లోకేష్ కనగరాజ్
లోకేష్ కనగరాజ్ | |
---|---|
జననం | [1] | 1986 మార్చి 14
విద్యాసంస్థ | పీ.ఎస్.జీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్[3] |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఐశ్వర్య (m. 2012) |
లోకేష్ కనగరాజ్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా దర్శకుడు. ఆయన 2017లో తమిళంలో విడుదలైన మానగరం సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి 2021లో మాస్టర్, 2022లో విక్రమ్ సినిమాల ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపునందుకున్నాడు.[4]
జననం, విద్యాభాస్యం
[మార్చు]లోకేష్ కనగరాజ్ 1986 మార్చి 14న తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కినాతుకడవులో జన్మించాడు. ఆయన వివేక్ విద్యాలయ మెట్రిక్యులేషన్ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసి పీ.ఎస్.జీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశాడు.
సినీ జీవితం
[మార్చు]లోకేష్ కనగరాజ్ ఎంబీఏ పూర్తి చేసిన తరువాత నాలుగున్నరేండ్లు బ్యాంకులో పని చేస్తూ సినిమాలపై ఇష్టంతో 2014లో ‘కస్టమర్ డిలైట్’ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ కు ఓ కార్పొరేట్ ఫిల్మ్ కాంపిటీషన్లో మొదటి ప్రైజ్ వచ్చింది. ఆ కాంపిటీషన్ న్యాయనిర్ణేతగా సినీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, ఆలా ఆయనతో ఏర్పడిన పరిచయంతో 2016లో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ‘అవియల్’ అనే ఇండిపెండెంట్ ఆంతాలజీ సినిమాలో ఒక భాగమైన ‘కాలం’ లఘు చిత్రానికి దర్శకత్వం వహించి అలా కార్తీక్ సుబ్బరాజు వల్ల ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
దర్శకత్వం వహించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | దర్శకుడు | రచయిత | గమనికలు |
---|---|---|---|---|
2017 | మానగరం | Yes | Yes | |
2019 | కైతి | Yes | Yes | |
2021 | మాస్టర్ | Yes | Yes | ఖైదీగా అతిధి పాత్ర |
2022 | విక్రమ్ | Yes | Yes | వెయిటర్‌గా అతిధి పాత్ర |
సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | ఇతర విషయాలు |
---|---|---|
2018 | వెల్ల రాజా | సహ రచయిత |
అవార్డులు
[మార్చు]సినిమా | అవార్డు | విభాగం | ఫలితం |
---|---|---|---|
నగరం | 10వ విజయ్ అవార్డులు | బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ | గెలుపు |
ఉత్తమ స్క్రీన్ ప్లే | ప్రతిపాదించబడింది | ||
కైతి | జీ తమిళ సినీ అవార్డులు | ఇష్టమైన దర్శకుడు | గెలుపు |
మాస్టర్ | గలాట్టా క్రౌన్ అవార్డులు | ఇష్టమైన దర్శకుడు 2020-21 | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ Lokesh Kanagaraj In Conversation With Ramya Subramanian | Vikram, retrieved 2022-05-25
- ↑ "Lokesh Kanagaraj Interview: Kaithi Is About A Father's Love And That Rare Bond Between Strangers". 22 October 2019.[permanent dead link]
- ↑ "A celebration of cinema and filmmaking - Times of India". The Times of India.
- ↑ V6 Velugu (19 June 2022). "స్క్రిప్ట్ లోనే యాక్షన్ సీన్స్ కూడా". Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)