Jump to content

రక్షకభట నిలయం

వికీపీడియా నుండి

రక్షకభట నిలయం, అనేది ప్రజల రక్షణ, క్షేమం కొరకు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన సేవా కేంద్రం. వీటిని వాడుకలో పోలీస్ స్టేషన్లు అని వ్యవహరిస్తారు. వీటిని హిందీలో ఠాణా అంటారు.సంబంధిత అధికారిని ఠాణాదారుడు అంటారు. ప్రజాలకు ఎలాంటి ఆపద సమయంలలో అత్యవసరం ఉండి, ముందగా గుర్తుకువచ్చి, ప్రజలతో మమేకం అయి సేవలను అందించేది పోలీసు వ్యవ్వస్థ

ఠాణాల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు

[మార్చు]
హైదరాబాద్‌ నారాయణగూడలోని నారాయణగూడ రక్షకభట నిలయం

అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారిని విచారించి, వారెవరో తెలుసుకోవడానికి చాలా సమయం పడుతోంది. దీంతో బయోమెట్రిక్‌ విధానం వైపు పోలీసు ఉన్నతాధికారులు మొగ్గు చూపుతున్నారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న 50వేల మంది నేరగాళ్లకు సంబంధించిన ఫొటోలు, వారి వివరాలు, వేలిముద్రలు ప్రస్తుతం పోలీసు స్టేషను‌లోనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. పోలీసు స్టేషను‌లో బయోమెట్రిక్‌ విధానం ప్రారంభించడం ద్వారా ఈ డాటాబేస్‌లో ఉన్న సమాచారంతో పోల్చి చూసుకోవడానికి వీలవుతుంది. పోలీసు ప్రధాన కార్యాలయంలోని కంప్యూటర్‌ సర్వీసెస్‌ విభాగంలోని డాటాబేస్‌ పోలీసు స్టేషనులకు అనుసంధానం కావడంతో నేరస్తులను గుర్తించడంతోపాటు, తప్పిపోయిన వారు, అనాథమృతదేహలు, గుర్తు తెలియని వ్యక్తుల హత్యలకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. ప్రధాన డాటాబేస్‌ సెంటర్‌లో ప్రస్తుతం 3,65,000 ఎఫ్‌ఐఆర్‌లు, తప్పిపోయిన వారికి సంబంధించి 8 వేల ఫొటోలు, గుర్తు తెలియని మృత దేహాలకు సంబంధించి 6 వేల ఫొటోలు, పోలీసులు స్వాధీనం చేసుకున్న 30 వేల వాహనాల వివరాలు, 3.76 కోట్ల సెల్‌ఫోన్‌ వినియోగదారుల సమాచారం, 90 వేల మంది వాహనదారులు, డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్న 80వేల మంది చిరునామాలు, 5.89 కోట్ల ఓటరు గుర్తింపు కార్డు దారుల సమాచారం సిద్ధంగా ఉంది. విమానాశ్రయాల్లోని ఇమిగ్రేషన్‌ కౌంటర్ల వద్ద సైతం పోలీసు డాటాబేస్‌ను ఉపయోగించుకుని తద్వారా నేరస్థులు విదేశాలకు పారిపోకుండే చూసేందుకు వీలుంటుంది .క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఎస్‌) కింద దేశంలోని ప్రతి పోలీసుస్టేషను‌లో ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌ అందుబాటులోకి తేనున్నారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]