దురద
దురద | |
---|---|
ప్రత్యేకత | Dermatology |
దురద, తీట లేదా నవ (Itching) చర్మంలోని భాగాన్ని గోకాలనిపించడం. ఇది ముఖ్యంగా గజ్జి, తామర వంటి చర్మవ్యాధులలోను, పచ్చకామెర్లు వంటి కొన్ని ఇతర శరీర సంబంధ వ్యాధులలోను వస్తుంది.కొన్ని సార్లు వాతావరణ కాలుష్యం వలన కూడా దురద పుడుతుంది. కలుషిత నీటిలో ఈతలాడినపుడు కూడా దురద పుడుతుంది. దురద మానవులకే కాకుండా కోతి, కుక్క, పశువు లాంటి జంతువులకు, కాకి లాంటి పక్షులకు కూడా పుడుతుంది.
యోనిలో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో ట్రైకోమోనియాసిస్ అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.
దురద-యొక్క-లక్షణాలు
[మార్చు]దురదకు సంబంధించి స్పర్శ లేదా ఇంద్రియ జ్ఞానం సర్వసాధారణమైనది, సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. ఇది చాలా కాలం వరకు కొనసాగవచ్చు లేదా కొద్దిపాటిగా గోక్కోవడంతో సరిపోవచ్చు. అయితే దురదకు కారణం ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటే, దురద అవుతున్న చోట గోకడంతో మాత్రమే సరిపెట్టలేము. దురద వీటితో ముడిపడి ఉంటుంది.
- చర్మం ఎరుపు కావడం
- మంట
- జలదరింపు లేదా శరీరం మండుతున్నట్లు అనుభూతి
- గడ్దలు కనిపించడం
- ఎండు చర్మం
- తునకలు
- చర్మం పై రక్షణ నిర్మాణం
- చర్మం ఊడిరావడం
- బొబ్బలు
దురద శరీరంలో విభిన్న స్థలాలపై ఎదురు కావచ్చు.& మోచేతులు, తలమీద, వీపుపై లేదా మర్మాంగం వద్ద దీని ప్రభావం ఉంటుంది.
కారణాలు
[మార్చు]- సంక్రమణ (Infection)
- ఎక్కువ సేపు నీటిలో గడపడం.
- మందులు
- ఇతర కారణాలు
చికిత్స
[మార్చు]కార్టికోస్టీరాయిడ్ క్రీములు
[మార్చు]ఈ వైద్యపరమైన క్రీములు చర్మానికి హాయి కల్పిస్తూ చర్మానికి ఎదురవుతున్న దురదను నయం చేస్తుంది. ఇవి ఎండిన చర్మం మారేలా చేస్తాయి. పైగా చర్మం పై దురదను తొలగిస్తాయి. ఇవి సాధారణంగా 1% హైడ్రోకార్టిసన్ ను కలిగి ఉంటుంది. స్టీరాయిడ్ క్రీమును డాక్టరు ఔషధసూచిక లేకుండా డాక్టరును సంప్రతించకుండా ఉపయోగించకూడదు. లులికోనాజోల్ ను కూడా వాడవచ్చు.
క్యాల్షిన్యూరిన్ ఇన్ హిబిటర్స్
[మార్చు]ఈ మందును నిర్ణీతస్థలంలో ఎదురయ్యే దురద నివారణకు వాడవచ్చు యాంటీ డిప్రెసెంట్స్
యాంటీ డిప్రెసెంట్స్ శరీరంలోని హార్మోన్లపై ప్రభావం కలిగి ఉంటాయి. దీనితో దురద నివారణకు సహకరిస్తాయి.
జెల్స్
[మార్చు]సాధారణమైన అలోవెరా లేదా కలబంద తేమ కలిగించేదిగా సిఫార్సు చేయబడింది. ఇది దురద కలిగించే చర్మానికి హాయి కలిగిస్తుంది పైగా పొడిచర్మాన్ని మారిస్తుంది కూడా.
యాంటీహిస్టామైన్స్
[మార్చు]యాంటీహిస్టామైన్స్ మందులు ( సాధారణంగా మౌఖికంగా తీసుకొనబడుతాయి) అలెర్జీ ప్రతిక్రియలను అదుపుచేయడంలో చక్కగా పనిచేస్తాయి. ఇవి మంటను నివారించి తద్వారా దురదను కూడా నివారిస్తుంది
లైట్ థెరపీ
[మార్చు]లైట్ థెరపీ క్రింద చక్కగా నిర్ధారింపబడిన తరంగధైర్ఘ్యం లేదా వేవ్ లెంగ్త్ కలిగిన యు వి కిరణాలను ఉపయోగిస్తారు. ఇది చర్మంపై ఎదురయ్యే దురదను అదుపు చేస్తుంది. ఈ ప్రక్రియను ఫోటొథెరపీ అని కూడా పేర్కొంటారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పెక్కుమార్లు లైట్ థెరపీ తీసుకొనవలసి ఉంటుంది
అంతర్లీనమైన ఆరోగ్య స్థితులకు చికిత్స
[మార్చు]ఆరోగ్య స్థితిగతులను నిర్ధారించే మూత్రపిండాలు, కాలేయం లేదా రక్తంలో చక్కెరస్థాయికి చికిత్స కల్పించడం ద్వారా దురదను నివారించవచ్చు. ఈ జబ్బులకు కల్పించే చికిత్సవీటి రోగలక్షణాలను కూడా మార్చుతుంది.
జీవన సరళిలో మార్పు
[మార్చు]- కొన్నిరకాల జీవన విధానాలు లేదా జీవన సరళులు దురదను కల్పించే చర్మం నిర్వహణణకు సహకరిస్తాయని రుజువు కాగలదు.
- చర్మంపై దురదకు దారితీసే అలంకరణ సామగ్రిని, పదార్థాలను వాడకండి
- చర్మంపై దురద కలిగిస్తున్న ప్రాంతంలో వైద్యపరమైనట్టి లోషన్లను పూయండి.మందుల దుకణాలలో అవి సులభంగా లభిస్తాయి. ఈ లోషన్లు పొడిచర్మం, దురద కలిగించే చోట హాయి కల్పిస్తుంది
- చర్మంపై దురద హెచ్చుగా ఉన్నచోట గోకటాన్నిమానివేయండి. అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు దురద చర్మాన్ని పాడుచేస్తుంది. పైగా చర్మంపై ఇతర ప్రాంతాలకు వ్యాపించేలా చేస్తుంది. గోకడం కారణంగా గోళ్ల ద్వారా క్రిములను ఇతర చొట్లకు వ్యాపింపజేస్తుంది ఇలా చేయడం వల్ల మంట హెచ్చవుతుంది.
- అమ్మాయిలు బ్యూటీ పార్లర్లో వాడే కొన్ని కెమికల్స్ వల్ల కూడా వస్తుంది.
- ఒత్తిడి స్థాయిని తగ్గించుకోండి. హెచ్చయిన మానసిక ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పించి దురద పెరగడానికి లేదా ఇతర అలెర్జీ కారకాలకు దారితీస్తుంది.
- చర్మంపై దురదకు దారితీసే అలంకరణ సామగ్రిని, పదార్థాలను వాడకండి.[1]
దురదపై తెలుగులో గల కొన్ని సామెతలు/పదాలు
[మార్చు]- కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు
- నోటి దురద : చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళను, వదరుబోతులను సంబోధిస్తారు.
- కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద.