ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆచార్య

ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే
జననం13 ఆగస్టు 1898
కొడిత్ ఖుర్ద్, పూణె జిల్లా, మహరాష్ట్ర
మరణం1969 జూన్ 13(1969-06-13) (వయసు 70)
ముంబై, మహరాష్ట్ర, భారతదేశం
ఇతర పేర్లుఆచార్య ఆత్రే
విద్యబిఏ
విద్యాసంస్థపూణే విశ్వవిద్యాలయం
లండన్ విశ్వవిద్యాలయం
వృత్తిరాజకీయ నాయకుడు, కవి, రచయిత

ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే (13 ఆగస్టు 1898 - 13 జూన్ 1969), అచార్య ఆత్రేగా పేరొందిన మరాఠీ రచయిత, కవి, విద్యావేత్త, మరాఠా పత్రిక వ్యవస్థాపక-సంపాదకుడు, వక్త, సినిమా దర్శకుడు. ఆత్రే దర్శకత్వం వహించిన శ్యాంచి ఆయ్ సినిమాకు మొదటి జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ లోటస్ అవార్డు వచ్చింది.[1]

తొలి జీవితం[మార్చు]

ఆత్రే 1898, ఆగస్టు 13న పూణె జిల్లాలోని సాస్వాద్ సమీపంలోని కొడిత్ ఖుర్ద్ అనే దేశస్థ బ్రాహ్మణ [2] కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి గుమస్తాగా, కొంతకాలం సాస్వాద్ మునిసిపాలిటీ కార్యదర్శిగా, మామయ్య ఎంఈఎస్ వాఘైర్ హైస్కూల్ సాస్వాడ్లో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాస్వాద్ లోని ఎంఈఎస్ వాఘైర్ హైస్కూల్ లో ప్రాధమిక, ఉన్నత విద్యను పూర్తిచేసిన ఆత్రే, 1919లో ఫెర్గూసన్ కళాశాల నుండి మెట్రిక్యులేషన్ చేశాడు. పూణే విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. గ్రాడ్యుయేషన్ పూర్తైన తరువాత పాఠశాల ఉపాధ్యాయుడిగా వృత్తిని చేపట్టాడు. 1928లో లండన్ విశ్వవిద్యాలయం నుండి తన టిడి (టీచర్ డిప్లొమా) పట్టా పొందాడు.[3] భారతదేశానికి తిరిగి రాకముందు సిరిల్ బర్ట్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మక మనస్తత్వశాస్త్రం అభ్యసించాడు, హారోలో బోధించాడు.[4]

సినిమా, నాటకరంగం[మార్చు]

ఆత్రే రూపొందించిన శ్యాంచి ఆయ్ అనే మరాఠీ సినిమా 1954లో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది.[5] ఆత్రే ఏడు నాటకాలు రాయగా, అందులో కొన్ని హాస్యప్రదమైన ఇతివృత్తంతోనూ, మిగిలినవి గంభీరమైన ఇతివృత్తాన్ని కలిగి ఉన్నాయి. ఇతడు రాసిన మోరుచి మావ్షి అనే కామెడీ-నాటకం గోవింద, రవీనా టాండన్ హీరోహీరోయిన్స్ గా ఆంటీ నంబర్ 1 (1998) సినిమాగా తీయబడింది. ఆత్రే తీసిన మహాత్మా ఫూలే (1955) సినిమా రాష్ట్రపతి సిల్వర్ మెడల్ అందుకుంది.

రాజకీయ జీవితం[మార్చు]

  • 1956-60 మధ్యకాలంలో సాన్యుక్త మహారాష్ట్ర సమితి సభ్యుడిగా ఉన్నాడు. 1956 లో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద ఆత్రేను అరెస్టు చేశారు.
  • 1962-1967 మధ్యకాలంలో దాదర్ నియోజకవర్గం నుండి మహారాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు.[6]

భారత పార్లమెంటు సభ్యుడు కావాలనుకున్నాడు, కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో అతని ఆశయం నెరవేరలేదు.

రచనలు[మార్చు]

నాటకాలు[మార్చు]

  • సాష్టాంగ్ నమాస్కర్ (1935)
  • ఘారాబహర్ (1934)
  • భ్రామచా భోపాలా (1935)
  • ఉద్యాచీ సాన్సార్ (1936)
  • లగ్నాచి బేడి (1936)
  • మోరుచి మావాషి (1947) మరాఠీ కామెడీ నాటకం
  • టు మి నవెచ్ (1962)

నవలలు, జీవిత చరిత్రలు, వ్యాసాలు[మార్చు]

  • చాంగునా (1954)
  • బట్టాషి వా ఇటార్ కాథే (1954)
  • మహత్మా జ్యోతిబా ఫూలే (1958)
  • సూర్యస్త (1964) (జవాహర్ లాల్ నెహ్రూ జీవితంపై)
  • సమాధివారిల్ ఆశ్రు (1956)
  • కెలీన్ దేశాటన్ (1961)
  • ఆత్రే ఉవాచ్ (1937)
  • లలిత్ వాంగ్మయ (1944)
  • హషాని టెలీ (1958)
  • మి కాసో ఝాలో (1953)

సినిమాలు[మార్చు]

  • బ్రహ్మచారి (1938)
  • శ్యాంచి ఆయ్ (1953)
  • ప్రేమ్‌వీర్ (స్క్రిప్ట్ రచయిత)
  • ధర్మవీర్ (స్క్రిప్ట్ రచయిత)
  • బ్రాండిచి బెటాలి (స్క్రిప్ట్ రచయిత)
  • పాయాచి దాసి (హిందీ: చరణోన్ కి దాసి) నిర్మాత
  • మహత్మా ఫూలే
  • పరిండే (హిందీ, ప్రిన్సిపాల్ ఆత్రే పేరుతో డైరెక్టర్) (1945)

జర్నలిజం[మార్చు]

  • 1940-1962 మధ్యకాలంలో సాప్తాహిక్ నావియుగ్ వీక్లీ, తుకారామ్ (1954) పత్రికలకు వ్యవస్థాపకుడు/సంపాదకుడు
  • సాయంత్రం వార్తాపత్రిక జై హింద్ (1948)
  • డైలీ మారిథే (1956 - చివరి వరకు)

గౌరవాలు[మార్చు]

  • బెల్గాంలో 38వ నాట్యా సమ్మెలన్ అధ్యక్షుడు (1955)
  • 10వ మహారాష్ట్ర అధ్యక్షుడు పట్రాకర్ సమ్మెలన్ (1950)
  • ఇండోర్, గ్వాలియర్ లో బరోడా ప్రాంతీయ సాహిత్య సమ్మెలన్ అధ్యక్షుడు
  • ఆయన గౌరవార్థం సాస్వాద్‌లో ఆచార్య ఆత్రే భవన్ ఉంది

అవార్డులు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "1st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 25 June 2021.
  2. The Illustrated Weekly of India, Volume 95. Bennett, Coleman & Company, Limited, at the Times of India Press. 1974. p. 31. Marathi literature is strewn with Deshastha writers. Some of the luminaries are B. S. Murdhekar, the neo classical poet and critic; the popular dramatists Acharya P. K. Atre, V.V.Shirwadkar; the poet and story writer G.D.Madgulkar popularly known as the "Modern Walmiki" of Maharashtra, Sahitya Akademi Award winners G. T. Deshpande, Laxmanshastri Joshi, S. N. Banhatti, V. K. Gokak and Mugali all belong to this community.
  3. Jaquir Iqbal (October 2009). Sunita Deshpande (ed.). Encyclopedic dictionary of Marathi literature. Global Vision Publishing House. pp. 37–38. ISBN 9788182202214. Retrieved 25 June 2021.
  4. Ashish Rajadhyaksha; Paul Willemen (10 July 2014). Encyclopedia of Indian Cinema. Routledge. p. 47. ISBN 9781135943189. Retrieved 25 June 2021.
  5. Awards IMDb
  6. "STATISTICAL REPORT ON – GENERAL ELECTION, 1962 – TO THE LEGISLATIVE ASSEMBLY OF MAHARASHTR" (PDF). Retrieved 25 June 2021.
  7. "2nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 25 June 2021.

బయటి లింకులు[మార్చు]