Jump to content

బల్వంత్ సింగ్ మంకోటియా

వికీపీడియా నుండి
బల్వంత్ సింగ్ మంకోటియా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
నియోజకవర్గం చనాని

జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అధ్యక్షుడు
పదవీ కాలం
2010 – 2021
నియోజకవర్గం ఉధంపూర్

పదవీ కాలం
2002 – 2014
ముందు శివ చరణ్ గుప్తా
తరువాత పవన్ కుమార్ గుప్తా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2022–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (1989–2021)
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) (2022 ఏప్రిల్ 8– 2022 సెప్టెంబర్)
తల్లిదండ్రులు మస్త్ రామ్ మంకోటియా, సుర్జు దేవి
వృత్తి రాజకీయ నాయకుడు

బల్వంత్ సింగ్ మంకోటియా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో చనాని శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

బల్వంత్ సింగ్ మంకోటియా జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2002లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో ఉధంపూర్ నియోజకవర్గం నుండి నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పవన్ కుమార్ గుప్త పై 9952 ఓట్లు మెజారిటీ గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2008లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో ఉధంపూర్ నియోజకవర్గం నుండి నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పవన్ కుమార్ గుప్త పై 2765 ఓట్లు మెజారిటీ గెలిచి వరుసగా రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

బల్వంత్ సింగ్ మంకోటియా 2010లో జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై 10 ఫిబ్రవరి 2021 వరకు పని చేసి ఆ పార్టీకి రాజీనామా చేశాడు.[2] ఆయన 2022 ఏప్రిల్ 8న న్యూఢిల్లీలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరగా,[3] పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా ఆయనను 2022 సెప్టెంబర్ 25న ఆప్ నుండి బహిష్కరించారు.[4] బల్వంత్ సింగ్ మంకోటియా సెప్టెంబర్ 29న ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో  కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, రాజీవ్ చంద్రశేఖర్, బిజెపి ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరాడు.[5]

బల్వంత్ సింగ్ మంకోటియా 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో చనాని నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమ్తియాజ్ ముంతాజ్ అహ్మద్ పై 18815 ఓట్లు మెజారిటీ గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. బల్వంత్ సింగ్ మంకోటియాకి 39,647 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ముంతాజ్ అహ్మద్‌కు 20,832 ఓట్లు వచ్చాయి.[6][7]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Daily Excelsior (10 February 2021). "Balwant Singh Mankotia resigns from Panthers party". Retrieved 21 October 2024.
  3. The Tribune (9 April 2022). "Former minister, ex-MLA join AAP" (in ఇంగ్లీష్). Retrieved 21 October 2024.
  4. Hindustantimes (25 September 2022). "Day after his expulsion: Ex-MLA Balwant Singh Mankotia threatens defamation case against AAP leaders". Retrieved 21 October 2024.
  5. The New Indian Express (29 September 2022). "Ex-J&K Panthers Party chief Balwant Singh Mankotia joins BJP" (in ఇంగ్లీష్). Retrieved 21 October 2024.
  6. The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  7. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Chenani". Retrieved 21 October 2024.