అక్షాంశ రేఖాంశాలు: 15°54′21″N 80°28′04″E / 15.905800°N 80.467740°E / 15.905800; 80.467740

భావనారాయణ స్వామి దేవాలయం, బాపట్ల

వికీపీడియా నుండి
(భావనారాయణ స్వామి దేవాలయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భావనారాయణ స్వామి దేవాలయం
భావనారాయణ స్వామి దేవాలయం, బాపట్ల is located in ఆంధ్రప్రదేశ్
భావనారాయణ స్వామి దేవాలయం, బాపట్ల
ఆంధ్రప్రదేశ్ లో స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు15°54′21″N 80°28′04″E / 15.905800°N 80.467740°E / 15.905800; 80.467740
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాజిల్లా
స్థలంబాపట్ల
సంస్కృతి
దైవంభావనారాయణ
ముఖ్యమైన పర్వాలురథోత్సవం
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రావిడ నిర్మాణం
దేవాలయాల సంఖ్య1
శాసనాలుద్రావిడ భాషలు , సంస్కృతం
చరిత్ర, నిర్వహణ
స్థాపితంశాలివాహన శకం 515 (కల్యాది 3694, సా.శ. 594) లో
పంచభావన్నారాయణ క్షేత్రాలు బాపట్ల , పొన్నూరు , సర్పవరం, పెదగంజాం, భావదేవరపల్లి

భావన్నారాయణ స్వామి దేవాలయం, బాపట్ల జిల్లా, బాపట్ల పట్టణంలో ఉంది.ఇది తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఇది ఒకటి.[1] ఇది పూర్వం చోళుల చే నిర్మితమైంది. శైవానికి పంచారామక్షేత్రాలు ఉన్నట్టుగానే, వైష్ణవానికి కూడా పంచభావన్నారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవి బాపట్ల (భావపురి), పొన్నూరు (స్వర్ణపురి), భావదేవరపల్లి (కృష్ణా జిల్లా), సర్పవరం (నేడు కాకినాడలో అంతర్భాగం), పట్టిసం. వీనిలో ప్రకాశం జిల్లాలోని పెదగంజాం కూడా ఉందని చెప్తారు. వీటిలో ప్రధానమైంది బాపట్ల. ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్ల గా, బాపట్లగా మారింది. ఈ దేవాలయంలో భావన్నారాయణుడు ఇతర పరివార దేవతలయిన శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవార్లు, ఆళ్వారులతో కొలువైవుండి భక్తుల ఇష్టదైవంగా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా కేశవస్వామి ఎంతో సుందరంగా ఉండి భక్తులకు కనువిందు చేస్తాడు.ఇది పురాతన ఆలయం. పవిత్రోత్సవం, రథోత్సవం బాగా జరుగతాయి. ఈ ఆలయం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.[2] ఇక్కడ ప్రధాన దైవం క్షీర భావనారాయణ స్వామి తన భార్య సుందరవల్లితో కలిసి కొలువై ఉన్నాడు. ఇక్కడి దేవత స్వయంభూ (స్వయంగా వ్యక్తీకరించబడినది).[3]

శ్రీ కృష్ణదేవరాయలు ఈ దేవస్థానాన్ని సందర్శించినట్టుగా ఆధారాలున్నాయి. ఆలయంలోని ప్రతి రాతిపైనా స్థలపురాణం, ఆలయచరిత్ర ఇత్యాది విషయాలు రాయబడ్డాయి. ప్రతిఏటా వేసవికాలంలో వైభవంగా జరిగే తిరునాళ్ల (బ్రహ్మోత్సవాలు) కు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చిచేరతారు.

చాలాకాలంగా మరమత్తులకు నోచుకోని ఈ ఆలయ గాలి గోపురం 2011 అక్టోబరు 23 న కుప్పకూలింది.

ఆలయ విశేషాలు

[మార్చు]
  • భావన్నారాయణ స్వామి మూర్తి కాలి వేళ్లపై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉంటుందట.
  • మరో వింత ఏమిటంటే ఆలయంలోపల చలికాలంలో వెచ్చగాను, ఎండాకాలంలో చల్లగాను మనం అనుభూతికిలోనవుతాం.
  • గతంలో ఆలయంలోనే శివాలయం కూడా అంతర్భాగంగా ఉండేది.
  • ఈ ఆలయానికి రెండు ధ్వజ స్తంభాలు ఉండటం, ఆలయ స్తంభాలు గజపాద ( ఏనుగు కాలు) ఆకారంలో స్తంభాలు ఉండటం విశేషం.
  • ఆలయంలో గర్భగుడి వెనుక పైకప్పు పై మత్స్యం (చేప ఆకారం) కనిపిస్తుంది. దాన్ని తాకితే శుభమని భక్తులు భావిస్తారు.
  • దేశంలోనే ఎక్కడాలేనట్టుగా విఖనస మునీంద్రులకు కూడా మందిరం ఉంది...అందుకే బాపట్ల మంచి విద్యాకేంద్రంగా వెలుగొందుతున్నదని చెప్తారు.

ఆలయచరిత్ర

[మార్చు]

ఇది స్వయంవ్యక్తక్షేత్రం. ఈ ఆలయం శాలివాహన శకం 515 (కల్యాది 3694, సా.శ. 594) లో క్రిమికంఠ చోళునిచే నిర్మించబడింది. గ్రామం 8 దిక్కులలో వళ్ళాలమ్మ, కుంచలమ్మ, శంకరమ్మ, శింగారమ్మ, ధనకొండలమ్మ, మూలకారమ్మ, నాగభూషణమ్మ, బొబ్బలమ్మ అనే గ్రామశక్తులను ప్రతిష్ఠించారు.[3] క్రిమికంఠచోళుని తర్వాత, ఈ ప్రాంతంపై ఆధిపత్యం వరుసగా నెరిపింది చోళభూపాల దేవుడు, వీర ప్రతాపశూర భల్లయ చోళ మహారాజు, కుళోత్తుంగ చోళయదేవ మహారాజులు. ఆ తరువాత గజపతులు (1319 వరకు), తర్వాత శ్రీకృష్ణదేవరాయలు (18సం.లు) తర్వాత అచ్యుతదేవరాయల, సదాశివరాయల ఆధీనంలో ఈ ఆలయం మహోజ్వలంగా వెలిగింది. ఆ కాలంలో ఎంతగానో ప్రసిద్ధి చెందింది. కానీ తదనంతరం వచ్చిన మహ్మదీయుల, ఫ్రెంచి, ఆంగ్లేయుల దండయాత్రలకు, దోపిడీలకు లోనైంది. వారు అతి ప్రాచీనమైన ఆలయ శిల్పసంపదకుకు ఎనలేని నష్టం చేసారు. క్రమంగా ఆలయం జీర్ణావస్థకు చేరుకుంది.

ఫ్రెంచివారు గ్రామ శక్తులను ధ్వంసం చేయగా ప్రస్తుతం పోలేరమ్మను గ్రామానికి పశ్చిమంగా తూర్పు ముఖంగా ప్రతిష్ష్టించారు. తర్వాత బ్రిటీషు కాలంలో కొందరు ప్రధానాలయానికి పక్కగా ఉన్న శివాలయంలోని శివలింగాన్ని తీసుకెళ్లి ప్రత్యేకంగా మందిరాన్ని నిర్మించుకున్నారు. (ఆ విధంగా విదేశీయులు విభజించు పాలించు అన్న తమసిద్ధాంతాన్ని మతసంబంధిత విషయాల్లో కూడా చక్కగా అమలుపరిచారు.)

అదేకాలంలో దివాన్ గావున్న కాండ్రేగుల జోగిజగన్నాథరావు బహద్దూరు (రాజమండ్రి), ఆ తర్వాత వాసిరెడ్ది వెంకటాద్రి నాయుడు ఆలయాన్ని పునరుద్ధరించారు.

ఈ ఆలయాన్ని రాజమండ్రి నుండి కద్రెంగుల జోగి జగన్నాథరావు బహదూర్, తరువాత రాజా వాసిరెడ్డి వెంకటాద్రి పునరుద్ధరించారు. సా.శ.1850లో చల్లపల్లి జమీందార్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి ఆలయ గోపురాన్ని నిర్మించాడు. 85 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు ఉన్న ఆలయ గోపురం 23 అక్టోబర్ 11న కూలిపోయింది.

సాధారణ సమాచారం

[మార్చు]

ఎలా చేరుకోవాలి:ఇది పాత బస్టాండ్ నుండి 1 కి.మీ దూరంలో ఉంది. ఆటో రిక్షా లేదా రిక్షా ద్వారా లేదా బస్టాండ్ నుండి నడక ద్వారా కూడా ఆలయానికి చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ నుండి అర కి.మీ.దూరంలోపే ఉంది. [4]

మూలాలు

[మార్చు]
  1. Sanagala, Naveen (2015-06-13). "Bhavanarayana Swamy Temple, Bapatla". HinduPad. Retrieved 2022-05-08.
  2. "Religious Tourism | Bapatla District, Government of Andhra Pradesh | India". Retrieved 2022-05-08.
  3. 3.0 3.1 "Bapatla Bhavanarayana Swamy Temple - History, Timings, Phone, Pic". Temple Darshan, Pooja and Sevas Information. 2016-06-25. Retrieved 2022-05-08.
  4. "Bapatla Bhavanarayana Swami Temple – Loving Bapatla". Retrieved 2022-05-08.[permanent dead link]

వెలుపలి లంకెలు

[మార్చు]
  • భావన్నారాయణస్వామి స్థల ప్రభావం - నల్లూరి రంగాచార్యులు
  • భక్తి మాసపత్రిక
  • స్థానికగాథలు