బంకుపల్లె మల్లయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
==కుటుంబము==
==కుటుంబము==
==రచనలు==
==రచనలు==
==సంఘసంస్కరణ==
==సంఘసంస్కరణ==
==వ్యక్తిత్వము==
==బిరుదములు==


[[వర్గం:1876 జననాలు]]
[[వర్గం:1876 జననాలు]]

14:15, 15 అక్టోబరు 2015 నాటి కూర్పు

బంకుపల్లె మల్లయ్యశాస్త్రి ప్రముఖ పండితుడు. సంఘసంస్కర్త. రచయిత.

జననం

ఇతడు 1876వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీకి సరియైన ధాత నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు పునర్వసునక్షత్రము, తులాలగ్నములో గంజాం జిల్లా సింగుపురం గ్రామంలో తన మాతామహుని ఇంటిలో జన్మించాడు. ఇతని స్వగ్రామము శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలానికి చెందిన ఉర్లాం గ్రామము. ఇతని తల్లిదండ్రులు సూరమ్మ మరియు గంగన్న. ఇతనిది కృష్ణ యజుశ్శాఖ, ఆపస్తంబ సూత్రుడు మరియు భారద్వాజ గోత్రుడు.

బాల్యం, విద్యాభ్యాసం

ఇతడు తన ఐదవ యేట తన తండ్రివద్ద వేదాధ్యయనము ప్రారంభించాడు. తరువాత ఉర్లాం జమీందారు కందుకూరి బసవరాజు గారి ఆస్థాన పండితుడైన భళ్లమూడి లక్ష్మణశాస్త్రి వద్ద సంస్కృతము నేర్చుకున్నాడు. తన పదహారవ యేడు వచ్చేసమయానికి పంచకావ్యాలు పూర్తిగా చదివాడు. తరువాత పర్లాకిమిడి రాజా వారి సంస్కృత కళాశాలలో చేరి అక్కడ భళ్లమూడి వెంకటశాస్త్రివద్ద శృంగారనైషధము, అభిజ్ఞాన శాకుంతలము చదివాడు. తరువాత పరవస్తు రంగాచార్యుల వద్ద సిద్ధాంతకౌముది పూర్తిచేశాడు. కూరెళ్ల సూర్యనారాయణశాస్త్రి వద్ద తర్కశాస్త్రము చదువుకున్నాడు. పోకల సింహాచలం వద్ద సంగీతము నేర్చుకున్నాడు. బంకుపల్లి కామశాస్త్రి వద్ద మంత్రశాస్త్రాన్ని అభ్యసించాడు. భళ్లమూడి దక్షిణామూర్తి శాస్త్రివద్ద పంచదశ ప్రకరణములు, గీతాభాష్యము చదువుకున్నాడు. శ్రీకూర్మం సంస్కృత పాఠశాలా పండితుడైన నౌడూరి వెంకటశాస్త్రి వద్ద మనోరమ, శబ్దరత్నములు మరియు పారిభాషేందుశేఖరము చదివాడు. గిడుగు రామమూర్తి పంతులు వద్ద ఇంగ్లీషు చదివాడు. మంత్రశాస్త్రవిద్యలో తన సహాధ్యాయి అయిన గంటి సూర్యనారాయణశాస్త్రి వద్ద వేదాంత, మీమాంస శాస్త్రాలను నేర్చుకున్నాడు.

ఉద్యోగము

కుటుంబము

రచనలు

సంఘసంస్కరణ

వ్యక్తిత్వము

బిరుదములు