తిరుపతిలో హిందూ దేవాలయాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరుపతి భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో ఒక నగరం. ఇది తిరుపతి నగరపాలక సంస్థకు, తిరుపతి (పట్టణ) మండలానికి, తిరుపతి రెవెన్యూ విభాగానికి ప్రధాన కేంద్రం. వైష్ణవ పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర ఆలయానికి ఇంకా అనేక పురాతన దేవాలయాలకు తిరుపతి నగరం నిలయం.

జాబితా

[మార్చు]
దేవాలయం పేరు ఆలయంలోని ప్రధాన దేవత ఆలయ ప్రదేశం బొమ్మ కాలక్రమం ఆలయ వివరాలు
వెంకటేశ్వరస్వామి ఆలయం వెంకటేశ్వరుడు తిరుమల ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక, వైష్ణవ ఆలయాలలో వెంకటేశ్వరుడికి అంకితం చేయబడిన ఆలయాలలో ఇది ఒకటి.[1] ఈ ఆలయం 853 మీటర్ల ఎత్తులో శేషాచలం కొండ శ్రేణుల తిరుమల కొండలపై  ఉంది.
పద్మావతి దేవాలయం పద్మావతి తిరుచానూరు తిరుచానూరులోని శ్రీ పద్మావతి ఆలయం వెంకటేశ్వరుడి భార్యగా నమ్మే అలమేలు (పద్మావతి) లేదా అలమేలుమంగ దేవికి అంకితం చేయబడిన  ఆలయం. ఇది తిరుపతికి 5 కి.మీ. దూరంలో ఉంది. పుష్కరిణి ముందు సూర్య నారాయణుడికి అంకితం చేసిన ఆలయం ఉంది.
గోవిందరాజ ఆలయం గోనిందరాజ తిరుపతి 1130 ఎడి వెంకటేశ్వరుడి సోదరుడని నమ్మే గోవిందరాజ స్వామికి అంకితం చేసిన ఆలయం.ఈ ఆలయం సా.శ.1130 లో త్రిమతాచార్యులులలో ఒకరైన రామానుజచార్య పవిత్రం చేశారు.ఈ ఆలయంలో శ్రీ గోవిందరాజ స్వామికి ముందు శ్రీ పార్థసారథి స్వామి దైవం ఆలయ ప్రధాన దేవతగా ఉండేది. ఇది తిరుపతి నగరం నడిబొడ్డున ఉంది. ఆలయం ముందు పొడవైన11 కలశాలతో ఏడు అంతస్తులు కలిగిన రాజగోపురం ఉంది. చిత్తూరు జిల్లా లోని పెద్ద ఆలయాలలో ఇది ఒకటి.[2]
కపిల తీర్థం కపిలేశ్వర,కామాక్షి తిరుపతి తెలియదు తిరుపతిలో ఇది పవిత్ర జలపాతం. దీనికి కపిల ముని పేరుతో పెట్టబడిన కపిల తీర్థం. ఇది శివునికి అంకితం చేయబడిన కపిలేశ్వర ఆలయానికి ఆతిథ్యం ఇస్తుంది.ఈ దేవతను కపిలేశ్వరస్వామి అని పిలుస్తారు. కొండ శిలల నుండి నీరు నేరుగా ఆలయానికి ఎదురుగా ఉన్న చెరువులోకి వస్తుంది.ఈ రెండిటిని భక్తులు అత్యంత భక్తితో భావిస్తారు.ఆలయ దేవత గురించి 10 వ శతాబ్దపు కులోతుంగచోళ శాసనాల్లో కనుగొనబడింది.
కోదండరామ ఆలయం రామ, సీత,లక్ష్మణ, తిరుపతి 10 శతాబ్దం సీత, లక్ష్మణులతో పాటు విష్ణువు అవతారమైన రాముడికి అంకితం చేయబడింది. వరాహ పురాణం ప్రకారం, త్రత యుగం సమయంలో, శ్రీరాముడు లంకాపురి నుండి తిరిగి వచ్చినప్పుడు సీతాదేవి, లక్ష్మణులతో కలిసి ఇక్కడ నివసించారు[3]
తాతయ్య గుంట గంగమ్మ ఆలయం గంగమ్మ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయం తిరుపతి గ్రామదేవత గంగమ్మ దేవతకు అంకితం చేసిన ఆలయం. ఈ ఆలయం పురాతనమైంది. ఇది నగరం నడిబొడ్డున ఉంది. ఈ దేవత జాతర ప్రతి సంవత్సరం మే నెలలో జరుగుతుంది. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలు, కార్యకలాపాలను తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం మండలి పర్వేక్షణలో జరుగుతాయి[4]
కల్యాణ వెంకటేశ్వర ఆలయం కల్యాణ వెంకటేశ్వరుడు శ్రీనివాస మంగాపురం ఈ ఆలయం తిరుపతికి 12 కి.మీ. దూరంలో ఉంది. వెంకటేశ్వరుడు వివాహం తరువాత తిరుమలకు వెళ్ళే ముందు, ఇక్కడ 6 నెలలు ఉన్నాడని నమ్ముతారు.
ప్రసన్న వెంకటేశ్వర ఆలయం ప్రసన్న వెంకటేశ్వరస్వామి అప్పలాయగుంట 1232 AD ఈ ఆలయం తిరుపతి నుండి 16 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయంలోని దేవత కుడి చేయి (హస్త) ఇతర వెంకటేశ్వర దేవాలయాలలో సాధారణ వరద భంగిమకు బదులుగా ప్రసన్న (అభయ - ఆశీర్వాదం) భంగిమలో ఉంటుంది. అందువల్ల ఈ ఆలయానికి ప్రసన్న వెంకటేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది.
పరుశురామేశ్వర ఆలయం శివ గుడిమల్లం 3 వ శతాబ్దం (బిసిఇ) [5] స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఐదు పురాతన శివాలయాలలో ఇది ఒకటి
అగతీశ్వర ఆలయం శివ తండవాడ ఈ ఆలయం తిరుపతికి 10 కి.మీ.దూరంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగం అగస్త్యముని చేత స్థాపించబడిందని నమ్ముతారు.
పరసర్వేశుర ఆలయం శివ యోగిమల్లవరం ఈ ఆలయం.తిరుపతికి 3 కి.మీ.దూరంలో తిరుచానూరులో ఉంది.ఇది స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఐదు పురాతన శివాలయాలలో ఇది ఒకటి
రాధా, గోవింద మందిరం (ఇస్కాన్) కృష్ణ, రాధ,అష్ట బైరవులు తిరుపతి 1984 (పురాతన ఆలయం)

2005 (లోటస్ టెంపుల్)

ఈ ఆలయాన్ని లోటస్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. రూపకల్పనబట్టి హరే కృష్ణ టెంపుల్ అని కూడా పిలుస్తారు.
కోదండరామస్వామి ఆలయం, చంద్రగిరి రామ,సీత,లక్ష్మణ,

భరత,

శత్రుఘ్న,

హనుమాన్,గరుడ,

చంద్రగిరి 16 వ శతాబ్దం. ఇది రాముడికి అంకితం చేయబడిన ఆలయం, ఇక్కడ ఒకే పీఠంపై రాముడు, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నడలకు , ఇరువైపులా హనుమంతుడు,గరుడలు ఉన్నారు.[6]
కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వరస్వామి, పద్మావతి తాయారు నారాయణవనం 16 శతాబ్దం ఇది  చిత్తూరు జిల్లాలోని నారాయణవనం అనే పట్టణంలో ఉన్న హిందూ-వైష్ణవ ఆలయం. ఈ ఆలయం విష్ణువు అవతారమైన కళ్యాణ వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం పుత్తూరుకు తూర్పున 2 కి.మీ.దూరంలో, తిరుపతికి 45 కి.మీ. దూరంలో ఉంది.వెంకటేశ్వరుడు ఈ స్థలంలో పద్మావతిని వివాహం చేసుకున్నాడని, ఆ తరువాత తిరుమలకు వెళ్ళాడని నమ్ముతారు.

ఇవి కూడా చూడు

[మార్చు]
  • శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం : కాళహస్తీశ్వర స్వామి దైవంగా 5 వ శతాబ్దంలో స్వర్ణముఖి నది ఒడ్డున నిర్మించిన శివుడి ఆలయం. ఇది తిరుపతికి 36 కి.మీ (22 మైళ్లు) దూరంలో ఉంది. తిరుపతి నుండి తరచూ బస్సుల ద్వారా అనుసంధానించబడి ఉంది.శివుని భక్తుడుగా చెప్పుకునే కన్నప్ప ఇక్కడ మోక్షం పొందాడు. ఇది గాలిని సూచించే పంచభూత స్థలాలలో ఒకటైన వాయు లింగానికి చెందింది. ఈ ఆలయం రాహు, కేతులతో సంబంధం కలిగి ఉంది (భారతీయ జ్యోతిషశాస్త్రంలోని తొమ్మిది గ్రహాలలో ఇవి రెండు).

మూలాలు

[మార్చు]
  1. "Record collection of Rs 5.73 crore at Tirumala". Times of India. Tirumala. 2 April 2012. Retrieved 13 August 2015.
  2. "Sri Govindaraja Swamy Temple". Archived from the original on 9 October 2015. Retrieved 2015-06-23.
  3. "Lord Sri Kodanda Rama Swamy Temple in Tirupati and Sri Pattabhiramalayam Temple at Valmikipuram Gear up for Annual Mega Fete-special Story". Tirumala Tirupati Devastanams. Archived from the original on 18 మే 2015. Retrieved 12 May 2015.
  4. "'Ganga Jatara' off to a colourful start". Retrieved 2015-07-10.
  5. Doniger, Wendy (October 2009). The Hindus: An Alternataive History. Oxford: Oxford University Press. p. 22,23. ISBN 9780199593347.
  6. "TTD takes over Chandragiri temple". The Hindu. 25 September 2015. Retrieved 29 May 2019.

వెలుపలి లంకెలు

[మార్చు]