మజ్జి రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామారావ్ ఆర్ట్స్
మజ్జి రామారావు
జననం1941
India పోడూరు పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్
మరణం2024 మార్చి 31
నివాస ప్రాంతంచెన్నై
వృత్తిసినీ పబ్లిసిటీ డిజైనర్
ప్రసిద్ధిసినీ పబ్లిసిటీ డిజైనర్
మతంహిందూ
పిల్లలుఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
తండ్రిలచ్చన్న
తల్లిఅప్పయ్యమ్మ

మజ్జి రామారావు (1941 - 2024 మార్చి 31) తెలుగు సినీ పరిశ్రమలో "రామారావ్ ఆర్ట్స్" నామంతో నాలుగు దశాబ్దాలపాటు సినిమాపోస్టర్లని డిజైన్ చేసినవారు. 1965లో మొదటి సినిమా పోస్టర్స్ చెయ్యడానికి ‘పెరియ ఇడత్తు పెణ్’ తమిళ సినిమాకు అవకాశం వచ్చినప్పుడు దానిమీద ‘రామారావ్ ఆర్ట్స్’ అనే ఇంగ్లీష్ సంతకం చేశారు. ‘తాత మనవడు’ చిత్రానికి డిజైన్స్ చేసినప్పుడు రామారావు పేరు పరిశ్రమలో అందరికి తెలిసింది.

జీవిత విశేషాలు

[మార్చు]

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో ఐదుగురన్నదమ్ముల్లో మధ్యముడిగా జన్మించారు. హైస్కూల్ చదువును అర్థంతరంగా ముగించుకొని, పొట్ట చేతపట్టుకుని, చేతిలో ఉన్న బొమ్మలుగీసే కళను నమ్ముకొని మద్రాసు చేరాడు. 'స్టూడియో కేతా' అధిపతి కేతా సాంబమూర్తి శిష్యుడిగా చేరాడు. రామారావు రెండు మూడు సంవత్సరాలపాటు డిజైనింగ్, లెటరింగ్లోను అనుభవం సంపాదించాక తనతోపాటు వున్న గంగాధరం, సత్యనారాయణమూర్తిలతో కలిసి బయటకు వచ్చి వారి పేర్లలోని మొదటి అక్షరాలతో ‘స్టూడియో సరాగం’ సంస్థను స్థాపించడం, సుమారు రెండున్నర సంవత్సరాలనంతరం స్వతంత్రంగా చెయ్యాలనే అభిలాషతో బయటకువచ్చి త్రిమూర్తి స్ట్రీట్లో ఏకాబ్రేశ్వరరావుగారు వుంటున్న ఇంట్లోనే ఒక భాగంలో వుంటూ బుక్ రేపర్లు, స్టోరీ ఇలస్ట్రేషన్స్తో కాలం గడపడం ప్రారంభించారు. అంచెలంచెలుగా పెరిగి, స్వంత స్టూడియో స్థాపించుకొని, నాలుగుభాషల్లో పెద్దపెద్ద నిర్మాణసంస్థలకూ, నటులకూ ప్రీతిపాత్రుడైన పబ్లిసిటీ ఆర్టిస్టుగా ఎదిగారు.


పబ్లిసిటీ డిజైన్స్ చేసిన కొన్ని చిత్రాలు

[మార్చు]

అభిమానవంతులు, ఆడజన్మ, అమ్మ మాట, అనురాగాలు, ఐలిపీఠం, బంగారక్క, భలే రంగడు, చదువు సంస్కారం, గాంధీ పుట్టిన దేశం, గౌరి, హంతకులు – దేవాంతకులు, ఇల్లాలు తీర్పు, ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య, ఇంటిగుట్టు, ఇంటింటి కథ, జగత్ జెట్టీలు, జగత్ కిలాజీలు, కలియుగ రాముడు, జమిందారుగారి అమ్మాయి, కాలం మారింది, ఎం.ఎల్.ఏ. ఏడుకొండలు, మండలాధీసుడు, మేనకోడలు, ఒకే రక్తం, పల్లెపడుచు, పట్టుకుంటే లక్ష, ప్రేమతరంగాలు, పుట్టింటి గౌరవం, సింహబలుడు, స్నేహబంధం, సుఖ దుఃఖాలు, తరంగిణి, తాత-మనవడు, తొలిరేయి గడిచింది, తూర్పు పడమర, వైకుంఠపాళి లాంటి 300 పైగా చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

అధారాలు

[మార్చు]