చంద్రహాస (1965 సినిమా)
చంద్రహాస (1965 సినిమా) (1965 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | బి.ఎస్.రంగా |
కథ | సదాశివ బ్రహ్మం |
తారాగణం | హరనాధ్, కృష్ణకుమారి, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఎస్. హనుమంతరావు |
నిర్మాణ సంస్థ | విక్రమ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
- ఇదే పేరుతో వచ్చిన మరొక సినిమా - చంద్రహాస (1941 సినిమా)
ఈ చిత్రం 1965, మే 7న విడుదలయ్యింది.
సాంకేతిక వర్గం[మార్చు]
- నిర్మాత, దర్శకుడు: బి.ఎస్.రంగా
- కథ: సదాశివబ్రహ్మం, చి.సదాశివయ్య
- మాటలు: సదాశివబ్రహ్మం
- సంగీతం:సాలూరు హనుమంతరావు
- పాటలు:చి.సదాశివయ్య, దాశరథి, కొసరాజు
- ఛాయాగ్రహణం:బిఎన్.హరిదాసు
- శబ్దగ్రహణం: ఎన్.శేషాద్రి, బిఎస్.శ్యామన్న
తారాగణం[మార్చు]
- హరనాథ్ - చంద్రహాసుడు
- కృష్ణకుమారి - విషయ
- వాణిశ్రీ - చంపకమాలిని
- గుమ్మడి వెంకటేశ్వరరావు - భాగురాయణుడు (మంత్రి)
- పుష్పవల్లి - మంత్రిభార్య
- రాజబాబు - గణపతి
- కైకాల సత్యనారాయణ - మదనుడు
- పండరీబాయి - సుగుణ
- ధూళిపాళ సీతారామశాస్త్రి - గాలవ మహర్షి
- జయంతి - కాళీమాత (అతిథిపాత్ర)
- డాక్టర్ శివరామకృష్ణయ్య - కుంతలదేశపు రాజు
- చదలవాడ కుటుంబరావు
- ఎ.వి.సుబ్బారావు (జూనియర్) - కుళిందరాజు
- సూర్యకళ - కుళిందదేశపు రాణి
- మాస్టర్ బాబు - బాల చంద్రహాసుడు
- ప్రభావతి
- రాధాకుమారి
- సచితాదేవి
పాటలు[మార్చు]
- ఇలకు దిగిన అందాల తారవో సౌందర్యరాణివో పాలకడలిలో - ఘంటసాల,బెంగుళూరు లత
- ఓ వీణ చెలీ నా ప్రియసఖీ ఈ ఒంటరితనము ఏలనో - ఎస్. జానకి
- నిండు చందామామ నా ఆనందసీమా మనతొలినాటి ప్రేమ - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్
- ఏమిటో, ఎందుకో
కథ[మార్చు]
కేరళ రాజు మేధావివర్మకు లేకలేక కలిగిన కుమారుడు చంద్రహాసుడు. కుంతల దేశపు రాజుకు ఒక కుమార్తె ఉంటుంది. ఆమె చంపకమాలిని. ఆ దేశపు మహామంత్రి భాగురాయణుడి కుమారుడు మదనుడు రాజకుమారి చంపకమాలినిని ప్రేమిస్తాడు. భాగురాయణుడి కుమార్తె విషయ. భాగురాయణుడు మదనుని చక్రవర్తి చేయాలని ఆశిస్తాడు. గాలవ మహర్షికి జాతకం చూపిస్తాడు. ఆ మహర్షి జాతకాలు చూసి మదనుడు చక్రవర్తి కాజాలడని, విషయ చక్రవర్తిని అవుతుందని చెబుతాడు. విధి లిఖితాన్ని మారుస్తానని భాగురాయణుడు ప్రతిన పూనుతాడు. చంద్రహాసుడు చక్రవర్తి కాగలడని విని తన సైన్యంతో కేరళ దేశం వెళ్ళి మేధావి వర్మను చంపిస్తాడు. రాణి ఆత్మహత్య చేసుకుంటుంది. చంద్రహాసుని సుగుణ అనే దాదికి అప్పగించి మరణిస్తుంది. కానీ సుగుణ భాగురాయణుడికి చిక్కుతుంది. ఆయన ఆజ్ఞ ప్రకారం చంద్రహాసుని చంపడానికి నియమితులైన సైనికులు దయతలిచి వేలు నరికి వదిలివేస్తారు. కుళిందరాజు, ఆతని సతీమణి చంద్రహాసుని పెంచుకుంటారు. పెరిగి పెద్దవాడైన చంద్రహాసుడు దేశసంచారంలో తన బాల్యస్నేహితుడు, సుగుణ కుమారుడైన గణపతిని కలుసుకుంటాడు. సుగుణను కలుసుకోవడానికి మంత్రి భవనానికి వెళ్ళిన చంద్రహాసుడు విషయను చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా అతనిని ప్రేమిస్తుంది. చంద్రహాసుడు కుళిందరాజు దత్తపుత్రునిగా పెరుగుతున్నాడని తెలుసుకున్న భాగురాయణుడు అక్కడికి వెళ్ళి కుమారుడైన మదనుడికి 'విషమునిమ్ము ' అని లేఖ వ్రాసి చంద్రహాసుని కుంతలదేశానికి పంపుతాడు. విషయ ఆ లేఖ చదివి 'విషయనిమ్ము 'అని మార్చివేస్తుంది. మదనుడు ఆ లేఖ చదివి చంద్రహాసునికి చెల్లెలినిచ్చి పెళ్ళి చేస్తాడు. అది తెలిసి ఆగ్రహోదగ్రుడైన భాగురాయణుడు అర్ధరాత్రివేళ అల్లుడిని కాళికాలయానికి పంపుతాడు. అతడిని హతమార్చడానికి నియమితులైన భటులు అదే సమయానికి అక్కడికి వెళ్ళిన మదనుడిని చంద్రహాసుడిగా భ్రమించి చంపివేస్తారు. దానితో భాగురాయణుడే చంద్రహాసుని చంపబోతాడు. అతని ప్రయత్నం ఎలా విఫలమయ్యిందనేది పతాక సన్నివేశంలో తెలుస్తుంది[1].
విశేషాలు[మార్చు]
ఇదే చిత్రాన్ని రాజ్‌కుమార్, ఉదయ్‌కుమార్, కె.ఎ.అశ్వత్థ్, నరసింహరాజు (కన్నడ నటుడు),లీలావతి, వాణిశ్రీ, పండరీబాయి ప్రధాన పాత్రలతో కన్నడ భాషలో తెలుగుతో పాటు ఏకకాలంలో చిత్రీకరించారు. కన్నడ చంద్రహాస 1965, మార్చి 23న విడుదలయ్యింది.
మూలాలు[మార్చు]
- ↑ రాధాకృష్ణ (16 May 1965). "చిత్రసమీక్ష చంద్రహాస". ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original on 23 జూలై 2020. Retrieved 23 July 2020.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)