ప్రభల సత్యనారాయణ
Jump to navigation
Jump to search
ప్రభల సత్యనారాయణ పాతతరం తెలుగు సంగీతదర్శకులు. తెలుగులో ఘనవిజయం సాధించిన మొట్టమొదటి చిత్రం లవకుశ (1934)కు ఈయనే సంగీతదర్శకుడు. తరువాత వరవిక్రయము (సినిమా) కు సంగీతాన్నందించాడు. పూర్తిగా పిల్లలతో తీసిన అనసూయ (1936) చిత్రానికి కూడా ఈయనే సంగీతదర్శకుడు.[1]
సీతారామ జననం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు రామునిగా నటించాడు; కానీ అతని గళం స్త్రీ గళంగా ఉండేది. అపుడు ప్రభల సత్యనారాయణ, ఓగిరాల రామచంద్రరావును కలసి సలహా తీసుకుని సరిదిద్దుకున్నట్లు అక్కినేని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.[2]
- లవకుశ (1934) తమిళ చిత్రం
- అనసూయ (1936) తెలుగు చిత్రం
- గృహలక్ష్మి (1938) తెలుగు చిత్రం : ఇందులో రెండు పాటలు పాడాడు. అవి "కల్లుమానండోయి", "లెండు భరత వీరుల్లారా" [4]
- వరవిక్రయము (సినిమా) (1939) హిందీ చిత్రం
- కాలచక్రం (1940) తెలుగు చిత్రం
- సీతారామ జననం (1944) తెలుగు చిత్రం[5]
మూలాలు
[మార్చు]- ↑ "Prabhala Satyanarayana - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Archived from the original on 2020-07-24. Retrieved 2020-07-24.
- ↑ "Akkineni Nageswara Rao interview - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-07-24.
- ↑ "Prabhala Satyanarayana on Moviebuff.com". Moviebuff.com. Archived from the original on 2020-07-24. Retrieved 2020-07-24.
- ↑ Sastry, K. N. T. (2017-08-29). CHITTOOR V. NAGAIAH: A MONOGRAPH (in ఇంగ్లీష్). Publications Division Ministry of Information & Broadcasting. ISBN 978-81-230-2543-8.
- ↑ The Hindu, Cinema (25 February 2012). "Blast From The Past: Sri Sita Rama Jananam (1944)" (in Indian English). M.L. Narasimham. Archived from the original on 2018-06-20. Retrieved 29 September 2020.