దశనామి సాంప్రదాయం
స్వరూపం
దశనామీ సాంప్రదాయం అనేది అద్వైత వేదాంతంలో సన్యాసి వ్యవస్థను సూచించే ఒక సాంప్రదాయం.[1] ఆది శంకరాచార్యులు సనాతన ధర్మ స్థాపనకై భారతదేశం నలువైపులా శృంగేరి, పూరీ, ద్వారక, జ్యోతిర్మఠం అనే నాలుగు ప్రదేశాల్లో నాలుగు పీఠాలు ఏర్పాటు చేశాడు. ఒక్కో పీఠానికి ఒక్కో ఆచార్యులను నియమించాడు. ఆయన శిష్య ప్రశిష్యులందరినీ దశనామీ సన్యాసుల కింద పరిగణిస్తారు. వీరి సన్యాసాశ్రమ పేరు చివరన గిరి, పురి, భారతి, ఆనంద, అరణ్య, సాగర, సరస్వతి, తీర్థ, ఆశ్రమ, పర్వత, వన అనే పేర్లు చేరుస్తారు.[2]
దశనామాలు - అర్థాలు
[మార్చు]ఈ దశనామాలు ఆ పేరును చేర్చుకున్న సన్యాసులు తమ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్న ప్రాంతాలు, లేదా వారి వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి.[3]
- గిరి, పర్వత - కొండ, లేదా పర్వత ప్రాంతాలు
- సాగర - సముద్ర తీరానికి దగ్గర
- వనం, అరణ్య - అడవులలో నివాసం
- ఆశ్రమ - ప్రత్యేకంగా కుటీరం లేదా ఆశ్రమ వాసం
- సరస్వతి - జ్ఞాన సంపన్నులు
- భారతి - బంధాల నుంచి విముక్తి పొందినవారు
- పురి - పట్టణాలలో నివాసం
- తీర్థ - పుణ్యతీర్థాల సమీపంలో ఆవాసం
ప్రముఖ సన్యాసులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "DASANAMI SAMPRADAYA- THE MONASTIC TRADITION". advaita-vedanta.org. advaita-vedanta.org. Retrieved 26 June 2017.
- ↑ సెల్వం, కల్యాణ సుందరం. "Sri Kalyanagiri and the Kalyana Mandapa". kataragama.org. Retrieved 25 June 2017.
- ↑ "Shankaracharya's four Sannyasa orders". amritapuri.org. Retrieved 29 June 2017.