Jump to content

దున్న ఇద్దాసు

వికీపీడియా నుండి
దున్న ఇద్దాసు
జననందున్న ఇద్దాసు
సా.శ. 1811
India చింతపల్లి గ్రామం, పెద్ద ఊర మండలం, నల్లగొండ జిల్లా, తెలంగాణ
మరణంజులై 8, 1919
తెలంగాణ
మరణ కారణంజీవ సమాధి
నివాస ప్రాంతంచింతపల్లి గ్రామ, పెద్ద ఊర మండలం, నల్లగొండ జిల్లా, తెలంగాణ
వృత్తితత్వవేత్త
పిల్లలుకుమారుడు దున్న మల్లయ్య

మనవడు దున్న బసవలింగం

ముని మనవడు దున్న విశ్వనాథం

దున్న ఇద్దాసు ( సా.శ. 1811 - 1919 ) తెలంగాణ తొలితరం దళిత కవి. ఈయనకు మాదిగ మహాయోగి అని పేరు. ఈయన అనేక మార్మికతత్త్వాలు, వేదాంత కీర్తనలు రచించాడు.[1]

జననం

[మార్చు]

ఈయన సా.శ. 1811 న నల్లగొండ జిల్లా, పెద్ద ఊర మండలం, చింతపల్లి గ్రామంలో దున్న రామయ్య- ఎల్లమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన బాల్యంలో అందరిలాగే పెరిగాడు. చిన్నతనంలో పశువులు కాయటం, నాగలి దున్నటం, చెప్పులు కుట్టటం, వంటి పనులు చేసేవాడు. బిరుదు రామరాజు గారు ఈయనను ‘మాదిగ మహా యోగి’గా సంబోధించాడు.[2]

రచనలు

[మార్చు]

ఆరు చక్రములను దిరిగె,
ఆరు హంసల బందుజేసి,
మీది చక్రము మీద దిరిగె.

కర్మలోనే పుట్టిపెరిగి
కర్మలో సంకీర్తినంది
కర్మమనె దేవతను గట్టి
బంధనంబు చేసి మాయను దారా మాయ ను దారా
ఇల్లు సంసారమ్ము ఆలు
పిల్లలన్నదె రాజయోగము
అహము జంపి గూటిలోన
దీపమెలుగున్నంతలోనే దారా మాయను దారా

ఉపమ గలిగి శయ్యల నొప్పిఉన్న
అంఘ్రిభవుని కావ్యంబు
గ్రాహ్యంబు కాదు
పాయసంబైన సంస్కార పక్వమైన
కాకజుష్టంబు హవ్వంబు కాని యట్లు

జీవిత విశేషాలు

[మార్చు]

ఒకనాడు తన ఇంటి దగారి నుంచి ప్రతిదినం ముగ్గురు సాధువులు పోతుంటే గమనించి, వారిని అనుసరించాడు. ఆ సాధువులు తుంగతుర్తి లోని శివాలయంలో శివసంకీ ర్తనం చేయటం విని పరవశించాడు. ఆనాటి నుండి సాధువుల వెంట వెళ్లి భక్తితో నామ సంకీర్తనం చేసి వచ్చేవాడు. ఒకనాడు ఆ సాధువులు ఈయనను గమనించి అతని భక్తికి మెచ్చి నోరు తెరిపించి నాలుకపై విభూతి రాసారు . ఆనాటి నుండి ఈయన హృదయంలో నిక్షిప్తంగా ఉన్న భక్తిబీజాలు వెలసినాయి.రోజు మోట తోలుతూసులువుగా తత్త్వగీతాలు ఆలపించేవాడు. మోట బొక్కెనలోనుంచి నీళ్లు వచ్చినట్లే ఇదన్న హృదయం నుండి తత్త్వగీతాలు వచ్చేవి. ఈయన తత్త్వాలు విన్న ఆ ప్రాంతపు ప్రసిద్ధ జంగమదేవర పూదోట బసవయ్య ఇదన్న హృదయ క్షేత్రం పక్వమైనట్లు గుర్తించి లింగదారణం చేయించి పంచాక్షరీ మంత్రం ఉపదేశించాడు. ఈయన శిష్యగణం ఎక్కువగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూలు ప్రాంతాల్లో ఉన్నారు.ప్రస్తుతం అయిన ముని మనవడు దున్న విశ్వనాథం గారు దున్న ఇద్దాసు గారి పరపరం కొనసాగిస్తున్నారు.దున్న ఇద్దాసు గారి కొడుకు దున్న మల్లయ్య తరువాత వారి కుమారుడు దున్న బసవలింగం గారు భక్తుల కోరిక మేరకు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా ఉప్పూనుంతల మండలంలోని అయ్యవారి పల్లిలో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు.అక్కడే దున్న ఇద్దాసు కేంద్రంగా భక్తులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ పూజ కార్యక్రమలు నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం దున్న విశ్వనాథం అందుబాటులో ఉంటూ ఇద్దాసు తత్వాలను ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ దున్న ఇద్దాసు పీఠాధిపతిగా కొనసాగుతున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "దున్న ఇద్దాసు తెలంగాణ జాతిలో కలికితురాయి". www.tnews.media. టీ న్యూస్. Retrieved 6 May 2018.[permanent dead link]
  2. "అచలయోగికి అక్షర నివాళి". /www.ntnews.com. నమస్తే తెలంగాణా. Retrieved 6 May 2018.