జోగ్ జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: zh:乔格法尔尔斯
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ms:Jog Falls
పంక్తి 84: పంక్తి 84:
[[lt:Jogo krioklys]]
[[lt:Jogo krioklys]]
[[mr:जोग धबधबा]]
[[mr:जोग धबधबा]]
[[ms:Jog Falls]]
[[new:जोग फल्स]]
[[new:जोग फल्स]]
[[pl:Wodospad Dźog]]
[[pl:Wodospad Dźog]]

15:45, 29 డిసెంబరు 2012 నాటి కూర్పు


జోగ్ జలపాతం
జోగ జలపాతం (ఋతుపవనాల కాలంలో)
ప్రదేశంషిమోగ జిల్లా, కర్ణాటక, భారతదేశం
రకంCataract, Segmented
సమద్రతలం నుండి ఎత్తు2600 అడుగులు
మొత్తం ఎత్తు829 అడుగులు/253 మీటర్లు
బిందువుల సంఖ్య1
పొడవైన బిందువు829 అడుగులు/253 మీటర్లు
నీటి ప్రవాహంశారవతి నది
సగటు ప్రవాహరేటు5,387 అ³/సె or 153 మీ³/సె
ప్రపంచములో ఎత్తువారిగా ర్యాంక్313

జోగ్ జలపాతం (ఆంగ్లం: Jog Falls, కన్నడ: ಜೋಗ ಜಲಪಾತ ) భారత దేశంలోని ఎత్తైన జలపాతలలో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తున్న ఈ జలపాతం కర్ణాటక రాష్ట్రం షిమోగ జిల్లా సాగర తాలూకాలో ఉన్నది. ఈ జలపాతం శరవతినది, 253 మీటర్ల (829 అడుగులు)ఎత్తు నుండి పడడం వల్ల ఏర్పడుతోంది. ఈ జలపాతం వివిధ రాష్ట్రాలనుండి పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఈ జలపాతాలకు గేరుసొప్ప లేదా జోగోడా గుండి అనే పేర్లు కూడా కలవు.[1] షిమొగ ను0చి జొగ్ జలపాత0 కు బస్సు ఇతర రవాణా సౌకర్యాలు కలవు.

జలపాత వివరణ

శరవతినది 829 అడుగుల నుండి పడుతూ నాలుగు పాయలుగా విడిపోయి నాలుగు వేర్వేరు గతిపథాలలో క్రింద పడుతుంది. ఈ విధంగా 4 గతిపథాలకు నాలుగు పేర్లు కలవు. ఎడమ నుండి కుడికి ఆ గతిపథాల ఆధారంగా జలపాతల పేర్లు వాటి పేర్ల వెనుక కారణాలు (ప్రక్కన ఉన్న బొమ్మలో చూడవచ్చు)

  • రాజ: జలపాతం చాలా నిర్మలంగా సౌమ్యంగా ఉన్న రాజు మాదిరిగా ఉండడం వల్ల జోగ్ జలపాతంలో ఈ గతిపథికి రాజు అని పేరు పెట్టారు.
  • రోరర్: ఈ జలపాతం పెద్ద పెద్ద రాళ్ల మధ్య నుండి పెద్ద పెద్ద శబ్ధం చేస్తూ క్రింద పడుతుండడం వల్ల జోగ్ జలపాతంలో ఈ గతిపథికి రోరర్‌ అని పేరు పెట్టారు.
  • రాకెట్: అత్యంత వేగంతో సన్నటి ధారగా రాకెట్టు మాదిరిగా ఉండడం వల్ల జోగ్ జలపాతంలో ఈ గతిపథికి రాకెట్టు అని పేరు పెట్టారు.
  • రాణి: వయ్యారాలు , వంపులు పోతూ పడే జోగ్ జలపాతంలో ఈ గతిపథికి రాణి అని పేరు పెట్టారు.

మహత్మా గాంధీ జలవిద్యుత్తు ప్రాజెక్టు

భారత దేశంలోని అతి పెద్ద జలవిద్యుత్తు ప్రాజెక్టులలో అతి పెద్ద ప్రాజెక్టు, హిరెబాస్కర డ్యాం శరవతి నది మీద నిర్మించబడినది.ఈ జల విద్యుత్తు ప్రాజెక్టు 1949 నుండి సుమారుగా 1200 మెగా వాట్ల విద్యుత్తు తయారు చేస్తోంది. అప్పటి రోజులలో ఈ ప్రాజెక్ట్ ను పూర్వపు మైసూరు రాజు నాల్గవ కృష్ణ రాజ వడియారు పేరుమీద కృష్ణ రాజేంద్ర విద్యుత్త్ ప్రాజెక్టు అని పిలిచేవారు. ఆ తరువాత ప్రాజెక్ట్ పేరు మహాత్మా గాంధీ జలవిద్యుత్తు ప్రాజెక్టుగా మార్చబడింది. ఆ తరువాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికతో 1960 సంవత్సరంలో శరవతి నది పై లింగనమక్కి అనే డ్యాం నిర్మించబడింది.

ఋతుపవనాలు ప్రారంభం కావడానికి మునుపు జోగ్ జలపాతం

ఋతుపవనాలు ప్రారంభమవడానికి ముందు లింగనమక్కి డ్యాంలో నీరు ఎక్కువగా ఉండదు.లింగనమక్కి డ్యాంలోని నీరు నిల్వ ఎక్కువగా లేకపొవడం వల్ల పనిదినాల్లో జోగ్ జలపాతం చాలా సన్నగా పడుతుంది. లింగనమక్కి డ్యాంలో నిల్వ చేయబడిన నీరు వారాంతములో పర్యాటకులని ఆకర్షించడానికి వదిలి పెడతారు.

జోగ్ కు చేరుకొనే విధానం

ఆగష్టు-డిసెంబర్ నెలలు జోగ్ జలపాతాలు దర్శించడానికి మంచి సమయం. ఈ సమయంలో జలపాతాలు మంచి ప్రవాహం ఉంటుంది. జోగ్, సాగరకు 30 కి.మీ. దూరంలో కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి 379 కి.మీ దూరంలో ఉన్నది.

  • జోగ్ జలపాతాలకు దగ్గరలో ఉన్న బస్సు స్టేషన్లు - జోగ్ , సాగర్. బెంగళూరు నుండి సరాసరి జొగ్ కు చేరడానికి బస్సు సౌకర్యం ఉన్నది. తప్పని పక్షంలో బెంగుళురు నుండి సాగర్‌కు బస్సు తీసుకొని , సాగర్ నుండి జోగ్ కి సులభంగా చేరుకోవచ్చు.షిమోగ నుండి జోగ్ 104 కి.మీ.దూరంలో ఉన్నది.
  • జోగ్ కి దగ్గరలో ఉన్న రైలు స్టేషన్లు - సాగర్, షిమోగ. బెంగళూరు నుండి సాగర్‌కి రైలు సౌకర్యం ఉన్నది.
  • కర్ణాటక రాష్ట్ర రొడ్డు రవాణా సంస్థ, మరియు ప్రైవేటు బస్సులు, చాలా మటుకు టూర్టిస్టు బస్సులు షిమోగ నుండి నడుస్తాయి.
  • దగ్గరలోని విమానశ్రయం - షిమోగ

జోగ్‌కి దగ్గరలో మరి కొన్ని ఆకర్షణలు

  • లింగనమక్కి డ్యాం నుండి వచ్చే వెనుక నీరు వల్ల హొన్నెమరాడు అనే ఈ ద్వీపం ఏర్పడింది.ఈ ద్వీపం జల క్రీడలకు ప్రసిద్ధి.

జోగ జలపాతాల బొమ్మల సంగ్రహం

బయటి లింకులు

  1. http://www.world-waterfalls.com/waterfall_print.php?num=156