నాదిర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్
నాదిర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | ప్రజా | ||||||||||
యజమాని | భారత ప్రభుత్వం | ||||||||||
కార్యనిర్వాహకత్వం | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | ||||||||||
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం R-148 HHY VOR at 12 nm | ||||||||||
ఎత్తు AMSL | 551.9 m / 1,811 ft | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 17°18′21″N 078°33′38″E / 17.30583°N 78.56056°E | ||||||||||
రన్‌వే | |||||||||||
|
నాదిర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఉన్న ఎయిర్‌ఫీల్డ్. నాగార్జున సాగర్ హైవేపై 12 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ఎయిర్‌ఫీల్డ్ లో పైలట్లకు శిక్షణ ఇస్తుంటారు.[1]
వివరాలు
[మార్చు]తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ, రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీ మొదలైనవి తమతమ పైలట్‌లకు శిక్షణ ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తాయి.[2] ఫ్లైటెక్ ఏవియేషన్‌కు నాదిర్‌గుల్‌లో సొంత హ్యాంగర్ ఉంది. ఈ ఎయిర్‌ఫీల్డ్‌లో 14/32 రన్‌వే మాత్రమే ఉంది. ట్రైనీలు ఎక్కువగా సెస్నా 152, సెస్నా 172 వంటి సింగిల్ ఇంజన్ గల విమానాలను నడుపుతారు. సర్క్యూట్ ఎత్తు 2600'. అలాగే, ఎయిర్‌ఫీల్డ్‌లో ప్రత్యేకమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లేదు.
ప్రస్తుతం
[మార్చు]శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన తర్వాత, పైలట్ల శిక్షణ కార్యకలాపాలన్నింటినీ బేగంపేట విమానాశ్రయానికి మార్చబడ్డాయి. అయినప్పటికీ, ఇక్కడ కూడా అప్పుడప్పుడు శిక్షణ ఇస్తుంటారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Nadirgul Airfield". www.aai.aero. Retrieved 2022-01-28.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ India, The Hans (2017-08-30). "NCC revives flying training of Air Wing Cadets at Warangal". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-01-28.
- ↑ "India spent Rs 36 crore in 2018-19 on 27 airports where not a single flight takes off". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-08-09. Retrieved 2022-01-28.
బయటి లింకులు
[మార్చు]Media related to నాదిర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్ at Wikimedia Commons
- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద నాదిర్‌గుల్ ఎయిర్‌ఫీల్డ్ Archived 2017-07-03 at the Wayback Machine