మూలా వెంకటరంగయ్య
మూలా వెంకటరంగయ్య | |
---|---|
జననం | మూలా వెంకటరంగయ్య |
మరణం | 12 మే, 2004 |
వృత్తి | వ్యాపారం, తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ |
తల్లిదండ్రులు |
|
మూలా వెంకటరంగయ్య భారతీయ చలన చిత్ర నిర్మాత, రచయిత. వాహినీ స్టూడియో ద్వారా చిత్రాలను నిర్మించిన వెంకటరంగయ్య తెలుగు , తమిళ సినిమాలకు రచనలు కూడా చేశాడు.
జీవిత విషయాలు
[మార్చు]వెంకటరంగయ్య అనంతపురం జిల్లాలోని తాడిపత్రి గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి నారాయణస్వామి కల్లు వ్యాపారంతో ధనవంతుడై తర్వాతికాలంలో రాయలసీమ టెక్స్ టైల్స్, నూనె మిల్లులు, పాల సరఫరా కేంద్రాలు మొదలైన స్థాపించి వ్యాపారాల్ని విస్తరించాడు.[1][2]
సినిమారంగం
[మార్చు]తండ్రి నారాయణస్వామి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డితో కలిసి 'వాహినీ పిక్చర్స్' పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా నిర్మించిన చిత్రాల నిర్మాణ బాధ్యతలను వెంకటరంగయ్య చూసుకునేవాడు. ఆ తరువాత వాహినీ స్టూడియో నిర్మించారు. ఇది దక్షిణ ఆసియాలో అతిపెద్ద సినీ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది.[3][4]
1950లో నారాయణస్వామి మరణించాడు. దాంతో వెంకటరంగయ్య కొంతకాలం స్టూడియోను నడిపి, 1961లో బి.నాగిరెడ్డికి వాహినీ స్టూడియోను అమ్మేశాడు. నాగిరెడ్డి ఆ స్టూడియోను విజయ వాహిని స్టూడియోస్ గా మార్చుకున్నాడు.
ఇతర వివరాలు
[మార్చు]వెంకటరంగయ్య తాడిపత్రి పురపాలక సంఘం చైర్మన్ గా కూడా పనిచేశాడు.[1][2]
మరణం
[మార్చు]వెంకటరంగయ్య అనంతపురం జిల్లాలోని తాడిపత్రి గ్రామంలో 2004, మే 12న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "The story in a road name - CHEN". The Hindu. 2009-12-07. Retrieved 2020-08-28.
- ↑ 2.0 2.1 "Telugu Cinema - Research - "Telugu Cinema - past and the present" by Gudipoodi Srihari". Idlebrain.com. Retrieved 2020-08-28.
- ↑ ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Narayana Swamy Moola పేజీ
- ↑ "Bhatktha Potana (1943) - Anantapur". The Hindu. 2011-12-11. Retrieved 2020-08-28.