్కడగల తలుపులమ్మ దేవాలయం, వృక్షసంపద కారణంగా ప్రముఖ పర్యాటక ఆకర్షణ.

పటం
తలుపలమ్మ దేవాలయం OSM పటం

రవాణా సౌకర్యాలు

[మార్చు]

తుని నుండి సమీప గ్రామం లోవకొత్తూరు వరకూ బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుండి దేవాలయం వరకూ ఆటోలు, జీపులు, టాక్సీల సౌకర్యం కలదు.

తలుపులమ్మ దేవాలయం

[మార్చు]
తలుపులమ్మ లోవ ఆలయం వద్ద శివుని విగ్రహం

అమ్మవారు 'తలుపులమ్మ' గా ఆవిర్భవించిన క్షేత్రమే 'లోవ'. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదానిని 'ధారకొండ' గానూ మరొక దానిని 'తీగకొండ' గా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య 'తలుపులమ్మ' అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది.

పురాణ గాథ

[మార్చు]

కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి, సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా, కొండపైన పాతాళగంగ పొంగింది. సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు, ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో, ఆయన అభ్యర్ధనమేరకు అమ్మవారు ఇక్కడి కొండగుహలో కొలువుదీరింది. కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sacred and Protected Groves of Andhra Pradesh (in ఇంగ్లీష్). World Wide Fund for Nature--India, A.P. State Office. 1996.
  2. Hemingway, F. R. (2000). Godavari District Gazetteer (in ఇంగ్లీష్). Asian Educational Services. ISBN 978-81-206-1461-1.


వెలుపలి లంకెలు

[మార్చు]