Jump to content

బొమ్మలాట (1970 సినిమా)

వికీపీడియా నుండి
బొమ్మలాట
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి.శ్రీనివాసన్
తారాగణం జయశంకర్,
జయలలిత,
నగేష్
నిర్మాణ సంస్థ ఎం.వి.ఆర్. మూవీస్
భాష తెలుగు

బొమ్మలాట 1970లో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. 1968లో విడుదలైన తమిళ సినిమా బొమ్మలాట్టం దీనికి మూలం.

నటీనటులు

[మార్చు]
  • జయశంకర్ - సుకుమార్
  • జయలలిత - మాలతి
  • నగేష్ - సుధాకర్
  • చో రామస్వామి - జాంబజార్ జగ్గూ
  • సుందరరాజన్ - బాలరాజ్
  • సచ్చు - గీత
  • మనోరమ - సక్కూబాయి
  • వి.యన్.రాఘవన్ - డాక్టర్ రామ్మోహన్
  • ఒ.ఎ.కె.దేవర్
  • కె.మూర్తి
  • కె.ఆర్.దేవకి
  • నవకుమారి

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాత: మండవ వెంకటరత్నం
  • దర్శకత్వం: వి.శ్రీనివాసన్
  • మాటలు, పాటలు: శ్రీశ్రీ
  • సంగీతం: వి.కుమార్, ఇందర్‌జాన్ బాబు
  • ఛాయాగ్రహణం: టి.ఎం.సుందరబాబు
  • కూర్పు: ఇ.వి.షణ్ముగం
  • కళ: ఎ.రామస్వామి
  • నృత్యం: చిన్ని-సంపత్
  • స్టంట్స్: తిరుచారూర్ దాస్

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను శ్రీశ్రీ రచించగా వి.కుమార్,ఇందర్ జాన్ బాబు బాణీలను కూర్చారు.[1]

క్ర.సం. పాట పాడినవారు
1 మనసు హరించిన చోరుడే మైమరపించిన యోధుడే మనవిని తేలిక చేయకే అదికూడదే ఆమాటేమిటే పి.సుశీల
2 బావై గారి చోద్యాలే ఇక వర్ణింపగ నా వశమౌనా జాంబజార్ జగ్గూ ఇది జగ్గయ్యపేట సక్కూ ఎల్.ఆర్.ఈశ్వరి
3 చల్లగా పాడవో అందమైన పూమాల తోడ సమ్మతం తెల్పగా జాలమేలా సుఖమైన నీడ పిఠాపురం నాగేశ్వరరావు, రమాదేవి
4 మూతకళ్ల పిల్లుల లోకమిది సుమా పురుషుడిచట ఉన్నచోట బోర్డు మూసివేయుమా మూసివేయుమా విల్సన్, బెంగుళూరు లత
5 నీ ఆట నేడే తలచి నే పాట పాడ మరచి వచ్చానే తెచ్చానే ఏ లోటు లేని ప్రేమ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

డాక్టర్ రామ్మోహన్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్దకూతురు మాలతి సుకుమార్‌ను ప్రేమిస్తుంది. సుకుమార్ ప్రేమించడం కూడా తెలియని అమాయకమైన కాలేజీ విద్యార్థి. 50 రూపాయలు ఇచ్చి జగ్గూ ద్వారా ప్రేమించడం నేర్చుకుంటాడు. రెండవకూతురు గీత. సుధాకర్‌ను ప్రేమిస్తుంది. అక్క వివాహం జరగనిదే తన వివాహం జరగదని తన అక్క పెళ్ళి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో పనిమనిషి సక్కుబాయి. తన బావ జాంపేట జగ్గూ (రౌడీ)ని ప్రేమిస్తూ ఉంటుంది. తన ప్రేమకు అంగీకరించని జగ్గూను సక్కూబాయి ఎలా లొంగదీసుకుంది? డాక్టర్ రామ్మోహన్ కంటి వైద్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిపుణుడు. కళ్ళు పరీక్ష చేయించుకోవడానికి సింగపూరు నుండి వచ్చాడు బాలరాజ్. బాలరాజ్ నిజంగా గుడ్డివాడు కాదు. గుడ్డివాడిలా నటిస్తున్నాడు. అది గ్రహించాడు డాక్టర్ రామ్మోహన్. ఇది తెలిసి డాక్టర్‌ను బంధించాడు నకిలీ బాలరాజ్. అందరూ కలిసి డాక్టర్‌ను ఎలా విడుదల చేస్తారు? నిజమైన బాలరాజ్ ఏమైనాడు? డాక్టరును విడిపించడానికి తీసుకున్న 2 లక్షలు తిరిగి ఎలా సంపాదిస్తారు? అడుగడుగా ఆనందపరిచే తప్పుల తమాషా కథకు సమాధానమే ఈ సినిమా.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 శ్రీశ్రీ (1970). Bommalata (1970)-Song_Booklet (1 ed.). మద్రాసు: మండవ వెంకటరత్నం. p. 8. Retrieved 27 July 2022.