మనలో ఒకడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనలో ఒకడు
దర్శకత్వంఆర్. పి. పట్నాయక్
రచనఆర్. పి. పట్నాయక్, తిరుమల్‌నాగ్‌
నిర్మాతగురుజాల జగన్మోహన్‌
తారాగణంఆర్. పి. పట్నాయక్
అనిత (నటి)
సాయి కుమార్
ఛాయాగ్రహణంఎస్‌.జె.సిద్ధార్థ్‌
సంగీతంఆర్. పి. పట్నాయక్
విడుదల తేదీ
నవంబరు 4, 2016 (2016-11-04)
భాషతెలుగు

మనలో ఒకడు 2016 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రం 2016 నవంబరు 4 న విడుదలైంది.[1]

దేవరాయ కళాశాలలో భౌతికశాస్త్రాన్ని బోధించే ఓ సాధారణ అధ్యాపకుడు కృష్ణమూర్తి (ఆర్‌.పి.పట్నాయక్‌). విద్యార్థుల్ని సొంత పిల్లలుగా భావించే మంచి వ్యక్తి. ఆయన భార్య శ్రావణి (అనిత) పిల్లలకి సంగీత పాఠాలు నేర్పిస్తుంటుంది. ఇల్లు, కళాశాల.. తప్ప మరో ప్రపంచం తెలీదు కృష్ణమూర్తికి. అలాంటి అధ్యాపకుడిపై కళాశాలలో చదువుకొనే ఓ విద్యార్థిని తనని లైంగికంగా వేధించాడని మూడో కన్ను ఛానల్‌కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తుంది. వెంటనే ఆ ఛానల్‌ ‘కీచకుడు’ అంటూ వార్తని ప్రసారం చేస్తుంది. దాంతో కృష్ణమూర్తి ఉద్యోగం పోతుంది. ఇంట్లో భార్యతో విభేదాలు తలెత్తుతాయి. బయట అంతా ఓ నేరస్తుడిలా చూస్తుంటారు. మరి నిజంగా కృష్ణమూర్తి ఆ తప్పు చేశాడా? మూడో కన్ను ఛానల్‌ ప్రసారం చేసిన ఆ వార్తలో నిజమెంత? కృష్ణమూర్తి ఉదంతంలో మూడోకన్ను ఛానల్‌ ఎండీ ప్రతాప్‌ (సాయికుమార్‌) పాత్ర ఏమిటి? తదితర విషయాల్ని తెలుపుతూ కథ సాగుతుంది.

నటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • ఛాయాగ్రహణం: ఎస్‌.జె.సిద్ధార్థ్‌
  • సంభాషణలు: తిరుమల్‌నాగ్‌
  • కూర్పు: ఎస్‌.బి.ఉద్ధవ్‌
  • నిర్మాత: గురుజాల జగన్మోహన్‌
  • కథ, కథనం, సంగీతం, దర్శకత్వం: ఆర్. పి. పట్నాయక్

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-06. Retrieved 2016-11-04.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మనలో_ఒకడు&oldid=4207450" నుండి వెలికితీశారు