భాషా భాగాలు
Jump to navigation
Jump to search
వివిధ భాషలలో భాషా భాగాలు వేర్వేరు రకాలుగా విభజించబడ్డాయి.
చరిత్ర
[మార్చు]పదాల వర్గీకరణ చరిత్రలో చాలా పురాతన కాలం నుంచి గమనించవచ్చు. సంస్కృత వ్యాకరణ వేత్త "యాస్కుడు", క్రీ. పూ. 5 లేక 6 వ శతా నిరుక్తము అనే గ్రంధంలో పదాలను నాలుగు ముఖ్యమైన భాగాలుగా విభజించాడు. [1]
- నామ -
- ఆఖ్యాత - క్రియ
- ఉపసర్గ
- నిపాత
ఈ నాలుగు భాగాలను రెండు వర్గాలుగా విభజించాడు. (నామ, ఆఖ్యాత) మరియూ (ఉపసర్గ, నిపాత)
ప్రస్తుత భాషాభాగాలు
[మార్చు]తెలుగులో భాషా భాగాలు
- నామవాచకములు - మనుష్యుల పేర్లు, జంతువుల పేర్లు, ప్రదేశముల పేర్లు, వస్తువుల పేర్లు తెలియజేయు పదములు నామ వాచకములు. కృష్ణ, సీత, పాఠశాల.
- సర్వనామములు - నామ వాచకములకు బదులుగా వాడబడునది - నువ్వు, మీరు,నేను,వాళ్ళు,వీరు
- విశేషణములు - నామవాచకం యొక్క గుణములను తెలియజేయు పదములు విశేషణములు - నీలము, ఎరుపు, చేదు, పొడుగు.
- క్రియలు - పనులన్నియు క్రియలు - చదువుట, తినుట, నడచుట.
- అవ్యయములు - లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు - భలే, అక్కడ,అయ్యో,అమ్మో.