సి.కె.నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాయుడు గారిపై సి.వెంకటేశ్ గారి పుస్తకం నుండి కొన్ని వివరాలు ఈ పేజీకి జతచేస్తున్నాను.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36: పంక్తి 36:
* "నేను హోల్కర్ పాలకుడినైతే కావొచ్చు, కానీ ఔట్ డోర్ గేంస్ లో రారాజు మాత్రం సి.కె. నే" - యశ్వంత్ రావు, హోల్కర్ మహారాజా
* "నేను హోల్కర్ పాలకుడినైతే కావొచ్చు, కానీ ఔట్ డోర్ గేంస్ లో రారాజు మాత్రం సి.కె. నే" - యశ్వంత్ రావు, హోల్కర్ మహారాజా
* "తాత్వికుల చింతన కన్నా ఉన్నతమైన సిక్సర్లతో ఆయన కెరీర్ నిండిపోయింది" - డాం మొరేస్, రచయిత
* "తాత్వికుల చింతన కన్నా ఉన్నతమైన సిక్సర్లతో ఆయన కెరీర్ నిండిపోయింది" - డాం మొరేస్, రచయిత
* "డగ్లస్ జార్డిన్ జట్టుపై సి.కె.నాయుడు బ్యాటింగ్ జోరు చూశాక విదేశీయులంటే అప్పటివరకూ నాలో గూడు కట్టుకుని ఉన్న భయం కాస్తా పోయింది." - పృథ్వీరాజ్ అన్న అప్పటి యువక్రికెటర్
* "




పంక్తి 55: పంక్తి 57:
[[వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం: సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం: సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ క్రీడాకారులు]]


[[en:C. K. Nayudu]]
[[en:C. K. Nayudu]]

18:07, 30 అక్టోబరు 2012 నాటి కూర్పు

కొట్టారి కనకయ్యనాయుడు
జననంకొట్టారి కనకయ్యనాయుడు
అక్టోబర్ 31, 1895
నాగపూర్
మరణంనవంబర్ 14, 1967
ఇండోర్
ఇతర పేర్లుకల్నల్ సి.కె.నాయుడు
వృత్తిక్రికెట్ ఆటగాడు
భార్య / భర్తచంద్రమ్మ, గుణవతి
తండ్రిసూర్యప్రకాశరావు నాయుడు

కొట్టారి కనకయ్య నాయుడు(Cottari Kanakaiya "CK" Nayudu) తొలి భారత క్రికెట్ జట్టు కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు మరియు 1933లో విస్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు. 1955లో భారత ప్రభుత్వం నుండి "పద్మభూషణ్" అందుకున్నాడు.

నాయుడు 1895, అక్టోబర్ 31న నాగపూర్లో ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజులనుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనపరిచాడు. ఈయన ప్రధమ శ్రేణి క్రికెట్ ఆటలో ప్రవేశము 1916లో హిందూ జట్టులో, యూరోపియన్ జట్టుకు వ్యతిరేకముగా జరిగినది. ఈయన ఆ ఆటలో తమ జట్టు 79 పరుగులకు 7 వికెట్లు పడిన పరిస్థితిలో 9వ ఆటగాడిగా బ్యాటింగుకు దిగాడు. మొదటి మూడు బంతులు అడ్డుకొని, నాలుగో బంతిని సిక్సర్ కొట్టాడు. ఇలా మొదలైన ఈయన ప్రాబల్యం తన క్రీడాజీవితపు చివరినాళ్ల వరకు చెక్కుచెదరలేదు.

ఆరు దశాబ్దాలపాటు "ఫస్ట్ క్లాస్ క్రికెట్" ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో సి.కె.నాయుడు ఒకరు. 1956-57 రంజీ ట్రోఫీలో తన 62 వ యేట అతను చివరిసారి ఆడాడు. ఆ మాచ్‌లో 52 పరుగులు చేశాడు. రిటైర్ అయ్యాక కొన్నాళ్ళు జట్టు సెలెక్టర్ గా, రేడియో వ్యాఖ్యాతగా ఆటతో తన అనుబంధం కొనసాగించాడు.

ఈయన 1967, నవంబర్ 14న ఇండోర్‌లో మరణించాడు.

కుటుంబ నేపథ్యం

సి.కె.నాయుడు పూర్వీకులు కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందినవారు. అయితే, ఆయన తాతగారైన నారాయణస్వామినాయుడు గారికి రెండు తరాలకి ముందే వాళ్ళ కుటుంబం హైదరాబాదుకి తరలిపోయింది. నారాయణస్వామి తాతగారు నిజాం నవాబు వద్ద దుబాసీగా పనిచేసారు. తరువాత వారి మకాం ఔరంగాబాద్ కు మారింది. చివరికి నాగపూరు లో స్థిరపడ్డారు. సి.కె.నాయుడు అక్కడే పుట్టి పెరిగాడు. రాష్ట్రానికి ఆవలనున్నా సి.కె. ఇంట్లో తెలుగు వాతావరణమే ఉండేదని ఆయన పిల్లలు ఆయన గురించి రాసిన పుస్తకాలలో రాసారు. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ, తెలుగు పత్రికలు చదవడం, తెలుగు వస్త్రధారణలో ఉండటం నాయుడి గారి కుటుంబంలో కొనసాగాయి. సి.కె.మరణానంతరం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మచిలీపట్నంలో ఒక వీథికి సి.కె. పేరు పెట్టారు.

సి.కె. గురించి కొందరు ప్రముఖుల మాటలు

  • "సి.కె.నాయుడు బంతిని అందుకోవడం చూస్తే చాలు, ఆయన క్రికెట్ ఆడడం కోసమే పుట్టాడని అర్థమవుతుంది" - జాక్ హాబ్స్, ఇంగ్లండు క్రికెటర్
  • "నేను హోల్కర్ పాలకుడినైతే కావొచ్చు, కానీ ఔట్ డోర్ గేంస్ లో రారాజు మాత్రం సి.కె. నే" - యశ్వంత్ రావు, హోల్కర్ మహారాజా
  • "తాత్వికుల చింతన కన్నా ఉన్నతమైన సిక్సర్లతో ఆయన కెరీర్ నిండిపోయింది" - డాం మొరేస్, రచయిత
  • "డగ్లస్ జార్డిన్ జట్టుపై సి.కె.నాయుడు బ్యాటింగ్ జోరు చూశాక విదేశీయులంటే అప్పటివరకూ నాలో గూడు కట్టుకుని ఉన్న భయం కాస్తా పోయింది." - పృథ్వీరాజ్ అన్న అప్పటి యువక్రికెటర్
  • "


సి.కె.నాయుడు గురించి వచ్చిన పుస్తకాలు

  • సి.కె.నాయుడు: ఎ డాటర్ రిమెంబర్స్ - చంద్ర నాయుడు
  • సి.కె.నాయుడు : క్రికెటర్, స్కిప్పర్, పేట్రియార్క్ - రామచంద్ర గుహ
  • సి.కె.నాయుడు : ది షహెన్ షా ఆఫ్ ఇండియన్ క్రికెట్ - వసంత్ రైజీ

మూలాలు

కల్నల్ సి.కె.నాయుడు, రచన: సి.వెంకటేష్, సి.పి.బ్రౌన్ అకాడెమీ ప్రచురణ, 2011.

బయటి లింకులు