చిలుకూరి వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:చరిత్రకారులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 69: పంక్తి 69:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}


[[వర్గం:చరిత్రకారులు]]
[[వర్గం:1872 జననాలు]]
[[వర్గం:1872 జననాలు]]
[[వర్గం:1939 మరణాలు]]
[[వర్గం:1939 మరణాలు]]

01:34, 27 మే 2019 నాటి కూర్పు

చిలుకూరి వీరభద్రరావు
జననం17 అక్టోబర్ 1872
రేలంగి, పశ్చిమ గోదావరి జిల్లా
మరణం1939
వృత్తిచరిత్ర పరిశోధకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆంధ్రుల చరిత్రము
బిరుదుచరిత్రచతురానన

చిలుకూరి వీరభద్రరావు పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చెసిన ఇతిహాసకుడు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా లోని రేలంగి గ్రామంలో 1872 లోఒక పేద కుటుంబంలో జన్మించారు. దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విభుదరంజని, ఆంధ్రకేసరి, సత్యవాది లాంటి పలు పత్రికలకు పనిచేశారు. 1909-1912 మధ్యకాలంలో చెన్నయ్ లో వుండి ఐదు సంపుటాల ఆంధ్రుల చరిత్ర రచించారు. ఆంధ్ర మహాసభ ఆయనకు చరిత్రచతురానన అనే బిరుదముతో గౌరవించింది. ఆంధ్రుల చరిత్ర పరిశోధక రచన కావడంతో విమర్శలకు గురిఅయింది. దీనికి విమర్శగా పుస్తకాలు ప్రచురింపబడినవి.[1] దీనివలన న్యాయవివాదాలను ఎదుర్కోవలసివచ్చింది.[2] ఆయన 1939 లో మరణించాడు. [3]

రచనా వ్యాసంగం

ఫెరిస్తా అనే విదేశీ యాత్రికుడు, చరిత్రకారుడు అళియ రామరాయలు పూర్వం గోల్కొండ నవాబైన కుతుబ్‌షా వద్ద పనిచేసెననీ, మరొక సుల్తాను ఆయన కోటపై పడి దాడిచేస్తే ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోగా గోల్కొండ కుతుబ్‌షా తరిమేసెననీ, అప్పుడు కృష్ణదేవరాయల వద్ద ఉద్యోగం సంపాదించాడనీ వ్రాశారు. అదికూడా ఎవరో అనామకుడైన చరిత్రకారుడు చెప్పగా విశ్వసిస్తూ వ్రాశారు. అళియ రామరాయల ప్రవర్తన, వ్యక్తిత్వం, తళ్ళికోట యుద్ధంలో వీరత్వంతో పోరాడి మరణించిన విధానం చూడగా అది సరికాదని నమ్మిన వీరభద్రరావు లోతైన పరిశోధన చేసి ఈ పుస్తకం రాశారు.[4][5]

రచనలు

  • రాజమహేంద్రపుర చరిత్రము
  • ఆంధ్రుల చరిత్రము
  • జీర్ణకర్ణాట రాజ్యచరిత్రము
  • తిక్కన సోమయాజి
  • తిమ్మరుసు మంత్రి
  • శ్రీనాథ కవి
  • శివాజీ చరిత్ర
  • కర్ణ సామ్రాజ్యము
  • నవరసిక మనోల్లాసిని
  • స్వయం సహాయము
  • వరలక్ష్మీ విలాసము
  • హిందూ సంసారము
  • హిందూ గృహము
  • హస్య తరంగిణి
  • సుమిత్ర
  • ఆళియరామరాయలు[5]
  • నాయకురాలి దర్పము
  • అశ్వత్థామ అచ్చి[6]
  • అశోక చక్రవర్తి ధర్మశాసనములు[7]

బిరుదులు

రాజమహేంద్రవరమున గల ఆంధ్రచరిత్ర పరిశోధకసభా ప్రతిష్ఠాపకులలో ఒకరైన వీరభద్రరావు గారికి 1928 లో నంద్యాల యందు సర్వేపల్లి రాధాకృష్ణన్ యాజమాన్యమున జరిగిన ' ఆంధ్ర మహాసభ ' లో ఆంధ్రచరిత్రచతురానన యను బిరుద మిచ్చి సత్కరించిరి.[8]

ఇవీ చూడండి

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


వనరులు

  1. వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 7 - రావిపాటి త్రిపురాంతకుని కృతులు : కొన్ని కొత్త వెలుగులు (రెండవ భాగం) పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు, సుజనరంజని జులై 2012
  2. Chilukuri Veerabhadra Rao vs Srupada Krishnamurthy Sastri on 3 November, 1939
  3. నా వాజ్మయ మిత్రులు - కామేశ్వరరావు టేకుమల్ల నుండి
  4. అళియ రామరాయలు: చిలుకూరి వీరభద్రరావు:పేజీ.4
  5. 5.0 5.1 వీరభద్రరావు, చిలుకూరి. అళియ రామరాయలు.[dead link]
  6. వీరభద్రరావు, చిలుకులూరి. అశ్వత్థామ అచ్చి.[dead link]
  7. వీరభద్రరావు, చిలుకూరి. అశోక చక్రవర్తి ధర్మశాసనములు.[dead link]
  8. ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, 1950, పేజీలు: 257-9.