పాంగిన్
పాంగిన్ | |
---|---|
Coordinates: 28°08′24″N 95°16′34″E / 28.14°N 95.276°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
జిల్లా | సియాంగ్ |
Government | |
• Type | స్థానిక స్వపరిపాలన సంస్థ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 791102 |
Vehicle registration | AR-09 |
పాంగిన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, సియాంగ్ జిల్లాలోని ఒక పట్టణం. ఇది సియాంగ్ జిల్లాకు తాత్కాలిక ప్రధాన పరిపాలనా కేంద్రం.[1] 2015 లో సియాంగ్ జిల్లా ఏర్పడటానికి ముందు ఈ పట్టణం తూర్పు సియాంగ్ జిల్లాలో ఉంది. ఇది మునుపటి జిల్లా ప్రధాన కార్యాలయం. పసిఘాట్ నుండి రహదారి ద్వారా, సుమారు 60 కి.మీ (37 మైళ్లు) దూరంలో ఉంది. సియోమ్ నది, సియాంగ్ నదిని కలిసే కూడలి ప్రదేశం వద్ద ఈ స్థావరం ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఆది ప్రజల ఎక్కువుగా నివాసించే ప్రాంతం. [2] 2016 నాటికి పంగిన్ శాసనసభ్యునిగా తంగిన్ తపన్ పనిచేయుచున్నాడు. [3]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారంపాంగిన్ అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు సియాంగ్ జిల్లాలోని పాంగిన్ సర్కిల్ లో ఉన్న ఒక మధ్యతరహా గ్రామం. పాంగిన్ గ్రామంలో మొత్తం 272 కుటుంబాలు నివసిస్తున్నాయి. పాంగిన్ గ్రామంలో మొత్తం జనాభా 1542 ఉండగా, వీరిలో 763 మంది పురుషులు కాగా, 779 మంది మహిళలు ఉన్నారు.పాంగిన్ గ్రామంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 187, ఇది మొత్తం గ్రామ జనాభాలో 12.13%. పాంగిన్ గ్రామ సగటు లింగ నిష్పత్తి 1021, ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సగటు 938 కన్నా ఎక్కువ. పిల్లల లైంగిక నిష్పత్తి 1033, అరుణాచల్ ప్రదేశ్ సగటు 972 కన్నా తక్కువ.అరుణాచల్ ప్రదేశ్ తో పోలిస్తే పాంగిన్ గ్రామంలో అక్షరాస్యత ఎక్కువ. పాంగిన్ అక్షరాస్యత 85.09% కాగా, అరుణాచల్ ప్రదేశ్ లో 65.38%. పాంగిన్ పురుషుల అక్షరాస్యత 87.18% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 83.04%.భారతదేశం రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, పాంగిన్ గ్రామాన్ని గ్రామ ప్రతినిధిగా ఎన్నుకోబడిన సర్పంచ్ (గ్రామ అధిపతి) పరిపాలనను నిర్వహిస్తారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Siang becomes 21st district of Arunachal". The Arunachal Times. 28 November 2015.
- ↑ "Panging East Siang Arunachal Pradesh". Archived from the original on 31 మార్చి 2022. Retrieved 26 October 2015.
- ↑ "Panging MLA". Archived from the original on 19 August 2016. Retrieved 14 August 2016.
- ↑ "Pangin H.Q. Village Population - Pangin - East Siang, Arunachal Pradesh". www.census2011.co.in. Retrieved 2021-06-15.