ధర్మపురి అరవింద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మపురి అరవింద్

లోక్‌సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు కల్వకుంట్ల కవిత (2014-2019)
నియోజకవర్గం నిజామాబాద్ తెలంగాణ

వ్యక్తిగత వివరాలు

జననం (1976-08-25) 1976 ఆగస్టు 25 (వయసు 47)
నిజామాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (బి.జె.పి)
తల్లిదండ్రులు ధర్మపురి విజయలక్ష్మి
ధర్మపురి శ్రీనివాస్ [1]
జీవిత భాగస్వామి ప్రియాంక
సంతానం సమన్యు, రుద్రాక్ష
వృత్తి పార్లమెంటు సభ్యుడు, వ్యాపారవేత్త

ధర్మపురి అరవింద్ (జ. 1976 ఆగస్టు 25) తెలంగాణ రాజకీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు. ఈయన నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి పార్లమెంటు సభ్యునిగా గెలుపొందాడు.[2] అతను 1995/96 లో హైదరాబాదులో ఫస్టు క్లాస్ క్రికెట్ మ్యాచ్ లలో ఆడాడు.[3] అతను నిజామాబాదు నుండి మూడు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ తరపున శాసనసభ్యునిగా ఎన్నికైన డి.శ్రీనివాస్కు చిన్నకుమారుడు.[4][5]

రాజకీయ జీవితం[మార్చు]

ఈయన తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె అయిన కె. కవితపై పోటీచేసి గెలుపొందాడు.[6][7][8]

ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ధర్మపురి అరవింద్ ను 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది.[9]

చదువు వివాదం[మార్చు]

ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో త‌ప్పుడు వివ‌రాలు పొందుప‌రిచార‌ని, పీజీ చ‌ద‌వ‌కున్నా చదివిన‌ట్లు చూపించార‌ని టీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ప‌క్కాగా సేకరించారు. డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ ద్వారా రాజ‌స్థాన్‌లోని జ‌నార్ధ‌న్ రాయ్ న‌గ‌ర్ రాజ‌స్థాన్ విద్యాపీఠ్ యూనివ‌ర్సిటీ నుంచి దూర విద్య ద్వారా ఎంఏ పొలిటిక‌ల్ సైన్స్ చ‌దివిన‌ట్లు అర్వింద్ త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పొందుప‌రిచాడు. రాజ‌స్థాన్‌లోని స‌ద‌రు యూనివ‌ర్సిటీలో ధ‌ర్మిపురి అరవింద్ చ‌దివారా, లేదా అనేది ఆర్టీఐ ద్వారా అడిగారు టి.ఆర్.ఎస్ నేతలు. అయితే, ఆ పేరుతో త‌మ యూనివ‌ర్సిటీలో ఎవ‌రూ చ‌ద‌వ‌లేద‌నే స‌మాధానం వ‌చ్చింద‌ని టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు[7].

మూలాలు[మార్చు]

  1. "Arvind Dharmapuri | National Portal of India". www.india.gov.in.
  2. "My father has nothing to do with my joining BJP: D Aravind". The Hindu (in Indian English). Special Correspondent. 29 June 2018. ISSN 0971-751X. Retrieved 1 February 2019.{{cite news}}: CS1 maint: others (link)
  3. "Dharmapuri Arvind". ESPN Cricinfo. Retrieved 16 April 2016.
  4. http://www.myneta.info/LokSabha2019/candidate.php?candidate_id=4828
  5. https://m.timesofindia.com/elections/candidates/arvind-dharmapuri
  6. TV9 Telugu (9 November 2023). "రంజీ క్రికెటర్ టూ రాజకీయ నాయకుడు.. ధర్మపురి అర్వింద్ రాజకీయ ప్రస్థానం ఇది". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. 7.0 7.1 "ధ‌ర్మ‌పురి అరవింద్ చ‌దువుపై ర‌గ‌డ‌.. ప‌క్కాగా ఇరికిస్తున్న టీఆర్ఎస్‌". newssting. Retrieved 2020-05-21.
  8. Eenadu (3 March 2024). "మరోసారి వారే". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  9. Eenadu (2 March 2024). "తెలంగాణలో భాజపా లోక్‌సభ అభ్యర్థులు వీరే." Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.

బాహ్య లంకెలు[మార్చు]