అద్వైతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: fr:Advaïta védanta
పంక్తి 48: పంక్తి 48:
[[వర్గం:అద్వైతం]]
[[వర్గం:అద్వైతం]]
[[వర్గం:షడ్దర్శనములు]]
[[వర్గం:షడ్దర్శనములు]]

[[en:Advaita Vedanta]]
[[en:Advaita Vedanta]]
[[hi:अद्वैत]]
[[hi:अद्वैत]]
పంక్తి 57: పంక్తి 58:
[[es:Advaita]]
[[es:Advaita]]
[[et:Advaita-vedaanta]]
[[et:Advaita-vedaanta]]
[[fr:Advaïta Védanta]]
[[fr:Advaïta védanta]]
[[gu:અદ્વૈત વેદાંત]]
[[gu:અદ્વૈત વેદાંત]]
[[id:Adwaita Wedanta]]
[[id:Adwaita Wedanta]]

19:55, 6 సెప్టెంబరు 2011 నాటి కూర్పు

అద్వైత వేదాంతం (ఆంగ్లం : Advaita Vedanta); సంస్కృతం : अद्वैत वेदान्त ); వేదాంతానికి చెందిన ఒక ఉపశాఖ లేదా తాత్విక వాదం. హిందూ తత్వశాస్త్రాల ప్రకారం దీని అర్థం "వేదముల లక్ష్యము".[1] వేదాంతాల ఇతర ఉపశాఖలు ద్వైతం మరియు విశిష్టాద్వైతం. అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది, జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక.[2] ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.[3]


చారిత్రకంగా దీని ప్రతిపాదకుడు గౌడపాదాచార్యుడు. ఇతడు శంకరుని గురువైన గోవింద భగవత్పాదునకు గురువు. అయితే మనకు లభించిన సాహిత్యం ప్రకారం ఈ తత్వానికి మూలగ్రంధాలు ప్రస్థానాత్రయం (Prasthanatrayi) — అనగా ఉపనిషత్తులు, భగవద్గీత మరియు బ్రహ్మసూత్రాలకు శంకరుడు రచించిన భాష్యాలు.


అద్వైతాన్ని క్లుప్తంగా చెప్పే శంకరుని వచనాలు -

బ్రహ్మ సత్యం జగన్మిధ్య
జీవొ బ్రహ్మైవ నా పరః

బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య. ఈ జీవుడే బ్రహ్మం. జీవుడు, బ్రహ్మము వేరు కాదు. - ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది. అయితే కంటికి కనిపిస్తున్న జగత్తు మిధ్య కావడమేమిటి? ఏనుగు తరుముకొస్తుంటే పారిపోవక తప్పదు కదా? - ఇందుకు మాయావాదం వివరణ : జగత్తులో జీవిస్తున్నంతకాలం దాని ఉనికి అనే భావనకు తగినట్లుగానే (అనగా అది యదార్ధమన్నట్లుగానే) ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఇదంతా మిధ్య అన్న జ్ఞానం గోచరమౌతుందో అపుడు అందుకు అనుగుణమైన ప్రవర్తన దానంతట అదే వస్తుంది.

భారతీయ తత్వవేత్తలందరిలాగానే శంకరుడు కూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు. ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు. మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి? "ఆత్మానాత్మ వివేకం" అనే ప్రకరణ గ్రంధంలో శంకరుడు ఇలా వివరించాడు -

ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?

పూర్వ జన్మ లలోని కర్మ వలన.

కర్మ ఎందుకు జరుగుతుంది?

రాగం (కోరిక) వలన.

రాగాదులు ఎందుకు కలుగుతాయి?

అభిమానం (నాది, కానాలి అనే భావం) వలన.

అభిమానం ఎందుకు కలుగుతుంది?

అవివేకం వలన

అవివేకం ఎందుకు కలుగుతుంది?

అజ్ఞానం వలన

అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?

అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.


అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి.





మూలాలు

  1. "Advaita Vedanta: A Philosophical Reconstruction," By Eliot Deutsch, University of Hawaii Press, 1980, ISBN 0-8248-0271-3.
  2. Brahman is not to be confused with Brahma, the Creator and one third of the Trimurti along with Shiva, the Destroyer and Vishnu, the Preserver.
  3. "Thirty-five Oriental Philosophers," By Diané Collinson, Robert Wilkinson, Routledge, 1994, ISBN 0-415-02596-6.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=అద్వైతం&oldid=641033" నుండి వెలికితీశారు