ప్రజాతి
Appearance
ప్రజాతి జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం. ద్వినామకరణ పద్ధతిలో కొన్ని జాతులను ఒక సమూహంలో ఉంచుతారు. ఈ జాతులన్నిటికి కొన్ని సాధారణ లక్షణాలుంటాయి. ఈ విధమైన సమూహాన్ని 'ప్రజాతి' అంటారు. కొన్ని సాధారణ లక్షణాలున్న ప్రజాతులను కుటుంబములో ఉంచుతారు.
ప్రజాతి పేరు
[మార్చు]ఒక మొక్క ప్రజాతి పేరు లాటినీకరణం చేయబడిన నామవాచక రూపం. ఇది పెద్ద అక్షరాలతో (Capital latter) తో ప్రారంభమవుతుంది.
కొన్ని ప్రజాతుల పేర్లు శాస్త్రవేత్తల గౌరవ సూచకంగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణ :
- సిసాల్పినో - సిసాల్పీనియా (Caesalpinia)
- బాహిన్ - బాహీనియా (Bauhinia)
- హుకర్ - హుకేరియా (Hookerea)
- టర్నిఫోర్ట్ - టర్నిఫోర్టియా (Tournefortia)
కొన్ని ప్రజాతుల పేర్లు ఆ మొక్కలను కనుగొన్న దేశాల వ్యవహారిక భాష నుండి వచ్చాయి. ఉదాహరణ:
కొన్ని ప్రజాతుల పేర్లు రెండు, మూడు గ్రీకు లేదా లాటిన్ పదాల కలయిక వల్ల ఏర్పడ్డాయి. ఉదాహరణ :
- పాలిగాల = Poly + Gala
- హైగ్రోఫిలా = Hygro + Phila
- ఆస్టర్ కాంత = Aster + Cantha
- ల్యూకాడెండ్రాన్ = Leuca + Dendron
మూలాలు
[మార్చు]- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.