Jump to content

మది

వికీపీడియా నుండి
మది
మది సినిమా పోస్టర్
దర్శకత్వంనాగ ధనుష్
రచననాగ ధనుష్
నిర్మాతరామ్ కిషన్
తారాగణం
ఛాయాగ్రహణంవిజయ్ ఠాగూర్
కూర్పుప్రదీప్
సంగీతంపివిఆర్ రాజా
నిర్మాణ
సంస్థ
ప్రగతి పిక్చర్స్
విడుదల తేదీ
2022 నవంబరు 11
సినిమా నిడివి
139 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మది (ప్రేమ-విరహం-ప్రళయం) అనేది 2022 నవంబరు 11న విడుదలైన తెలుగు సినిమా.[1] ప్రగతి పిక్చర్స్ బ్యానరులో రామ్ కిషన్ నిర్మించిన ఈ సినిమాకు నాగ ధనుష్ దర్శకత్వం వహించాడు. శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన ఈ సినిమాకు పివిఆర్ రాజా సంగీతం అందించాడు.[2]

కథా సారాంశం

[మార్చు]

అభిమన్యు (శ్రీరామ్ నిమ్మల), మధు (రిచా జోషి) ఇద్దరూ పక్కపక్క ఇళ్ళల్లో ఉంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులం కారణంగా వారి ప్రేమకు పెద్దవారు ఒప్పుకోరు. మధు తండ్రి ఆమెకు వారి కులానికి చెందిన వారితో వివాహం జరిపిస్తాడు. మధు, అభి ఆమె వివాహం తర్వాత కూడా తమ ప్రేమను కొనసాగించాలని నిర్ణయించుకుంటారు. అయితే వారి ప్రేమను కొనసాగించడంలో వారు విజయం సాధిస్తారా లేదా అన్నది మిగతా కథ.[3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకుడు: నాగ ధనుష్
  • నిర్మాత: రాం కిషన్
  • సినిమాటోగ్రఫీ: విజయ్ ఠాగూర్
  • సంగీతం: పివిఆర్ రాజా
  • ఎడిటర్: ప్రదీప్
  • పాటలు: కడలి, పూర్ణాచారీ

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు పివిఆర్ రాజా సంగీతం అదించగా కడలి, పూర్ణాచారీ పాటలు రాశారు.

  1. ప్రణయం
  2. కవ్వించే కలవు

సంగీతం

[మార్చు]

ఈ చిత్రం యొక్క పాటలు, నేపథ్య సంగీతం పి.వి.ఆర్. రాజా స్వరపరిచాడు.[5]

సం.పాటపాట రచయితగానంపాట నిడివి
1."కవ్వించే కలవు"కడలిరమ్య బెహరా, సాయి చరణ్2:50
2."ప్రణయం"పూర్ణాచారిసాయి చరణ్, హరిణి ఇవటూరి3:45
3."సిరిమల్లెవే డీజే సాంగ్"నాగ ధనుష్రఘు కుంచె1:45
4."సోల్ ఆఫ్ మది"కడలిసునీత, దీపు2:58
5."మరువనా"కడలిదినకర్3:08
మొత్తం నిడివి:14:26

విడుదల

[మార్చు]

ఈ సినిమా 2022 నవంబరు 11న విడుదయింది.[6] ఈ సినిమాకు టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి 2.5/5, 123తెలుగు.కాం నుండి 2/5,[7] ఫిల్మ్ ఫోకస్ నుండి 2/5[8] రేటింగ్ వచ్చింది.

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (8 November 2022). "ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే". Archived from the original on 11 November 2022. Retrieved 11 November 2022.
  2. Madhi Movie Review: An emotionally stirring romantic drama, 2022-11-10, archived from the original on 2022-11-11, retrieved 2022-11-11
  3. "Review : Madhi Movie". www.123telugu.com. 2022-11-11. Archived from the original on 2022-11-11. Retrieved 2022-11-11.
  4. PINKVILLA (7 November 2022). "సెన్సిబిలిటీ ఉండే కథలనే సెలెక్ట్‌ చేసుకుంటా..'మది' ఒక డిఫరెంట్‌ లవ్ స్టోరి: శ్రీరామ్‌ నిమ్మల". Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.
  5. "Madhi". open.spotify.com. Spotify. Retrieved 18 November 2022.
  6. Arikatla, Venkat (2022-11-10). "'Madhi': Targets The Sensible Youth Audience". greatandhra.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-11-09. Retrieved 2022-11-11.
  7. "Madhi Telugu Movie Review". 123telugu.com (in ఇంగ్లీష్). 2022-11-11. Archived from the original on 2022-11-11. Retrieved 2022-11-11.
  8. "Madhi Movie Review & Rating". Filmy Focus (in ఇంగ్లీష్). 2022-11-10. Archived from the original on 2022-11-11. Retrieved 2022-11-11.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మది&oldid=4204091" నుండి వెలికితీశారు