తీయన్
తీయన్ (పంజాబ్/హర్యానా) | |
---|---|
యితర పేర్లు | తీజ్ |
జరుపుకొనేవారు | మహిళ |
రకం | ఋతుపరమైన పండుగ |
ప్రారంభం | శ్రావణం |
జరుపుకొనే రోజు | జూలై/ఆగస్టు |
తీయన్ (పంజాబీ:ਤੀਆਂ]]) అనునది పంజాబ్, హర్యానా రాష్త్రములలో జరుపబడు తీజ్ యొక్క పండుగ. ఈ పండుగ ఋతుపరమైనది.[1] ఇది కుమార్తెలు[2][3], సోదరీమణులపై దృష్టి సారించే పండుగ.
వేడుకలు
[మార్చు]ఈ పండుగ వర్షాకాలంలో చాంద్రమానంలో నెల సావన్ యొక్క మూడవ రోజు నుండి సావన్ మాసంలో పౌర్ణమి వరకు మహిళలచే జరుపబడుతుంది. వివాహమైన మహిళలు ఈ పండుగ సందర్భంగా వారి కన్నవారింటిలో పాల్గొంటారు.[4][5] గతంలో సాంప్రదాయకంగా మహిళలు సావన్ మాసమంతా తల్లిదండ్రుల వద్ద గడిపేవారు.[4][6]
బహుమతులు
[మార్చు]మహిళలు, బాలికలు వారి తల్లిదండ్రుల యింటికి వెళ్ళినపుడు వారి సోదరులు వారికి బహుమతుల ప్యాకెట్ ను అందజేస్తారు. వాటిని "సంధర" అంటారు. దీనిలో పంజాబీ సూట్/చీర, లడ్డూ, గాజులు, మెహందీ, ఊయల ఉంటాయి.[4]
-
బూందీ లడ్డూ
-
గాజులు
-
మెహందీ
-
పంజాబీ సూట్
-
చీర
-
ఊయల
గిద్దా, ఊయల
[మార్చు]ఈ పండగ సందర్భంగా బాలికలు, మహిళలు గ్రామంలో ఒక చోట చేరుతారు. వారు పెద్ద చెట్లకు ఊయలకు కడతారు. గిద్దా నృత్యాలను చేస్తారు.
సాంప్రదాయకంగా గిద్దా నృత్యంలో ఈ క్రింది పాటను పాడుతారు:
ਓੁੱਚੇ ਟਾਹਣੇ ਪੀਂਘ ਪਾ ਦੇ
ਜਿਥੇ ਆਪ ਹੁਲਾਰਾ ਆਵੇ
[4]
Uchay tahne peeng pa de
jithey aap hulara aavey
అనువాదం
నా ఊయల పెద్ద చెట్టుకొమ్మ నుండి వ్రేలాడదీయబడింది
ఆ ఊయల దానికదే ఊగుతుంది.
ఈ తీయన్ పండుగలో ప్రధానమైన దృష్టి గిద్దా నృత్యంపై పెడతారు. గతంలో కొన్ని రోజులనుంది నాలుగు వారాలవరకు శుభాకాంక్షలు తెలిపేవారు. బాలికలు ఒకచోట చేరి ప్రతీరోజూ గిద్దా నృత్యాలను చేసేవారు. ఈ పండుగ "భల్లోహ్" నృత్యాన్ని మహిళలు చేయడం ద్వారా పూర్తయ్యేది. ఈ నృత్యంలో మహిళలు రెండు వరుసలలో నిలబడి నాట్యం చేసేవారు.[7] ఈ సాంప్రదాయం ప్రకారం మహిళలు ఒక దగ్గర చేరడం గ్రామాలలో ప్రస్తుతం అంతరించిపోయింది.[8]
-
మహిళలు తీయన్ జరుపుకొనుట
-
గిద్దా నాత్యం తీయన్ పంజాబ్
-
గిద్దా నాట్యం తీయన్ పంజాబ్ తీజ్ ఇండియా
-
గిద్దా నృత్యం తీయన్ పంజాబ్
-
తీయన్ గిద్దా
ఆహారం
[మార్చు]సాంప్రదాయకంగా తీయన్ పండుగలలో ఈ క్రింది ఆహార పదార్థాలు చేస్తారు:
- ఖీర్ (rice boiled in milk) [4]
- పూర్తాయ్ (వేయించిన బ్రెడ్) [4]
- హల్వా
- మల్పువా
- గుల్గులై :బెల్లం రసంతో గోధుమ పిండి కలిపు ఉండలుగా చేసి వేయిస్తారు.[9]
- మాండే : గోధుమ పిండితో తయారుచేస్తారు.[9]
-
పంజాబ్ ద హల్వా
-
మల్పూరా స్వీట్
-
మాల్పురా
-
గుల్గులె
-
ఖీర్
మూలాలు
[మార్చు]- ↑ Good Earth Punjab Travel Guide (2006)
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-08-03. Retrieved 2016-07-08.
- ↑ Savino, Natalie (03 09 2013) Leader: New cultural group Koonj-The Flock bringing migrants together for fun, theatre and dance [1]
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Alop Ho Raha Punjabi Virsa: Harkesh Singh KehalUnistar Books PVT Ltd ISBN 81-7142-869-X
- ↑ Shankarlal C. Bhatt (2006) Land and People of Indian States and Union Territories: In 36 Volumes. Punjab, Volume 22 [2]
- ↑ Rainuka Dagar (2002) Identifying and Controlling Female Foeticide and Infanticide in Punjab [3]
- ↑ Yash Kohli The Women of Punjab 1983
- ↑ East of Indus: My memories of old Punjab: Gurnam Singh Sidhu Brar
- ↑ 9.0 9.1 Alop ho riha Punjabi virsa - bhag dooja by Harkesh Singh Kehal Unistar Book PVT Ltd ISBN 978-93-5017-532-3