ప్రేమలు
ప్రేమలు | |
---|---|
దర్శకత్వం | గిరీష్ ఏడీ |
రచన | గిరీష్ ఏడీ కిరణ్ జోసీ |
మాటలు | ఆదిత్య హాసన్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అజ్మల్ సాబు |
కూర్పు | ఆకాష్ జోసెఫ్ వర్గీస్ |
సంగీతం | విష్ణు విజయ్ |
నిర్మాణ సంస్థ | భావన స్టూడియోస్ |
పంపిణీదార్లు | భావన రిలీజ్ ఫార్స్ ఫిల్మ్ కో |
విడుదల తేదీs | 9 ఫిబ్రవరి 2024(మలయాళం) 8 మార్చి 2024 (తెలుగు) |
సినిమా నిడివి | 156 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రేమలు 2024లో విడుదలైన తెలుగు సినిమా. భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈ సినిమాకు గిరీష్ ఏడీ దర్శకత్వం వహించగా తెలుగులో ఎస్.ఎస్ కార్తికేయ విడుదల చేశాడు. నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 08న విడుదల చేయగా[1] సినిమా మార్చి 08న విడుదలైంది.[2]
ఈ సినిమా ఏప్రిల్ 12 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
కథ
[మార్చు]కేరళకు చెందిన సచిన్ (నస్లెన్ గఫూర్) తమిళనాడులోని ఒక కాలేజీలో చదివి బయటకు వస్తాడు. యూకే వెళ్లిపోవాలని అనుకుంటాడు కానీ వీసా రిజెక్ట్ అవడంతో ఓ ఫ్రెండ్ సలహాతో హైదరాబాదులో గేట్ కోచింగ్ జాయిన్ అవుతాడు. రేణు (మమిత బైజు) కేరళ నుంచి జాబ్ చేయడం కోసం హైదరాబాద్ వస్తుంది. అనుకోకుండా ఓ పెళ్లిలో వీరిద్దరూ కలుస్తారు. అప్పటికే రేణు వాళ్ళ ఆఫీసులో ఆది (శ్యామ్ మోహన్) రేణుని ఇష్టపడుతూ ఉంటాడు. మంచి ఉద్యోగం చేస్తూ బాగా సెటిలైన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునే రీనూ సచిన్‌కి దగ్గరవుతూ ఉంటుంది. ఆ తర్వాత స్నేహితులుగా మారిన వీరి ప్రయాణం ఎలా సాగింది? సచిన్ రేణుకి తన ప్రేమని చెప్పాడా ? రేణు సచిన్ ప్రేమకు ఒకే చెప్పిందా? ఆ తరువాత ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
[మార్చు]- నస్లెన్ కె. గఫూర్
- మమితా బైజు
- మాథ్యూ థామస్ (విస్తరించిన అతిధి పాత్ర)
- శ్యామ్ మోహన్
- సంగీత్ ప్రతాప్
- అఖిలా భార్గవన్
- మీనాక్షి రవీంద్రన్
- అల్తాఫ్ సలీం
- షమీర్ ఖాన్
- రంజిత్ నారాయణ్ కురుప్
- ఏఆర్ రాజగణేష్
- కేఎస్ ప్రసాద్
- గోపు కేశవ్
- శ్యామ్ పుష్కరన్ (అతిధి పాత్ర)
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "వెల్‌కమ్ టు హైదరాబాద్" | కిట్టు విస్సాప్రగడ | హారిక నారాయణ్, రితేష్ జి రావు | 4:08 |
2. | "మినీ మహారాణి" | కిట్టు విస్సాప్రగడ | ఆదిత్య అయ్యంగార్, మనీషా ఈరభతిని | 3:52 |
మూలాలు
[మార్చు]- ↑ NT News (3 March 2024). "హిలేరియస్‌గా 'ప్రేమలు' తెలుగు ట్రైలర్". Archived from the original on 8 March 2024. Retrieved 8 March 2024.
- ↑ TV9 Telugu (29 February 2024). "ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళీ సూపర్ హిట్ 'ప్రేమలు'.. తెలుగులోనూ చూడొచ్చు." Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (7 April 2024). "ప్రేమలు తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆహాలో ఎప్పుడు చూడొచ్చంటే." Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (8 March 2024). "రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగులో ఎలా ఉంది?". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.