పశుప్రాయత
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |
జంతువులతో జరిపే సంభోగం పేరు ఆంగ్లంలో జూఫీలియా (Zoophilia). గ్రీకుబాషలో జోఇన్ అంటే జంతువు, ఫీలియా అంటే ప్రేమ అని అర్థం. జంతువులతో రతి జరిపే వారిని (ఆడ అయినా కావచ్చు లేదా మొగ అయినా కావచ్చు) జూఫైల్ అంటారు. జూఫీలియా ఒక మానసిక గ్మత (సైకొపాథియా సెక్సుయాలిస్)గా 1886లో రిచర్డ్ ఫ్రెహీ (Richard Freiherr), మొట్టమొదటి సారిగా పేర్కొన్నాడు. జూఫీలీయా అనబడే జంతువులతో జరిపే సంభోగం, జంతు హింసగా లేదా పారాఫీలియాగా, (paraphilia) పరిగణింపబడుతుంది. ఇది ఒక విపరీత రతిప్రవృతిగా (sexual orientation) అని మనోవైద్యులు పరిగణిస్తారు. ప్రక్యాత సెక్సాలజిస్ట్' కిన్సే' తన నివేదికలో ఇటువంటి తరహా సంభోగంలో పాల్గొనే వారు (సంభోగింప తగిన వయసు గల జనాబాలో) 8% మొగవారనీ, 3.6% ఆడవారని, 40–50 శాతం పొలాలలో, పశుసంరక్షక, పశుసంవృద్ది కేంద్రాలలో పని చేసే వారని పేర్కొన్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన పరిశోధనలలో ఆ నిష్పతి 4.9%, 1.9% మాత్రమే అని తెలిసింది.
.
వాత్సాయనుడి, కామశాస్త్రంలో జంతువులను రమించడం గురించి పేర్కొనబడింది. ఖజరాహోలోని యెన్నోశిల్పాలు, జంతు సంభోగం అప్పటికే రతి క్రీడలో ఒక అంశం అని తెలిపే శిల్పాలున్నాయి. ఉదాహరణ: పక్కన చూపిన చిత్రంలో అశ్వాన్ని సంభోగిస్తున్న మొగవాడి చుట్టు చేరి ఉత్సాహపరుస్తున్నట్టుగా ఉంది.
జంతువులు తో సెక్స్ కొన్ని దేశాలలో చట్టవిరుద్ధం కాకపోయినప్పటికీ, ఇది స్పష్టంగా ఎక్కడైనా క్షమార్హమైనది కాదు. చాలా దేశాలలో, పశుప్రాయత కింద చట్టవిరుద్ధం జంతువుల దుర్వినియోగం చట్టాలు లేదా వ్యవహరించే చట్టాలు స్వభావం వ్యతిరేకంగా నేరాలు .[1]
మూలాలు
[మార్చు]- ↑ "తూర్పుగోదావరి జిల్లాలో ఆవుపై ... వార్తలో నిజానిజాలేమిటి". BBC News తెలుగు. 25 December 2018.