ఫార్మాల్డిహైడ్
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
Methanal
| |||
Systematic IUPAC name
Methanal | |||
ఇతర పేర్లు
Methyl aldehyde Methylene glycol Methylene oxide Formalin Formol, పిపీలికాలంతము Section1=! style="background: #F8EABA; text-align: center;" colspan="2" | గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [50-00-0] | ||
పబ్ కెమ్ | 712 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 200-001-8 | ||
డ్రగ్ బ్యాంకు | DB03843 | ||
కెగ్ | D00017 | ||
వైద్య విషయ శీర్షిక | Formaldehyde | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:16842 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | LP8925000 | ||
ATC code | P53 | ||
SMILES | C=O | ||
| |||
బైల్ స్టెయిన్ సూచిక | 1209228 | ||
జి.మెలిన్ సూచిక | 445 | ||
3DMet | B00018 | ||
ధర్మములు | |||
CH2O | |||
మోలార్ ద్రవ్యరాశి | 30.03 g·mol−1 | ||
స్వరూపం | Colorless gas | ||
సాంద్రత | 0.8153 g/cm³ (−20 °C)[1] | ||
ద్రవీభవన స్థానం | −92 °C (−134 °F; 181 K) | ||
బాష్పీభవన స్థానం | −19 °C (−2 °F; 254 K) | ||
400 g dm−3 | |||
log P | 0.350 | ||
ఆమ్లత్వం (pKa) | 13.3 | ||
Basicity (pKb) | 0.7 | ||
ద్విధృవ చలనం
|
2.33 D | ||
నిర్మాణం | |||
C2v | |||
Trigonal planar | |||
ప్రమాదాలు | |||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | మూస:R23/24/25 R34 మూస:R43 మూస:R45 | ||
S-పదబంధాలు | (S1/2) S26 S36/37/39 S45 మూస:S51 S53 S60 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత |
430 °C (806 °F; 703 K) | ||
విస్ఫోటక పరిమితులు | 7–73% | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LD50 (median dose)
|
100 mg/kg (oral, rat)[3] | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
ఫార్మాల్డిహైడ్ లేదా ఫార్మలిన్ (Formaldehyde) ప్రయోగశాలలో ఉపయోగించే రసాయనిక పదార్ధము. దీని రసాయనిక ఫార్ములా H2CO లేదా HCOH. ఇది అన్నిటికన్నా సరళమైన ఆల్డిహైడ్ (Aldehyde). దీనికి చాలా పేర్లు ఉన్నాయి: మెతనాల్, మెతల్ ఆల్డిహైడ్, మెతిలీన్ గ్లైకాల్, మెతిలీన్ ఆక్సైడ్, ఫార్మలిన్, ఫార్మాల్, అనే ఇంగ్లీషు పేర్లే కాకుండా దీని తెలుగు పేరు పిపీలికాలంతం.
పిపీలికాలంతం
[మార్చు]ఫార్మాల్డిహైడ్ ని అర్థం చేసుకుందుకి మెతేన్తో మొదలు పెట్టడం ఒక పద్ధతి. ఒక మెతేను బణువు (molecule)లో మధ్య ఒక కర్బనం అణువు (atom), దాని చుట్టూ నాలుగు ఉదజని అణువులు ఉంటాయి. ఈ నాలుగింటిలో ఒక ఉదజని అణువుని తొలగించి, దాని స్థానంలో ఒక హైడ్రాక్సిల్ గుంపుని, అనగా “ఒ-ఎచ్” (-OH) ని, ప్రవేశపెడితే మెతల్ ఆల్కహాలు వస్తుంది. ఇలా కాకుండా, ఒక మెతేను బణువులో ఉన్న రెండు ఉదజని అణువులని తొలగించి, వాటి స్థానంలో ఒకే ఒక ఆమ్లజని అణువుని ప్రవేశపెట్టవచ్చు. అప్పుడు కర్బనానికీ ఆమ్లజనికీ మధ్య జంట బంధం ఉంటుంది. ఇలా వచ్చిన పదార్థాన్ని ఇంగ్లీషులో “ఫార్మాల్డిహైడ్” (formaldehyde) అంటారు. ఈ ఫార్మాల్డిహైడ్ నిర్మాణక్రమం బొమ్మలో చూడవచ్చు.
ఫార్మాల్డిహైడ్ నిర్మాణక్రమం (structural formula) ని మరొక కోణం గుండా కూడ చూడవచ్చు. ఇప్పుడు మెతల్ ఆల్కహాలులో ఉన్న రెండు ఉదజని అణువులని తీసేసి చూద్దాం. అలా తీసెయ్యగా మిగిలినది ఫార్మాల్డిహైడ్. ఇలా ఒక పదార్థం నుండి ఉదజని అణువులని తీసివేసే పద్ధతిని ఇంగ్లీషులో “డీహైడ్రాజినేషన్” (dehydrogenation) అంటారు. కనుక రెండు ఉదజని అణువులని తీసివెయ్యగా మిగిలిన ఆల్కహాలు “డిహైడ్రాజినేటెడ్ ఆల్కహాల్” (dehydrogenated alcohol) అని కాని “ఆల్కహాల్ డిహైడ్రాజినేటెడ్” (alcohol dehydrogenated) అని కాని అంటారు. ఈ రెండవ ప్రయోగం లోని మొదటి మాట లోని మొదటి రెండు ఇంగ్లీషు అక్షరాలు, రెండవ మాట లోని మొదటి ఐదు అక్షరాలు తీసుకుంటే “ఆల్‌డిహైడ్” (aldehyd) అనే కొత్త మాట వచ్చింది కదా. దీనికి చివర “ఇ” (e) చేర్చితే వాడుకలో ఉన్న స్పెల్లింగు వస్తుంది. ఇంగ్లీషు వర్ణక్రమానికి, ఉచ్చారణకి ఎక్కడా పొంతన ఉండదు. విటమిన్ అనే మాట తయారు చేసినప్పుడు మాట చివర ఉన్న “ఇ” తీసేశాం. ఇక్కడ మాట చివర “ఇ” ప్రవేశపెట్టేం. దీని వెనక వ్యాకరణ సూత్రం అంటూ ఏమీ లేద్ఏ; ఇది భాష వైపరీత్యం.
ఫార్మాల్డిహైడ్ కి తెలుగు పేరు పెట్టబోయే ముందు, దీని పేరు గురించి జినీవా ఒప్పందం ఏమంటుందో చూద్దాం. ఆల్కహాలు జాతి పేర్లు “ఓల్” (ol) శబ్దంతో అంతం అవాలన్న నిబంధన లాగే ఆల్డిహైడ్ జాతి పదార్థాల పేర్లు “ఆల్” (-al) శబ్దంతో అంతం అవాలని జినీవా ఒప్పందం ఆదేశించింది. ఫార్మాల్డిహైడ్ కి మెతేన్ తల్లి లాంటిది కనుక ఫార్మాల్డిహైడ్ ని “మెతనాల్ (methanal) అనమన్నారు. మెతల్ ఆల్కహాలు ని “మెతనోల్” (methanol) అని అనమన్నారు. ఈ రెండు పదాల వర్ణక్రమాలలో అత్యల్పమైన తేడా ఉంది కాని ఈ రెండు పదార్థాల పదార్థాలలో (పదాల అర్థం లో) బోలెడు తేడా ఉంది. ఈ రెండు పదాల ఉచ్చారణలలో అత్యల్పమైన తేడా ఉంది. శ్రవణదోషం లేకుండా విన్నంత సేపు ఈ తేడా తెలుస్తుంది.
ఈ ఉపోద్ఘాతం అయింది కనుక ఇప్పుడు ఫార్మాల్డిహైడ్ కి ఒక తెలుగు పేరు కూడ పెడదాం. ఆల్కహాలుని “ఒలంతం” అన్నట్లే ఆల్డిహైడ్‌ని “అలంతం” అందాం. అచ్చుతో అంతం అయే భాష కనుక తెలుగుని “అజంతం” అంటారని మరచిపోకండి. ఇక ఫార్మాల్డిహైడ్‌లో “ఫార్మ” అన్న శబ్దం ఎక్కడ నుండి వచ్చిందో, దాని అర్థం ఏమిటో విచారిద్దాం. లేటిన్‌లో “ఫార్మైకా” (formica) అంటే చీమ. చీమ కాటు చుర్రు మనడానికి కారణం ఆ కాటులో “చీమామ్లం” (“ఫార్మిక్ ఏసిడ్”, formic acid) అనే ఆమ్లం ఉండడం వల్లనే. “చీమామ్లం” అంటే మరీ నాటు భాషలా ఉంది కనుక దీనిని మనం “పిపీలికామ్లం” అందాం. సంస్కృతంలో పిపీలికం అంటే చీమ. “పిపీలికాది బ్రహ్మ పర్యంతం” అన్న ప్రయోగం చూడండి. కనుక ఫార్మాల్డిహైడ్ లో “ఫార్మ్” శబ్దానికి “పిపీలిక” అన్నది సమానార్థకమైన మూల ధాతువు. ఇంకేమి, ఇప్పుడు ఫార్మాల్డిహైడ్ ని తెలుగులో “పిపీలికాలంతం” అనొచ్చు.
పిపీలికాలంతానికి చాల ఘాటైన వాసన ఉంది. ఒక సారి పీల్చితే మరి మరవలేని వాసన ఇది. ఈ వాయువు కళ్లకి తగిలితే కళ్ల వెంబడి నీళ్లు కారతాయి. ఒక్క కళ్లనే కాదు, శరీరంలో చెమ్మగా ఉన్న ప్రదేశాలన్నిటిని ఈ వాయువు బాధిస్తుంది. దీనికి కారణం ఉంది. ఫార్మాల్డిహైడ్ శరీరంలోని ప్రాణ్యము (protein) తో సంయోగం చెంది, ఆ ప్రాణ్యం ప్రాణం తీసేసి, అట్టముక్కలా చేస్తుంది. అదే ఊపులో ఆ ప్రాణ్యాన్ని అంటిపెట్టుకుని ఉన్న సూక్ష్మజీవులని, క్రిములని కూడ చంపెస్తుంది. అందుకనే శరీరాంగాలని పదిల పరచడానికి ఫార్మాల్డిహైడ్ ని వాడతారు. ఫార్మాల్డిహైడ్ వాయు పదార్థం కనుక ముందుగా ఈ వాయువుని నీళ్లల్లో కరిగించి, అలా కరిగించగా వచ్చిన ఫార్మలిన్ (formalin) ని సీసాలలో పోసి, ఆ సీసాలలో శరీర భాగాలు పదిలపరుస్తారు. ఎనాటమీ, బయాలజీ ప్రయోగశాలలో వేసే వాసన ఈ ఫార్మలిన్‌దే.
శవసంరక్షణ
[మార్చు]మన దేశాచారం ప్రకారం మనిషి ప్రాణం పోయిన తరువాత, వెనువెంటనే దహనసంస్కారాలు చేసెస్తారు కాని, పాశ్చాత్య దేశాలలో ప్రాణం పోయిన తరువాత బంధు, మిత్ర వర్గాదులందరు వచ్చి, ఆఖరుగా కళేబరాన్ని చూసి పోయే వరకు శవాన్ని పదిలపరచే ఆచారం ఉంది. కాని ప్రాణం పోయిన ఉత్తర క్షణం నుండి శరీరం శిధిలమై, కుళ్లడం మొదలు పెడుతుంది. కొద్ది గంటలలో శరీరం దుర్వాసన కూడ వేస్తుంది. ఇంకా ప్రాణాలతో బతికున్న వాళ్లకి ఈ పరిస్థితి ఆరోగ్యకరం కాదు. అందుకని శవం కుళ్లకుండా ఉంచడానికి, ముఖానికి ప్రేత కళా రాకుండా అరికట్టడానికి మార్గం కావలసి వచ్చింది. ఈ సందర్భంలో పిపీలికాలంతం కావలసిన లక్షణాలతో ఎదురయింది.
పాశ్చాత్య దేశాలలో ఆచారం ఇలా ఉంటుంది. ప్రాణం పోయినప్పుడు “మోర్టీషియన్” (mortician) అనే వృత్తి గల ఆసామీ వచ్చి శవాన్ని తరలించుకుపోతాడు. తన ప్రయోగశాలలో శరీరంలోని రక్తాన్ని (గడ్డకట్టుకుపోతుంది అనుకొండి) బయటకి తోడడానికి వీలుగా గళ ధమని (కరోటిడ్ ఆర్టరీ, carotid artery) లో ఒక కత్తిరింపు, గళ సిరలో మరొక కత్తిరింపు వేస్తాడు. ధమనిలో చేసిన బెజ్జం గుండా లోపలకి ఫార్మలిన్ ని ఎక్కించి, సిరలో చేసిన బెజ్జం గుండా లోపల కరడు కట్టిన రక్తాన్ని బయటకి తోడతాడు. ఇలా ఫార్మలిన్ ని లోపలికి ఎక్కించడానికీ, రక్తాన్ని బయటకి తోడడానికి ఒక పంపు లాంటి యంత్రం ఉంటుంది.
ఒక్క ఫార్మలిన్ మాత్రమే కాకుండా రసహరితం (మెర్‌కురిక్ క్లోరైడ్, mercuric chloride), యశదహరితం (జింక్ క్లోరైడ్, zinc chloride) కూడ శరీరంలోకి ఎక్కించవచ్చు. దీనితో రక్తనాళాలతో పని పూర్తి అయినట్లే. తరువాత శరీరంలో ఉండే ఖాళీ ప్రదేశాలలో చేరుకున్న రక్తాన్ని, ఇతర ద్రవపదార్థాలనీ బయటకి తోడేసి, ఆ ఖాళీలని కూడ ఫార్మలిన్‌తో నింపుతారు. ఈ తంతు అంతా పూర్తి అయిన తరువాత, శవాన్ని శుభ్రపరచి, పీక్కుపోయిన ముఖంతో, ప్రేతకళతో కాకుండా, నిద్రపోతూన్న మనిషిలా కనబడేటట్లు చేస్తారు. అప్పుడా శవానికి సూటూ, బూటూ తొడిగి, ఫార్మలిన్ ఘాటుకి కళ్ల వెంబడి నీళ్లు వస్తాయి కనుక కొంచెం సెంటూ, గింటూ పూసి, అప్పుడు బంధుమిత్రులకి చూపిస్తారు.
క్రిమి సంహారం
[మార్చు]ఫార్మాల్డిహైడ్ వాయు పదార్థం కనుక ఒక చోటు నుండి మరొక చోటుకి తీసుకెళ్లడం కష్టం. కాని ఈ ఫార్మాల్డిహైడ్‌ని దండిస్తే (అంటే, పొలిమరైజ్ చేస్తే) ఘన పదార్థంగా మారుతుంది. ఇలా దండించగా వచ్చిన పదార్థాన్ని “పరాఫార్మాల్డిహైడ్” (paraformaldehyde) అంటారు. అంటే, మరొక ఫార్మాల్డిహైడ్ అని అర్థం. ఈ పరాఫార్మాల్డిహైడ్‌తో కొవ్వత్తి లాంటి వత్తులని చేసి, వత్తులని గదిలో వెలిగించి, అందరు బయటకి వెళ్లిపోయి, గది తలుపులు మూసెస్తే, వత్తిలో ఉన్న పరాఫార్మాల్డిహైడ్ కరిగి ఫార్మాల్డిహైడ్‌గా మారి ఆ వాయువుతో గది అంతా నిండిపోతుంది. ఆ దెబ్బకి గదిలో ఉన్న చిమ్మెటలు, చెదపురుగులు, సాలీళ్లు, వగైరా అన్నీ చచ్చిపోతాయి. ఇలాంటి పనులు అనుభవం ఉన్న వాళ్లు, తరిఫీదు పొందిన వాళ్లు చెయ్యాలి కాని, తెలిసీ తెలియని వాళ్లు మిడిమిడి జ్ఞానంతో చెయ్యకూడదు.
ప్లేస్టిక్ పెంకులు
[మార్చు]ఫార్మాల్డిహైడ్ ని ఫీనాల్‌తో కలిపి దండిస్తే ఒక రకమైన బహుభాగి (పోలిమర్, polymer) వస్తుంది. ఇది కొంచెం పెళుసుగా, గాజులా, ఉంటుంది. ఇలాంటి పదార్థాలని ఇంగ్లీషులో “రెజిన్” (resin) అంటారు. దేవదారు జాతి మొక్కలనుండి స్రవించే బంక లాంటి రసం గడ్డకట్టినప్పుడు “రెజిన్” అనే మాట వాడతారు. అమరకోశంలో “యక్షధూపస్సర్జరసోరాళస్సర్వరసావపి బహురూపో” అని వీటిని అభివర్ణించేరు. కనుక ఈ రెజిన్ అన్న మాటకి దేశవాళీ మాట కావాలంటే సర్జరసం అనో రాళ అనో మనం అనొచ్చు. రాళ అన్న మాట రెజిన్ ని పోలి ఉంది కనుక మనం రెజిన్ ని తెలుగులో రాళ అందాం. ఎండినప్పుడు రాళ్లల్లా ఉన్నా ఈ రాళని వేడి చేస్తే మెత్తబడుతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు, వాటిని మనకి కావలసిన ఆకారంలో పోతపోసి, తరువాత చల్లార్చితే గట్టి పడిపోతాయి. ఇలా వేడికి లొంగి, వంగి, చల్లారేసరికి గట్టిగా తయారయే దానిని ఇంగ్లీషులో “థర్మోసెట్టింగ్ ప్లేస్టిక్” (thermosetting plastic) అంటారు. ఫార్మాల్డిహైడ్ ని ఫీనాల్‌తో కలిపి దండిస్తే వచ్చే ఈ రకం రాళని 1905 లో బెల్జియం దేశస్తుడు, బేకలండ్ అనే ఆయన, మొదట తయారు చేసి ఆ పదార్థానికి “బేకలైట్” అని తన పేరే పెట్టేసుకున్నాడు. ఇప్పటికీ ఈ బేకలైట్ (bakelite) విస్తారంగా వాడుకలో ఉంది.
ఇంటి పేరు సంపెంగ
[మార్చు]పిపీలికాలంతంలో ఉన్న రెండు ఉదజని అణువులని తీసేసి వాటి స్థానాల్లో రెండు హరితం (Chlorine) అణువులు ప్రతిక్షేపిస్తే ఫాస్జీన్ (phosgene) అనే వాయు పదార్థం వస్తుంది. “అసలే కోతి, కల్లు తాగింది, నిప్పు తొక్కింది” అన్నట్లు ఈ ఫాస్జీన్ తయారీకి వాడే ఫార్మాల్డిహైడ్ ప్రాణ్యాల యెడల ప్రాణాంతకురాలు. దీనితో కలిపిన హరితం విష వాయువు. ఈ రెండు కలిసే సరికి తియ్యటి ఎండుగడ్డి వాసనతో - అప్పుడే కావు లోంచి తీసిన మామిడి పండు వాసన తో - పుట్టిన ఫాస్‌జీన్ పయోముఖవిషకుంభం అన్న సమాసానికి మంచి ఉదాహరణ. ఇంత మంచి వాసన వేస్తున్నాది కదా అని మరి కొంచెం గట్టిగా పీల్చేమంటే ప్రాణాలు పోతాయి. ఘాటుగా ఉన్న ఫార్మాల్డిహైడ్ ని పీల్చితే కళ్ల వెంబడి నీళ్లు కారతాయి. తియ్యగా ఉన్న ఫాస్జీన్ ని పీల్చితే ఊపిరితిత్తులు ద్రవ పదార్థాలతో నిండిపోయి, ఊపిరి ఆడక ప్రాణం పోతుంది. ఈ విషవాయువుని మొదటి ప్రపంచ యుద్ధంలో వాడేరు. దీని ప్రభావం చూసేక మళ్లా ఈ పదార్థాన్ని యుద్ధంలో వాడకూడదని ఒట్టేసుకున్నారు.
ఈ ఫాస్జీన్ కథ ముగించే లోగా మరొక్క విషయం. కర్బనచతుర్‌హరితాన్ని (కార్బన్‌టెట్ ని) మంటలు ఆర్పడానికి వాడతారు. ఈ మంటలలో రకాలు ఉన్నాయి: తాటాకు మంటలు, నూనె మంటలు, విద్యుత్ మంటలు, వగైరాలు. కర్రలు, తాటాకులు మండుతూన్నప్పుడు వాటి మీద నీళ్లు పోసి ఆర్పవచ్చు. బాణలిలో సలసల మరుగుతూన్న నూనె అంటుకుంటే దాని మీద నీళ్లు పొయ్యకూడదు. ఇదే విధంగా విద్యుత్ పరికరాలు “షార్ట్ సర్క్యూట్” (short circuit) అయి మంటలు లేచినప్పుడు వాటి మీద కర్బనచతుర్‌హరితాన్ని వాడకూడదు. ఎందుకంటే విద్యుత్ మంటల సమక్షంలో కర్బనచతుర్‌హరితంలో కొద్ది భాగం ఫాస్‌జీన్‌గా మారే సావకాశం ఉంది. అన్ని అగ్ని ప్రమాదాలకీ ఒకే మంత్రం పనికి రాదు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Formaldehyde (PDF), SIDS Initial Assessment Report, International Programme on Chemical Safety
- ↑ Weast, Robert C., ed. (1981). CRC Handbook of Chemistry and Physics (62nd ed.). Boca Raton, FL: CRC Press. pp. C–301, E–61. ISBN 0-8493-0462-8.
- ↑ http://chem.sis.nlm.nih.gov/chemidplus/rn/50-00-0
- వేమూరి వేంకటేశ్వరరావు, నిత్యజీవితంలో రసాయనశాస్త్రం, ఇ-పుస్తకం, కినిగె ప్రచురణ, http://kinige.com/kbook.php?id=3621 Archived 2022-05-17 at the Wayback Machine