కాకతీయ జంతు ప్రదర్శనశాల
ప్రారంభించిన తేదీ | 1985 |
---|---|
ప్రదేశము | వరంగల్, తెలంగాణ, భారత దేశము |
విస్తీర్ణము | 50 acres |
Memberships | సెంట్రల్ అథారిటీ ఆఫ్ ఇండియా |
కాకతీయ జంతు ప్రదర్శనశాల భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా, హనుమకొండలో ఉంది.[1] ఈ జంతు ప్రదర్శన శాల 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిని 2010 లో "సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా" జాతీయ జంతుప్రదర్శన శాలగా మార్చింది. ఇది 2013 నుండి సెంట్రల్ అథారిటీ ఆఫ్ ఇండియా అమలులోకి తెచ్చింది.[2] ఈ పార్కు అతి అందమైన సీతాకోక చిలుకల పార్కు. కాకతీయ జూ పార్క్ వరంగల్ పట్టణ జిల్లా,హనుమకొండ మండలం హనుమకొండ పట్టణంలోని హంటర్ రోడ్లో ఉంది.దీనిని వరంగల్ వన విజ్ఞాన కేంద్రం అని కూడా అంటారు.
విశేషాలు
[మార్చు]సామాన్య ప్రజానీకానికి వన్యసంరక్షణ గురించి తెలపడానికి ఈ కాకతీయ జూ పార్క్ ఏర్పాటు చేయబడింది. తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జూ పార్క్ లో వివిధ రకాల జంతువులతో పాటు చాలా మొక్కలను కూడా పెంచుతున్నారు. ఈ పార్కు దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో జింకలు, లేళ్లు, దుప్పులు, కోతులు, ఎలుగుబంట్లు మొదలగు జంతువులు; చిలుకలు, పావురాలు, నిప్పుకోళ్లు, నెమళ్లు వంటి పలురకాల పక్షులు; తాబేళ్లు, మొసళ్ల వంటి సరీసృపాలు సంరక్షించబడుతున్నాయి. ఈ పార్కులో వన్య సంరక్షణ గురించి పర్యాటకులకు తెలిజేసేందుకు అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ప్రత్యేక కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ పార్కును ప్రతి రోజు సుమారు 500 మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.
మూలాలు
[మార్చు]- ↑ "Warangal zoo to become National Park - The New Indian Express". Archived from the original on 2014-09-07. Retrieved 2014-10-06.
- ↑ "Warangal zoo to become National Park". Archived from the original on 2014-02-22. Retrieved 2014-10-06.