అక్షాంశ రేఖాంశాలు: 16°4′58.800″N 79°17′45.600″E / 16.08300000°N 79.29600000°E / 16.08300000; 79.29600000

మిల్లంపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిల్లంపల్లి
పటం
మిల్లంపల్లి is located in ఆంధ్రప్రదేశ్
మిల్లంపల్లి
మిల్లంపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 16°4′58.800″N 79°17′45.600″E / 16.08300000°N 79.29600000°E / 16.08300000; 79.29600000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంయర్రగొండపాలెం
విస్తీర్ణం30.99 కి.మీ2 (11.97 చ. మై)
జనాభా
 (2011)[1]
5,331
 • జనసాంద్రత170/కి.మీ2 (450/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,991
 • స్త్రీలు2,340
 • లింగ నిష్పత్తి782
 • నివాసాలు1,067
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523327
2011 జనగణన కోడ్590530

మిల్లంపల్లి ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన యర్రగొండపాలెం నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 50 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1067 ఇళ్లతో, 5331 జనాభాతో 3099 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2991, ఆడవారి సంఖ్య 2340. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1337 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1813. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590530[2].

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి యర్రగొండపాలెంలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల యర్రగొండపాలెంలోను, ఇంజనీరింగ్ కళాశాల మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల బోయలపల్లిలోను, అనియత విద్యా కేంద్రం యర్రగొండపాలెంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేసిన నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

మిల్లంపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

మిల్లంపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 538 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 729 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 142 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 107 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 174 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 300 హెక్టార్లు
  • బంజరు భూమి: 590 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 515 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1036 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 369 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

మిల్లంపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 369 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

మిల్లంపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, జొన్న

గ్రామ చరిత్ర

[మార్చు]

ఈ గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం వెనుక, 10 రోజులక్రిందట, తక్కెళ్ళ హుస్సేనయ్య పొలంలో బాగుచేయుచుండగా, సా.శ.14,15 శతాబ్దాలనాటి రేఖా చిత్రాల విగ్రహాలు లభ్యమైనవి. ఒకటి రాతిపై చెక్కిన మహిషాసుర మర్దని విగ్రహం. ఇంకా ఆంజనేయస్వామి విగ్రహంతోపాటు, రెండు దిక్చూచి గుర్తుగల విగ్రహాలు బయల్పడినవి. వీటి ఆధారంగా నాలుగు దేవాలయాలకు దారులు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ విగ్రహాలను పరిశీలించిన పురాతత్వ శాస్త్రఙులు, ఇవి శ్రీకృష్ణదేవరాయల కాలంనాటివిగా గుర్తించారు. మిల్లంపల్లి రెవిన్యూరికార్డులలో మిల్లంపల్లి అని ఉండే ఈగ్రామాన్ని మిన్నంపల్లి అని కూడా పిలుస్తారు.ఇది ఒక శిధిలగ్రామం,జనంలేని ఊరు,డి పాపులేటెడ్ విలేజి. ఈ గ్రామం ఇప్పుడులేదు.కానీ గ్రామకంఠం ఉన్నది.గ్రామకంఠం సమీపంలో పురాతన వేణుగోపాలస్వామివారిగుడి ఉన్నది.మిల్లంపల్లి గ్రామము పూర్వము నూటఎనిమిదికవ్వములు ప్రతినిత్యము ఆడేటి గ్రామమని ఇక్కడ నివశించిన రమాసత్యమూర్తిగారనే ఉపాధ్యాయులు తెలిపియున్నారు. తురుష్కులు, సుల్తానులు,బందిపోట్లు దాడులవల్ల మరియు అనేకసార్లు అగ్నికి ఆహుతిఅగుటవల్ల ఈ మిల్లంపల్లి గ్రామము పూర్తిగా శిధిలమై గ్రామస్తులు పరిసరగ్రామాలలో స్ధిరపడ్డారు. ఈ రెవిన్యూ గ్రామం మూడు పంచాయితీలుగా విడిపోయినది. మురారిపల్లి, మొగుళ్ళపల్లి,కాశీకుంటతాండ లుగా మారిపోయింది. మురారిపల్లి ఈ గ్రామం శ్రీకృష్ణుని నామము (ముర+అరి) తో ఏర్పడినది.మిల్లంపల్లి వేణుగోపాలస్వామివారి గుడికూడా ఈ పంచాయితీక్రిందకే వస్తుంది. రెండవది మొగుళ్ళపల్లి ఒకప్పుడు మొగలిపొదల తోటలుండటంవల్ల ఈ గ్రామానికి మొగళ్ళపల్లి అనిపేరువచ్చి కాలక్రమేనా మొగుళ్ళపల్లి అయినది.ఈ పంచాయితీక్రిందనే రేగులపల్లి కూడా ఉన్నది. కాశీకుంటతాండ ఓ లంబాడివాళ్ళగూడెం దీనిక్రిందనే పిల్లికుంటతాండ,మెట్టబోడుతాండ గ్రామాలున్నవి.

మిల్లంపల్లివేణుగోపాలస్వామిగుడి మిల్లంపల్లిరెవిన్యూలోని సర్వేనెంబర్ 306 నందుగల య 2.63 సెంట్లలో ఈ ఆలయం కలదు. త్రిపురాంతకమునుండి శ్రీశైలమునకు నడకమార్గము ద్వారా పూర్వము యాత్రికులు దిగువపాలెం (యర్రగొండపాలెం) మీదుగా వెళ్ళేవారు.చక్రవర్తులు, రాజులు,సామంతులు,మంత్రులు, భక్తులు,ప్రజలు ఈ నడకమార్గాలద్వారా వెళ్ళెవారు.ఈ దారులలో ఎన్నో శివాలయాలు,వైష్ణవాలయాలు వెలసాయి. అలా యర్రగొండపాలెం మండలకేంద్రానికి ఒక కిలోమీటరు దూరంలో రుక్మిణీ సత్యభామాసహిత శ్రీవేణుగోపాల స్వామివారు వేంచేసి యున్నారు. గుడివెనుక గ్రామదేవతలు వెలసియున్నారు. ఈ గుడికి తూర్పున పెద్దమ్మ విగ్రహము, దక్షిణమున ప్రసన్నవెంకటేశ్వరస్వామి పడమర పోలేరమ్మ తల్లి ఉత్తరమున నరసింహస్వామివారు ఉన్నారు.

 పూర్వము ఈ ప్రాంతమునందు ముచికుందమహాముని తపస్సుచెసి,వెలిగొండనందు వెంకటేశ్వరుని, గొడ్రాలికొండనందు తిరుమలనాధుని,మిల్లంపల్లినందు వేణుగోపాలుని,బొల్లికొండవద్ద వెంకటేశ్వరుని ప్రతిష్టచేశారని ఐతిహ్యం.

శాసనాధారం. ఈ దేవాలయం ఎప్పుడు,ఎవరు నిర్మించారనే ఆధారం దొరకలేదు.కానీ ఇక్కడ స్వామివారికి ఉత్తరంగా ఓ శాసనం పాతిపెట్టబడి ఉన్నది. శాలివాహనశకం1440 అగు బహుదాన్యవత్సరం (సాదారణవత్సరం1518) వైశాఖ శుద్ద పంచమినాడు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన మిల్లంపల్లె గోపినాధదేవరకు,అనివారణసింహ్మరావు బిరుదుకలిగిన శ్రీపోతరాజు సింగరయ్య గారికుమారుడు వరదరాజులుగారు వారిఏలుబడిలో ఉన్న కొలుకుల సీమలోని ‘కూనబోయినపల్లి’ అనేగ్రామాన్ని స్వామివారి నైవేద్యాలకు సమర్పించినారు. ఈగ్రామ ఎక్కడో తెలియకున్నది.అనివారణసింహ్మారావు బిరుదుకల్గిన రాజులు ‘గుత్తి’పాలకులుగా కూడా ఉన్నారు. ఇది ఇక్కడలభించిన మొదటి 1518 సంవత్సరపు శాసనాధారం. గర్భాలయంతప్ప ఏలాంటి ప్రాకారములులేని ఈ ఆలయానికి,శాయపనేని పాలకులలోని వెంకటాద్రినాయనింగారిచెల్లెలు యగు ‘అక్కగారు’ అనుయామె సింహద్వారంగోపురం నిర్మించతలపెట్టినది. ఆమె తన స్వంతధనంతో ప్రాకారంకట్టించినది. సింహద్వారం కట్టించి,దానిపై జగతి,ఉపజగతి, మహాజగతి మొదలైనవి కట్టించినది.అయిదు నిలువులమట్టుకు ఒక అంతస్తు ఏర్పరచినది. అందుమీదను సకలమైన చిత్రవిచిత్రములుగా ప్రతిమమోదీ నిర్మించి,ధనంఅయిపోగా అంతస్తుపైకప్పు బండమీద “అక్కగారిధర్మం కప్పుబండతోసరి” అనిశిలాశాసనం లిఖించినట్లు దూపాడు కైఫీయత్తునందు వ్రాయబడినది. శాయపనేని అక్కగారు తమిళశిల్పులను(తంజావూర్) పిలిపించి వారిచే వివిధ శిల్పాలు చెక్కించారు. కుంభపంజరం,అష్టాదశభుజాలతోసదాశివుడు, యాళీశిల్పాలు,దశావతారాలు,దశనారసింహులు,నర్తనమండపం,కళ్యాణమండపం,జడలున్న శిల్పాలు, ఆంజనేయస్వామివారు,కోదండరాములవారు,ఏనుగులు,గజబంధనం,ఏకశిలపై ఏనుగు-నంది,తాబేళ్ళు, చేపలు,చంద్రగ్రహణం,నాగపడిగలు,వెక్కిరింతశిల్పాలు,శివలింగాలు,యోగులు,మొదలగు నూటఎమిదిమందిదేవతలు, లను జీవకళతో ఎంతో అందముగా చెక్కించారు. అలానే ఇక్కడ చేతిసంచితో (హ్యాండ్ బ్యాగు) తో ఉన్న స్త్రీ శిల్పము ప్రత్యేక ఆకర్షణగా నిలచియున్నది.ఆలయమునకు ఎదురుగా ఆంజనేయస్వామివారు,రాతిధ్వజస్ధంబం నిలపబడియున్నవి.అలానే లోపల గరుత్మంతుని చిన్నగుడిమరియు జీవధ్వజస్తంబం కూడాకలవు.ఆల్వారుళ విగ్రహములుకూడా కలవు. గోపురములను నిర్మింపధనముచాలని అక్కగారు, ప్రాకారంమీద పన్నెండు చిన్నచిన్న గోపురములను నిర్మించారు.వెంకటాద్రిపాలెం చెన్నకేశవస్వామివారిగుడి, గంజివారిపల్లి వరదరాజస్వామివారిగుడి, మిల్లంపల్లి దేవాలయ ప్రాకారం,సింహద్వారం అన్నీ ఒకేసారి నిర్మించినట్లు తెలియుచున్నది. దూపాటి కైఫీయత్ ఆధారంగా సాదారణ వత్సరం 1610-1638 మధ్యన నిర్మాణాలు జరిగియున్నవి అనితెలియుచున్నది. శిల్పరీతి అహోబిళ ఆలయగోపురరీతిని పోలియున్నది.

ఈమధ్యదొరికిన శిలలు : ఇటీవలి కాలంలో గుడి వెనుక ఉన్న పొలములో కొన్ని శిల్పములు బయల్పడినవి. వీనియందు ఆలయనిర్మాణ రేఖాచిత్రములు కలవని చరిత్రకారులు తెలిపియున్నారు.ఇంకా ఈ శిలలలో ఈక్షేత్రపాలకులుగా,తూర్పు త్రిపురాంతకేశ్వరుని గుడి,పడమర వెంకటాద్రిపాలెంచెన్నకేశవగుడి,ఉత్తరమున కొమరోలు లక్ష్మీనరసింహస్వామిగుడి,దక్షిణమున ప్రసన్నవెంకటేశ్వరస్వామి వెలిశారని రేఖాచిత్రములద్వారా తెలియుచున్నదని చారిత్రకపరిశోధకులు విద్వాన్ జ్యోతిచంద్రమౌళి గారు(అద్దంకి)మరియు తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ తెలియచేశారు.

పుస్తకాధారములు అన్నమరాజుచెన్నమంత్రి అనువారు వేణుగోపాలస్వామికి అంకితముగా శతకద్వయము రచించారు. ఊరె వీరభద్రకవి (1810-1877)అనువారు “భక్తసురసాలమిల్లముపల్లెఖేల వేణుగోపాల త్రిజగత్పవిత్రశీల” అనుమకుటంతో సీసపద్య శతకంవ్రాశారు. అలానే ఆధునిక కాలంలో దేవులపల్లి విశ్వనాధం గారు "వేణుగోపాల విను మావిన్నపంబు" అనుమకుటంతో శతకంవ్రాశారు. ఈ ఆలయం 1924 వసంవత్సరంలో అన్నమరాజువారి ఆధ్వర్యంలో మళ్ళీ,1980 లో యక్కలివారి ఆధ్వర్యంలోజీర్ణోద్ధారణకావింపబడినది. శిల్పకళాశోభితమైన ఈదేవాలయంలో ఈమధ్యకాలంలో అనేక సార్లు చోరులచేబడి మూలవిరాట్టుతోసహా ధ్వంసమైనది.2006 లో మళ్ళి స్వామివారిని ప్రతిష్టించారు. ఇక్కడ ముక్కోటి,గోకులాష్టమి,ఉగాది,దసరా పండుగలు కన్నులపండువగా నిర్వహిస్తారు. వైశాఖమాసములో పౌర్ణమినుండి తొమ్మిదిరోజులు బ్రహ్మోత్సవములు అత్యంతవైభవంగా నిర్వహిస్తారు.గరుడసేవరోజు స్వామివారు ఊరేగింపుగా వచ్చి పురవీధులలో విహరిస్తారు. వేణుగోపాలుని దర్శించండి-తరించండి

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం - ఈ ఆలయం 1518 లో, శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించింది. ఈ దేవాలయంలో గర్భగుడి ప్రక్కన ఒక శాసనం ఉంది.

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3678. ఇందులో పురుషుల సంఖ్య 1956, స్త్రీల సంఖ్య 1722, గ్రామంలో నివాస గృహాలు 698 ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

[మార్చు]