Jump to content

రోజీ స్టీఫెన్‌సన్ గుడ్‌నైట్

వికీపీడియా నుండి
Dame

రోజీ స్టీఫెన్‌సన్ గుడ్‌నైట్
రోజీ స్టెప్
2018లో జరిగిన వికీకాన్ఫరెన్స్ నార్త్ అమెరికా కార్యక్రమంలో రోజీ స్టీఫెన్‌సన్ గుడ్‌నైట్
వృత్తిబిజినెస్ మేనేజ్‌మెంట్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
వికీపీడియన్
పిల్లలు1[1]
పురస్కారాలువికీపీడియన్ ఆఫ్‌ ద ఇయర్ (2016)

డేమ్ రోజీ స్టీఫెన్‌సన్-గుడ్‌నైట్, వికీపీడియాలో రోజీస్టెప్ గా పిలిచే అమెరికన్ వికీపీడియన్. వికీపీడియాలో మహిళల గురించిన సమాచార లేమిని తగ్గించడానికి మరిన్ని నాణ్యమైన మహిళల జీవిత చరిత్రలు ప్రాజెక్టులో రావడానికి ప్రారంభించిన ప్రాజెక్టు ద్వారా పేరొందింది.[3][4] వేలకొద్దీ వికీపీడియా వ్యాసాలు రాయడమో, మెరుగుపరచడమో చేసింది. 2016లో వికీపీడియన్ ఆఫ్ ది ఇయర్ గా ఆమెను గౌరవించారు. సెర్బియన్ నైట్ హుడ్ బిరుదు సాధించింది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

స్టీఫెన్సన్-గుడ్ నైట్ సెర్బియా మూలాలున్న వ్యక్తి. ఆమె మహిళా హక్కుల కార్యకర్త, యూనివర్సిటీ విమెన్ ఆఫ్ యుగోస్లావియా అధ్యక్షురాలిగా పనిచేసిన వ్యక్తి అయిన పాలినా లెబ్ల్-అల్బాలా మనవరాలు.[5][6] ఆమె తాత డేవిడ్ ఆల్బాలా వైద్యుడు, జియోనిస్ట్ నాయకుడు, అతను కొంతకాలం పాటు బెలే్గ్రడ్ లోని సెఫార్ది సముదాయానికి అధ్యక్షునిగా సేవలందించాడు.[7][8] చిన్నతనంలో ఆమె ప్రపంచ దేశాల సంస్కృతులపై ఆసక్తి పెంచుకుని, మానవ విజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేయాలనుకుంది; ఆమె తండి్ర ఆ ప్రయతా్నలను వ్యతిరేకించడంతో బిజినెస్ అడ్మినిసే్ట్రషన్ చదువుకుని ఎంబియే పూర్తిచేసింది.[1]

వికీపీడియన్ గా

[మార్చు]
Stephenson-Goodknight at the 2016 Wikimedia Diversity Conference in Washington, D.C.

2007లో స్టీఫెన్సన్-గుడ్ నైట్ వికీపీడియాలో దిద్దుబాట్లు చేయడం ప్రారంభించింది. ఉక్రెయిన్లో శాంతిదళాల్లో తాను పనిచేస్తున్న పట్టణం గురించి వికీపీడియా వ్యాసాన్ని దిద్దుబాటు చేసిన ఆమె కొడుకు ఎవరైనా వికీపీడియాలో మార్పుచేర్పులు చేయవచ్చనీ, వ్యాసాలు సృష్టించి విస్తరించవచ్చనీ చెప్పాడు. బుక్ లీగ్ ఆఫ్ అమెరికా ప్రచురిస్తున్న పుస్తకాల గురించిన సమాచారం వికీపీడియాలో వెతికి దొరకకపోవడంతో తానే రాయడం మొదలుపెట్టింది.[9] తన మానవ విజ్ఞాన శాస్త్ర ఆసక్తిని తీర్చడానికి విజ్ఞాన సర్వస్వం మంచి మార్గంగా ఆమె భావించింది. ఈ విషయంలో మార్గరెట్ మెయిడ్ అనే సాంస్కృతిక మానవ విజ్ఞాన వేత్త తనకు ఆదర్శమని చెప్తుంది రోజీ.[1][10]

2016 వికీమేనియాలో వికీపీడియా స్థాపకుడు జిమ్మీ వేల్స్ తో రోజీ స్టీఫెన్సన్ గుడ్ నైట్

అనేక సంవత్సరాల పాటు స్టీఫెన్ సన్ గుడ్ నైట్ భూగోళశాస్త్రం, భవన నిర్మాణ శాస్త్రం, వివిధ జీవిత చరిత్రల గురించి రాస్తూ వికీపీడియాలో కృషిసాగించింది. ఐతే తర్వాతికాలంలో మహిళల జీవిత చరిత్ర వ్యాసాలు రాయడంపై దృష్టిసారించింది.[1] 2013లో ఆంగ్ల వికీపీడియాలో ఆమె మూడు వేల వ్యాసాలు సృష్టించి, విస్తరించడమే కాక వాటిలో వెయ్యి వ్యాసాల పైచిలుకు వికీపీడియా మొదటి పేజీలో డిడ్ యూ నో? శీర్షిక కింద వచ్చాయి. ఈ క్రమంలో 2013లో బ్రిటన్లో ద హుఫింగ్టన్ పోస్టులో ఆమె గురించి ప్రత్యేక కథనం ప్రచురణ జరిగింది.[1] 2016 నాటికి ఆమె నాలుగు వేల వ్యాసాలు సృష్టించింది.[Note 1] లక్ష దిద్దుబాట్లు చేసింది.[3][11]

ఆమె వికీపీడియన్లుగా చేసిన అత్యుత్తమ కృషిని గుర్తిస్తూ వికీపీడియా వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ అందించే వికీపీడియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2016 సంవత్సరానికి గాను ఎమిలీ టెంపుల్-వుడ్ అనే మరో వికీపీడియన్తో కలిసి అందుకుంది.[3] వికీపీడియన్ ఆఫ్ ద ఇయర్ గా అవార్డు పొందేనాటికి ఆమె రాసిన వ్యాసాల్లో 1300 వ్యాసాలు డిడ్ యూ నోలో ప్రచురితమయ్యాయి.[10] వికీప్రాజెక్టు విమెన్, వికీప్రాజెక్టు విమెన్ రైటర్స్, విమెన్ ఇన్ రెడ్ వంటి ప్రాజెక్టులకు ఆమె సహ-వ్యవస్థాపకురాలు.[10] ఈ ప్రాజెక్టులు 15.5 శాతం నుంచి 16.35 శాతానికి వికీపీడియాలో మహిళల వ్యాసాల శాతాన్ని పెంచాయి.[2] 2016 ఏప్రిల్ నాటికి ఆమె ఆర్ట్ ప్లస్ ఫెమినిజం ఎడిటథాన్ వంటివాటిలోనూ పనిచేయసాగింది.[12]

మూలాలు

[మార్చు]

ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 Hussain, Netha (February 9, 2015). "Rosie Stephenson: The Woman Who Wrote Over Three Thousand Articles on Wikipedia". Huffington Post. Retrieved June 30, 2016.
  2. 2.0 2.1 Liu, Teresa Yinmeng (July 3, 2016). "Nevada City's Rosie Stephenson-Goodknight named co-Wikipedian of 2016 for addressing online gender gap". Western Nevada County Union. Archived from the original on 2016-08-26. Retrieved July 6, 2016.
  3. 3.0 3.1 3.2 "Wikipedia editing marathons add women's voices to online resource". Houston Chronicle. Retrieved November 25, 2017.
  4. Redden, Molly (March 19, 2016). "Women in science on Wikipedia: will we ever fill the information gap?". The Guardian. Retrieved June 30, 2016.
  5. Haan, Francisca de; Daskalova, Krasimira; Loutfi, Anna (2006). Biographical Dictionary of Women's Movements and Feminisms in Central, Eastern, and South Eastern Europe: 19th and 20th Centuries. Central European University Press. pp. 297–. ISBN 978-963-7326-39-4.
  6. Vučetić, Radina. "The Emancipation of Women in Interwar Belgrade and the "Cvijeta Zuzori ć " Society" (PDF). Yugoslav Association for Social History. Archived from the original (PDF) on 2014-03-09. Retrieved 2019-03-31.
  7. Radović, Nadežda (April 3, 2006). "Evokacija Srpskog Feminizma S Početka 20. Veka" (in Serbian). Medijska Dokumentacija. Retrieved June 30, 2016.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  8. "25 Years of the Israel-Serbia Diplomatic Relations". Embassy of Israel. December 25, 2017. Retrieved February 2, 2018.
  9. Bernard, Zoe (February 14, 2013). "Finding inspiration from editing Wikipedia: a profile of Rosie Stephenson-Goodknight". Wikimedia Foundation. Retrieved June 30, 2016.
  10. 10.0 10.1 10.2 Erhart, Ed (June 24, 2016). "Jimmy Wales names Emily Temple-Wood and Rosie Stephenson-Goodknight as Wikipedians of the Year". Wikimedia Blog. Retrieved June 30, 2016.
  11. "X!'s tools". wmflabs.org. Retrieved July 9, 2016.
  12. "Art+Feminism Wikipedia Edit-A-Thon". University of Nevada, Las Vegas Libraries. February 2016. Archived from the original on 2019-03-31. Retrieved June 30, 2016.

నోట్స్

[మార్చు]
  1. వీటిలో రీడైరెక్టులు లేవు "Pages Created". WMFlabs. Retrieved July 8, 2016.