Jump to content

భరతముని

వికీపీడియా నుండి

భరతముని (క్రీ.పూ మూడవ శతాబ్దం) ప్రాచీన భారత దేశానికి చెందిన పండితుడు. సంగీత నాట్యాలలో దిట్ట. ఈయన నాట్యశాస్త్రమనే ప్రఖ్యాతమైన గ్రంథాన్ని రాశాడు. ఇది ప్రాచీన భారతదేశంలో నాటకరంగం ముఖ్యంగా సంస్కృత నాటకాల గురించి రాయబడింది. దీనికి అభినవ గుప్తుడు అభినవ భారతి అనే పేరిట వ్యాఖ్యానం రాశాడు. ప్రాచీన భారతీయ సంగీతం, నాట్యనికి ఈ గ్రంథంలో మూలాలున్నాయి.

ఈ గ్రంథంలో 36 అధ్యయాలు ఉన్నాయి. అభినయాన్ని ఆధారంగా చేసుకుని నాట్య శాస్త్రాన్ని నాలుగు భాగాలుగా భరత ముని విభజించాడు. [1]

  1. సాత్వికాభినయం - సౌమ్యమైన భావప్రకటన.
  2. ఆంగికాభినయం - మనోభావాలను శరీరాంగాల కదలిక ద్వారా వ్యక్తీకరించటం
  3. వాచికాభినయం - వాక్కు ద్వారా భావప్రకటన
  4. ఆహార్యం - వేషం ద్వారా భావ వ్యక్తీకరణం.

పది రకాలైన రూపక భేదాలను గర్తించి వివరించాడు. పాశ్చాత్య దేశాలలో డ్రామా అని పిలువబడే నాటకం ఈ పదింటిలో ఒకటి. ఆచార్య పోనంగి శ్రీరామ అప్పారావు భరతముని నాట్య శాస్త్రాన్ని తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని పొందాడు.

మూలాలు

[మార్చు]
  1. Bharattoday, Admin. "Bharattoday". bhaarattoday.com. Archived from the original on 23 ఆగస్టు 2017. Retrieved 22 April 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=భరతముని&oldid=3879759" నుండి వెలికితీశారు