నవ్వితే నవరత్నాలు
స్వరూపం
నవ్వితే నవరత్నాలు (1951 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.సౌందర్ రాజన్ |
---|---|
కథ | సీనియర్ సముద్రాల |
తారాగణం | అంజలీదేవి, చిలకలపూడి సీతారామాంజనేయులు, గిరిజ, కృష్ణకుమారి, ఎన్.టీ.ఆర్, ఎస్వీ.రంగారావు, రేలంగి వెంకటరామయ్య |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నేపథ్య గానం | మాధవపెద్ది సత్యం, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల, జిక్కి కృష్ణవేణి, కోక జమునారాణి |
గీతరచన | సీనియర్ సముద్రాల |
సంభాషణలు | సీనియర్ సముద్రాల |
నిర్మాణ సంస్థ | తమిళనాడు టాకీస్ |
భాష | తెలుగు |
నవ్వితే నవరత్నాలు 1951 జూన్ 7న విడుదలైన తెలుగు సినిమా. తమిళనాడు టాకీస్ ప్రొడక్షన్స్ పతాకం కింద ఈ సినిమాను ఎస్.సౌందరరాజన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. టి.కృష్ణకుమారి, రామశర్మలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు అశ్వథామ గుడిమెట్లసంగీతాన్నందించాడు. [1] ఈ సినిమా సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజలీ కథలు పుస్తకం ఆధారంగా తీసినది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటి కృష్ణకుమారి పరిచయం చేయబడ్డారు.
తారాగణం
[మార్చు]- టి.కృష్ణ కుమారి,
- రామశర్మ,
- గుమ్మడి వెంకటేశ్వరరావు,
- భూదేవి,
- అడ్డాల,
- సీత,
- నిర్మలాదేవి,
- మోహన్,
- సులోచనా దేవి,
- వంగర,
- లలిత,
- పద్మిని,
- వెంకటేశ్వరరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎస్. సౌందరరాజన్
- నిర్మాత: S. సౌందరరాజన్;
- స్వరకర్త: అశ్వథామ గుడిమెట్ల;
- గీతరచయిత: తోలేటి వెంకటరెడ్డి
పాటలు
[మార్చు]- ఆడుకోవయ్యా వేడుకులారాకూడి చెలియతో - పి. లీల
- నవ్వితే నవరత్నాలు రవ్వలురాలే జవ్వని - ఎ. ఎం. రాజా
- రాజా నీసేవ నేచేయ నేనుంటినో ఏమికావాలో - పి.లీల, మాధవపెద్ది
- తెలిరేఖలు విరిసే తూరుపు దిశఅవి మెరిసే - ఎం. ఎల్. వసంతకుమారి
- టిక్కుటిక్కుల నడకల పిల్లేకదా - కె.ప్రసాదరావు, ఎ.వి. సరస్వతి
- ఉయ్యాల ఊగెనహో మానసం ఉయ్యాల - ఎం. ఎల్. వసంతకుమారి
మూలాలు
[మార్చు]- ↑ "Navvithe Navaratnalu (1951)". Indiancine.ma. Retrieved 2024-10-21.