బెంగుళూరు లత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెంగళూరు లత
జన్మ నామంబి. ఆర్. లతా
జననంబెంగళూరు, కర్ణాటక, భారతదేశం
మూలంకర్ణాటక
సంగీత శైలినేపథ్య గానం
వృత్తిగాయని
క్రియాశీల కాలం1962-1990
జీవిత భాగస్వామిసోము
సంబంధిత చర్యలుఎం. రంగారావు, సాలూరు హనుమంతరావు

బెంగళూరు లత దక్షిణభారత చలనచిత్ర నేపథ్య గాయని. ఈమె కన్నడ, తెలుగు భాషాచిత్రాలలో పాటలు పాడింది. ఈమె జి.కె.వెంకటేష్, సుసర్ల దక్షిణామూర్తి, సాలూరు హనుమంతరావు, కె.వి.మహదేవన్, టి.వి.రాజు, సత్యం, ఎం.రంగారావు, టి.జి.లింగప్ప, విజయభాస్కర్ మొదలైన సంగీత దర్శకుల చిత్రాలలో పనిచేసింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రాజ్‌కుమార్, ఎస్.జానకి వంటి గాయకులతో కలిసి పాడింది. సముద్రాల సీనియర్, దాశరథి, ఆరుద్ర, వడ్డాది, ఆర్.ఎన్.జయగోపాల్, ఉదయశంకర్, జి.వి.అయ్యర్ వంటి రచయితల పాటలకు తన గాత్రాన్ని అందించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

లతా నటుడు టొమాటో సోమును వివాహం చేసుకున్నాడు.

తెలుగు సినిమా పాటల జాబితా

[మార్చు]

బెంగుళూరు లత పాడిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:

విడుదల సం. సినిమా పేరు పాట ఇతర గాయకులు సంగీత దర్శకుడు రచయిత
1963 నర్తనశాల సలలిత రాగ సుధారస రాగం సర్వకళామయ నాట్యవిలాసం మంగళంపల్లి బాలమురళీకృష్ణ సుసర్ల దక్షిణామూర్తి సముద్రాల రాఘవాచార్య
1963 నర్తనశాల శీలవతీ నీ గతి ఈ విధిగ మారెనా సుసర్ల దక్షిణామూర్తి సముద్రాల రాఘవాచార్య
1965 చంద్రహాస ఇలకు దిగిన అందాల తారవో సౌందర్యరాణివో పాలకడలిలో ఘంటసాల వెంకటేశ్వరరావు సాలూరు హనుమంతరావు
1968 అంతులేని హంతకుడు ఓ అమ్మాయి ఓ అమ్మాయి నీ మృదుహాసం పి.బి.శ్రీనివాస్ కె.వి.మహదేవన్ వడ్డాది
1968 దేవకన్య కన్నులన్ని పులకించు వేళ చెలి తొలితొలి వలపులు ఘంటసాల వెంకటేశ్వరరావు టి.వి.రాజు సి.నారాయణరెడ్డి
1972 బుల్లెమ్మ బుల్లోడు అమ్మ అన్నది ఒక చల్లనిమాట రమణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చెళ్ళపిళ్ళ సత్యం దాశరథి
1977 అదృష్టవంతురాలు వెలుగైనా నీడైనా జగతికి సహజం కాదా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చెళ్ళపిళ్ళ సత్యం ఆరుద్ర
1979 లక్ష్మీ పూజ మురిపాలే చూపి మోహాలే రేపి ముద్దుల్లో ముంచి ముంచి మోజు పెంచరా పి.సుశీల చెళ్ళపిళ్ళ సత్యం వీటూరి

కన్నడ చిత్రాల జాబితా

[మార్చు]

ఈమె పాటలు పాడిన కన్నడ చలనచిత్రాలు[1]:

 • మహాత్మ కబీర్ (1962)
 • శ్రీరామాంజనేయ యుద్ధ (1963)
 • మధుమాలతి (1964)
 • నాంది (1964)
 • ఎమ్మె తమ్మణ్ణ (1966)
 • గంగె గౌరి (1967)
 • చక్రతీర్థ (1967)
 • చిన్నారి పుట్టణ్ణ (1968)
 • చూరిచిక్కణ్ణ (1969)
 • మృత్యుపంజరదల్లి గూఢచారి 555 (1970)
 • అళియ గెలెయ (1971)
 • మాలతి మాధవ (1972)
 • కావేరి (1975)
 • ఇదు నమ్మదేశ (1976)
 • మనస్సినంతె మాంగల్య (1977)
 • ముయ్యిగె ముయ్యి (1978)
 • భలే హుడుగ (1978)
 • అత్తెగె తక్క సొసె (1979)
 • పట్టణక్కె బంద పత్నియరు (1980)
 • నాగ కాలభైరవ (1981)
 • నంబర్ ఐదో ఎక్క (1981)
 • అవళిజవళి (1981)
 • గుణ నోడి హెణ్ణు కొడు (1982)
 • కళసాపురద హుడుగరు (1982)
 • కార్మిక కళ్ళనల్ల (1982)
 • సువర్ణ సేతువె (1982)
 • కల్లువీణె నుడియితు (1883)
 • రుద్రనాగ (1984)
 • బెంకి బిరుగాళి (1984)
 • అదే కణ్ణు (1985)
 • ధృవతారె (1985)
 • జ్వాలాముఖి (1985)
 • లక్ష్మీకటాక్ష (1985)
 • మరియద మాణిక్య (1985)
 • మారుతి మహిమె (1985)
 • తాయియ హోణె (1985)
 • స్నేహ సంబంధ (1985)
 • మధుర బాంధవ్య (1986)
 • బజార్ భీమ (1987)
 • మానసవీణె (1987)
 • శివభక్త మార్కాండేయ (1987)
 • హృదయపల్లవి(1987)
 • ఊరిగిట్ట కోళ్ళి (1988)
 • సంసార నౌకె (1989)
 • హళ్ళియ సురాసురరు (1990)

మూలాలు

[మార్చు]

బయటిలింకులు

[మార్చు]