Jump to content

మహానుభావులు (నాటకం)

వికీపీడియా నుండి
మహానుభావులు
మహానుభావులు పుస్తక ముఖచిత్రం
కృతికర్త: సోమంచి యజ్ఞన్న శాస్త్రి, (మూల నాటకం: రెవిజోర్, రచన: నికోలాయ్ గోగోల్)
సంపాదకులు: బొందలపాటి శకుంతలాదేవి, శివరామకృష్ణ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: దేశి కవితామండలి, దేశి ప్రెస్, విజయవాడ
విడుదల: మే 1957
పేజీలు: 114


మహానుభావులు 1957లో వచ్చిన తెలుగు సాంఘీక నాటకం.[1] రష్యన్ నాటక రచయిత నికోలాయ్ గోగోల్ 1836లో రాసిన రెవిజోర్ (ఇన్‌స్పెక్టర్ జనరల్) నాటకాన్ని సోమంచి యజ్ఞన్న శాస్త్రి అనుసృజన (అనువాదం) చేశాడు. జారుల కాలంలో రష్యన్ కులీనుల్లో పెరిగిన స్వార్థబుద్ధీ, మౌఢ్యం, రాజకీయ అవినీతీ, అక్రమాలను అవహేళన చెయ్యడంకోసం రాసిన ఈ నాటకం రష్యన్ సాహిత్య చరిత్రలో ముఖ్యపాత్ర పోషించింది.

పాత్రలు

[మార్చు]

ఈ నాటకంలోని పాత్రలు:[2]

  • రాఘవేంద్రరావు: దివాన్జీ-జిల్లా ఆఫీసరు
  • చంద్రిక: ఆయన రెండవ భార్య
  • కవిత: ఆయన మొదటి భార్య కూతురు
  • నాయుడు: జడ్జీ
  • డాక్టరు చంద్రశేఖర్: జిల్లా మెడికల్ అఫీసరు
  • ఆచార్లు: హెడ్ మాస్టర్
  • వెంకప్ప వంతులు: పోస్టుమాస్టరు
  • రామచంద్రయ్య: చిన్న ఉద్యోగం
  • రుద్రయ్య: ధర్మకర్త
  • భద్రయ్య: పురోహితుడు
  • సరసన్న: నౌకరు
  • లక్ష్మణస్వామి: హోటల్ సర్వర్
  • బంట్రోతు

ఇతర వివరాలు

[మార్చు]
  1. ఈ నాటకం నాలుగవ అంకంలోని రెండు పద్యాలు ఘంటసాల వెంకటేశ్వరరావు ఇచ్చిన గ్రామఫోన్ రికార్డు నుండి తీసుకోబడ్డాయి.
  2. దీనిని శిష్ట్లా వెంకటరావుకు అంకితం ఇవ్వబడింది.
  3. నాటకం ప్రదర్శించినవాళ్ళు ఐదు రూపాయలను ముంబైలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలకు అందించాలని సూచించారు.[3]
  4. ఈ నాటకం తొలిప్రదర్శనలో డి.వి.నరసరాజు కథానాయకుడి పాత్ర పోషించాడు.
  5. గొల్లపూడి మారుతీరావు ఈ నాటకానికి దర్శకత్వం వహించడంతోపాటు ప్రధానపాత్రధారిగా కూడా నటించాడు.

మూలాలు

[మార్చు]
  1. వెబ్ ఆర్కైవ్, నాటకాలు. "మహానుభావులు". www.web.archive.org. Retrieved 18 February 2020.
  2. వెబ్ ఆర్కైవ్, మహానుభావులు (నాటకం). "పాత్రలు". www.web.archive.org. Retrieved 18 February 2020.
  3. వెబ్ ఆర్కైవ్, నాటకాలు. "మహానుభావులు (నాటకం)". www.web.archive.org. Retrieved 18 February 2020.

ఇతర లంకెలు

[మార్చు]