మారేడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: zh:木橘
పంక్తి 67: పంక్తి 67:
[[tl:Bael]]
[[tl:Bael]]
[[udm:Баиль]]
[[udm:Баиль]]
[[zh:木橘]]

13:45, 19 జనవరి 2013 నాటి కూర్పు

మారేడు చెట్టు

మారేడు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Genus:
ఎగెల్
Species:
ఎ. మార్మలోస్
Binomial name
ఎగెల్ మార్మలోస్

మారేడు లేదా బిల్వము (Bael) హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం.

బిల్వపత్ర మహిమ

  • శివుని బిల్వ పత్రములతో పూజించుట శ్రేష్టము. బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని దేవతలు బావించెదరు. శివపురాణంలో బిల్వపత్రం యొక్క మహిమను తెలిపే కథ ఉన్నది. ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మముని పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించినాడు. అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి వుంచగలనని విన్నవించాడు. అంత శివుడు మారునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చి, ఆ వృక్షమునందు అగోచరముగా నివశించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిని పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. "నన్ను పట్టుకోలేకపోయావే?" అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి "నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వశించినారు. శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి నాయందే నీవు వశించి యుండుటచేత నేటినుండి నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.
  • లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టినది. ఆమెను 'బిల్వనిలయా' అని పిలుస్తారు.
  • బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సుర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టించుతారు.
  • మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంద్యాసమయము, రాత్రి వేళలందు, శిరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు కనుక ఈ దళాలను ముందు రోజు కోసి బభద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.
  • మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే శివుడికి అతి ప్రీతికరమైన పత్రము.
  • మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది.

ఉపయోగాలు

మారేడు kAya
మారేడు కాయలు
  • మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. అతిసార వ్యాధికి దీని పండ్ల రసాయనం చాలా మంచి మందు. ఆయుర్వేదములో వాడు దశమూలములలో దీని వేరు ఒకటి. మొలలకు ఇది మంచి ఔషధము. దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=మారేడు&oldid=787641" నుండి వెలికితీశారు