Jump to content

వారాల ఆనంద్

వికీపీడియా నుండి
వారాల ఆనంద్

వారాల ఆనంద్ భారతదేశానికి చెందిన కవి, రచయిత, సినీ విమర్శకుడు.[1] కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడిగా, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. సినిమాపై అనేక పుస్తకాలను రచించిన ఆనంద్ ఆంగ్లం, తెలుగులో వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లకు క్రమం తప్పకుండా రచనలు చేస్తుంటాడు. వారాల ఆనంద్ కు అనువాద రచనల విభాగంలో 2022 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కవి, పద్మభూషణ్‌ గుల్జార్‌ రాసిన ‘గ్రీన్‌ పోయెమ్స్‌’ను వారాల ఆనంద్‌ తెలుగులో ‘ఆకుపచ్చ కవితలు’ పేరుతో అనువాదం చేశాడు.[2][3]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

ఆనంద్ 1958 ఆగస్టు 21న తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలో జన్మించాడు. కరీంనగర్ లో డిగ్రీ వరకు చదివాడు. పి.జి. తెలుగు, తత్వశాస్త్రం, లైబ్రరీ సైన్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పూర్తి చేశాడు.

వృత్తిజీవితం

[మార్చు]

లైబ్రేరియన్ గా 1980-2016 వరకు పలు జూనియర్ డిగ్రీ కాలేజీల్లో అదేవిధంగా ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో గ్రంధాలయ భవన నిర్మాణం, రెండు జాతీయ సెమినార్ల నిర్వహణ, రెండు మైనర్ రిసర్చ్ ప్రాజెక్టుల నిర్వహణ, నేషనల్ బుక్ ట్రస్ట్ సహకారం తో బుక్ ఫెస్టివల్స్ , ఉత్తమ విధ్యార్థులకు గోల్డ్ మేడల్స్ బహూకరణ కార్యక్రమ నిర్వహణ, మొదలయిన కార్యక్రమాలు నిర్వహించాడు.

సాహిత్య అభిలాష

[మార్చు]

కవితలు చిన్న చిన్న కథలు రాయడం ప్రారంభించాడు. మొదటి కథ చిత్రిక వారపత్రికలో వచ్చింది. 1981లో మొదటి కవితా సంపుటి ప్రచురించాడు. జర్నలిస్ట్గా ఈనాడులో 10 ఏళ్ళు, సుప్రభాతమ్ వీక్లీలో 4 ఏళ్ళు, మా భూమి వీక్లీలో రెండేళ్ళు సంపాదకీయాలు రాస్తూ ఎన్నో రచనలు చేశాడు.

కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ నిర్వహణ

[మార్చు]

1978లో ఏర్పడ్డ కరీంనగర్ ఫిల్మ్ సొసైటి సినిమా వైపు దృష్టి మరల్చింది. ఫిల్మ్ భవన్ నిర్మాణం తర్వాత 5 ఏళ్ళు ఫెస్టివల్ డైరెక్టర్ జాతీయస్థాయిలో షార్ట్ అండ్ డాకుమెంటరీ చిత్రోత్సవాల నిర్వహణ, మొట్టమొదటిసారిగా ఫిల్మ్ తెలంగాణ చిత్రోత్సవ నిర్వహించాడు. ఫెస్టివల్ బుక్స్ కు సంపాదకత్వ బాధ్యతలు చేపట్టాడు.[4]

సినీ సంపాదకీయాలు

[మార్చు]
  1. నవ్య చిత్ర వైతాళికులు (భారతీయ సమాంతర చలన చిత్రకారుల జీవన, సృజనాల సమాహారం): 54 మంది సినీ దర్శకుల ప్రొఫైల్స్ అంతర్జాతీయ ఖ్యాతిపొందిన 54 మంది చిత్ర నిర్మాతల ప్రొఫైల్‌లు పుస్తకం అంతర్జాతీయ చలనచిత్రంగా విడుదలైంది. ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌లో 1999లో నిర్వహించబడింది. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు గిరీష్ కాస్రవెల్లిచే విడుదల చేయబడింది.
  2. బాలల చిత్రాలు పిల్లల సినిమాలపైన వెలువడ్డ మొట్టమొదటి పుస్తకం. భారతదేశంలో విదేశాలలో పిల్లల సినిమాపై ఒక పుస్తకం ఆ పుస్తకాన్ని ప్రముఖ దర్శకుడు షాజీ ఎన్ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో కరుణ్ హైదరాబాద్‌లో 1999 లో విడుదల చేశాడు.
  3. సినీ సుమాలు[5]
  4. 24 ఫ్రేమ్స్ భారతీయ అర్థవంతమైన "సినిమా వ్యాసాల" సంపుటి[6]
  5. బంగారు తెలంగాణాలో చలన చిత్రం (తెలంగాణ సినిమా దశ దిశ ను విశ్లేషించిన వ్యాసాల సమాహారం)
  6. తెలంగాణా సినిమా దశ-దిశ

కవితలు ,రచనలు

[మార్చు]
  1. లయ (కవిత్వం)[7] 1980
  2. మానేరు తీరం (కవిత్వం)[8]1999
  3. మానేరు గలగల (సాహిత్య విమర్శ)
  4. మనిషి లోపల (కవిత్వం)
  5. మెరుపు (సాహిత్యకారుల ఇంటర్వూలు)
  6. అక్షరాల చెలిమే (కవిత్వం)
  7. ఆకుపచ్చ కవిత (గుల్జార్ కవితానువాదం)
  8. ముక్తకాలు (తెలుగు & ఇంగ్లిష్)

డాక్యుమెంటరీ చిత్రాలు

[మార్చు]
  1. తెలంగాణా సాహితీ మూర్తులు[9]
  2. శివ పార్వతులు  పలు జాతీయ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమయింది
  3. లాంగ్ బాటిల్ విత్ షార్ట్ మెసేజెస్ తెలంగాణ ఎస్.ఏం.ఎస్.చిత్రం (అంతర్జాతీయ అవార్డు అందుకుంది)[10]
  4. 'ఏ రే ఆఫ్ హోప్'
  5. 'కఫిసో' ఏ సాగా ఆఫ్ ఫిల్మ్ లవర్స్

గుర్తింపులు, అవార్డులు

[మార్చు]
  1. సత్యజిత్ రే, మృణాల్ సేన్, కురూసోవ, బి. నర్సింగ్ రావుల చిత్రాలతోపాటు రష్యన్, జపనీస్ తదితర దేశాల చిత్రాల ప్రదర్శనతో పాటు, జిల్లా రాష్ట్ర స్థాయి సెమినార్లు నిర్వహించాడు.
  2. 1989లో ఉదయం దినపత్రికలో మొదటిసారిగా చేస్తూ డిల్లీలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంకు సంభందించిన సమాచారం తెలిపాడు.
  3. రాష్ట్ర నంది అవార్డుల ఎంపిక కమిటీ లో 2007 నుండి 2009 వరకు సభ్యత్వం కలిగి ఉన్నాడు
  4. కేరళ అంతర్జాతీయ ఫెల్మ్ ఫెస్టివల్ లో అంతర్జాతీయ జూరీ మెంబర్ గా పాల్గొన్నాడు
  5. 2022 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు[11]

మూలాలు

[మార్చు]
  1. "varala anand".
  2. Namaste Telangana (23 December 2022). "'ఆకుపచ్చ కవితలు'కు కేంద్ర పురస్కారం.. వారాల ఆనంద్‌కు సాహిత్య అవార్డు". Archived from the original on 23 December 2022. Retrieved 23 December 2022.
  3. Andhra Jyothy (25 March 2023). "వారాల ఆనంద్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
  4. "karimnagar film society".
  5. "సినీ సుమాలు".
  6. "24 ఫ్రేమ్స్".
  7. "వారాల ఆనంద్ తెలుగు కవిత: బాధ".
  8. "కవితలు". telugu.oneindia.com.
  9. "డాక్యుమెంటరీ చిత్రాలు".
  10. "LONG BATTLE WITH SHORT MESSAGES'".
  11. V6 Velugu (23 December 2022). "వారాల ఆనంద్ కు..సాహిత్య అకాడమీ అవార్డు". Archived from the original on 23 December 2022. Retrieved 23 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]

https://www.youtube.com/watch?v=fevyLWdc5Qs అక్షరాల తెర యూట్యూబ్ ఇంటర్వ్యూ

ఇవి కూడా చూడండి

[మార్చు]

తెలంగాణ తేజోమూర్తులు