గరిమ సంఖ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:భౌతిక శాస్త్రం తొలగించబడింది; వర్గం:భౌతిక శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగిం...
పంక్తి 14: పంక్తి 14:
గరిమ సంఖ్యని మూలకం యొక్క రసాయన సంక్షిప్త నామానికి ముందు వేసి చూపిస్తారు. ఇక్కడ H ముందు ఉన్న 1, 2, 3 గరిమ సంఖ్యలే
గరిమ సంఖ్యని మూలకం యొక్క రసాయన సంక్షిప్త నామానికి ముందు వేసి చూపిస్తారు. ఇక్కడ H ముందు ఉన్న 1, 2, 3 గరిమ సంఖ్యలే


[[వర్గం: భౌతిక శాస్త్రం]]
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం: రసాయన శాస్త్రం]]
[[వర్గం: రసాయన శాస్త్రం]]

01:49, 23 ఆగస్టు 2015 నాటి కూర్పు

ఒక అణువు (atom) యొక్క భౌతిక లక్షణాలని చెప్పేటప్పుడు గరిమ సంఖ్య (mass number), అణు భారం (atomic weight) అని రెండు మాటలు వాడతారు.

గరిమ సంఖ్య అనేది అణువు యొక్క కేంద్రకం (nucleus) లో మొత్తం ఎన్ని ప్రోటానులు, ఎన్ని నూట్రానులు ఉన్నాయో చెబుతుంది.

అణు భారం (atomic weight or atomic mass) అనేది ఒక మూలకపు అణువు యొక్క సగటు భారం లేదా సగటు గరిమ ఎంతో చెబుతుంది. ఈ సగటు విలువ లెక్క కట్టేటప్పుడు సదరు మూలకం సమస్థానులు (isotopes) ఎన్ని ఉన్నాయో చూసుకుని, ఆ సమస్థానులు ప్రకృతిలో ఏ నిష్పత్తిలో దొరుకుతాయో గమనించి, ఆ దామాషాతో సగటుని నిర్ధారించాలి.

ఉదాహరణ: ఉదజని (Hydrogen) కి ప్రకృతిలో మూడు సమస్థానులు ఉన్నాయి:

  • 1H లో 1 ప్రోటాను ఉంది కనుక దీని గరిమ సంఖ్య 1. ప్రకృతిలో ఇది 99.98% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 1
  • 2H లో 1 ప్రోటాను, 1 నూట్రాను ఉన్నాయి కనుక దీని గరిమ సంఖ్య 2. ప్రకృతిలో ఇది 0.018% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 2
  • 3H లో 1 ప్రోటాను, 2 నూట్రానులు ఉన్నాయి కనుక దీని గరిమ సంఖ్య 3. ప్రకృతిలో ఇది 0.002% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 3

కనుక ఉదజని (Hydrogen) యొక్క సగటు అణు భారం = 1.0079 grams/mole అవుతుంది.

గరిమ సంఖ్యని మూలకం యొక్క రసాయన సంక్షిప్త నామానికి ముందు వేసి చూపిస్తారు. ఇక్కడ H ముందు ఉన్న 1, 2, 3 గరిమ సంఖ్యలే